Liquor Prices
Liquor Prices: వాతావరణంలో మార్పులతో ఈసారి ఫిబ్రవరిలోనే భానుడు భగ్గుమంటున్నాడు. వేడి, ఉక్కపోత పెరుగుతోంది. దీంతో ఫ్యాన్లు, కూలర్ల వినియోగం పెరిగింది. ఈ తరుణంలో శీతల పానీయాల అమ్మకాలూ ఊపందుకున్నాయి. ఇక మందుబాబులు చల్లని బీర్లు కోరుకుంటున్నారు. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు(Two Telugu State Governaments)మందు బాబులకు షాక్ ఇచ్చాయి. ధరలు పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. ఏపీలో రూ.99 అమ్మే బ్రాండ్, బీరు మినహా మిగతా అన్ని రకాల మద్యం బ్రాండ్ల ధరలను పెంచింది ఎక్సైజ్ శాఖ, విదేశీ తయారీ మద్యం, విదేశీ మద్యంపై అదనపు రిటైల్ ఎక్సైజ్ ట్యాక్స్ విధించనుంది. రిటైల్ విక్రాయాల మార్జిన్‌ను ఇటీవల 14.5 శాతం నుంచి 20 శాతానికి పెంచిన ప్రభుత్వం తాజాగా మళ్లీ పెంచింది.
బాటిల్‌పై రూ.10 వడ్డన..
తాజాగా ఏపీలో మద్యం ధరలు ప్రతీ బాటిల్‌ఫై రూ.10 పెంచినట్లు ఎక్సైజ్ శాఖమిషనర్ నిశాంత్‌కుమార్(Nishanth Kumar)తెలిపారు. ధర రూ.15 నుంచి రూ.20 వరకు పెరిగినట్లు జరుగుతున్న అసత్య ప్రచారం నమ్మొద్దని కోరారు.బాండ్, సైజ్‌తో సంబంధం లేకుండా ప్రతీ బాటిల్‌పై రూ.10 పెంచినట్లు పేర్కొన్నారు. రూ.99 లిక్కర్, బీర్ల ధరల్లో మాత్రం ఎలాంటి మార్పు లేదని వెల్లడించారు. కొత్త ధరలను మద్యం షాపులన్నీ ప్రదర్శించాలని ఆదేశించారు. ఈ పెంపు మంగళవారం(ఫిబ్రవరి 11) నుంచి అమలులోకి వస్తాయని తెలిపారు.
తెలంగాణలో బీర్ల ధరలు పెంపు..
ఇక తెలంగాణలో బీర్ల ధరలు పెంచుతూ ఎక్సైజ్ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ధరలు పెంచాలని తయారీ కంపెనీలు ఎప్పటి నుంచో కోరుతున్నాయి. అయితే గత ప్రభుత్వం పట్టించుకోలేదు. ప్రస్తుత ప్రభుత్వం కూడా ఏడాదిగా వాయిదా వేస్తూ వచ్చాయి. చివరకు ధరలు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. బీర్లపై 15 శాతం ధరలు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. పెరిగిన ధరలు మంగళవారం(ఫిబ్రవరి 11)నుంచే అమలులోకి వస్తాయి. జస్టిస్ జైస్వాల్ కమిటీ సిఫారసుల మేరకు ధరలు పెంచారు. దీంతో రేపటి నుంచి అన్ని బ్రాండ్ల బీర్ల ధరలు 15 శాతం పెరగనున్నాయి.