Mana Shankara Varaprasad Garu Story: సినిమా ఇండస్ట్రీలో సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు పెద్ద సినిమాల హవా మొదలవుతుంది. ఇక కొంతమంది దర్శకులు సైతం సంక్రాంతికి సినిమాలను రిలీజ్ చేస్తూ సేఫ్ గేమ్ ఆడుతూ సక్సెస్ అల్నౌ సాధిస్తారు. అనిల్ రావిపూడి సైతం సంక్రాంతి సినిమాల దర్శకుడిగానే గుర్తింపును సంపాదించుకున్నాడు. అతని సినిమాల్లో కామెడీ ప్రధాన పాత్ర ను పోషిస్తోంది. ఇక కొద్ది రోజుల నుంచి ఆయన కామెడీ కూడా రొటీన్ అయిపోయింది. ఈ మధ్యకాలంలో అనిల్ రావిపూడి ఒకే తరహా సినిమాలను చేస్తున్నాడు అంటూ అతని మీద నెగెటివ్ కామెంట్లు వస్తున్నాయి. ఇక ప్రస్తుతం ‘మన శంకర వరప్రసాద్’ సినిమా విషయంలో కూడా అదే జరుగుతుంది. ట్రైలర్ చూడ్డానికి పెద్దగా ఎఫెక్టివ్ గా అనిపించలేదు. చిరంజీవి సైతం ఇంప్రెస్సివ్ గా యాక్ట్ చేయలేదు అనిపించింది. కొన్ని యాక్షన్ ఎపిసోడ్స్ లో పర్లేదు అనిపించినా కూడా చిరంజీవి చెప్పే డైలాగ్ డెలివరీ మాత్రం అస్సలు బాలేదు…
గత ఏడాది ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాతో ఒక రొటీన్ రొట్ట సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చి సక్సెస్ ని సాధించానని చెప్పుకునే అనిల్ రావిపూడి ఈ సంవత్సరం సైతం మన శంకర వరప్రసాద్ సినిమాతో మరోసారి సక్సెస్ సాధిస్తానని చెబుతున్నాడు.
ఇక ఫ్యామిలీ ఆడియన్స్ సైతం తన సినిమాలను చూసి విసిగిపోయారు. కాబట్టి ఈ సినిమా విషయంలో ఫ్యామిలీ ఆడియన్స్ ఎలా రియాక్ట్ అవుతారు అనేది తెలియాల్సి ఉంది… ఎప్పుడు భార్య భర్తల మధ్య గొడవలు, తగాదాల మీదే అతను సినిమాలైతే చేస్తున్నాడు. ఇక ఈ సినిమాలో సైతం చిరంజీవి – నయనతార ప్రేమించి పెళ్లి చేసుకుంటారు.
వాళ్ళకి ఒక పిల్లాడు పుట్టిన తర్వాత వాళ్ళ మధ్య వచ్చిన గొడవలతో విడిపోవాలని అనుకుంటారు. ఈ క్రమంలో ఏమైంది వాళ్ళిద్దరు మళ్ళీ ఎలా కలిశారు అనేది ఈ సినిమా స్టోరీ గా తెలుస్తుంది. ఎఫ్2 సినిమా నుంచి ఆయన చేసే ప్రతి సినిమాలో ఇదే తరహా కథ కనిపిస్తుంది. మరి ఎందుకని ఆయన ఇదే పాయింట్ ని రిపీటెడ్ గా చేస్తున్నాడు అనేది ఎవరికి అర్థం కావడం లేదు. ఒక వర్గం ప్రేక్షకులైతే అనిల్ రావిపూడి సినిమాలను చూడడమే మానేశారు. ఇక చిరంజీవి సినిమా తో అనిల్ ఇంకెన్ని నెగెటివ్ కామెంట్లను మూటగట్టుకుంటాడో చూడాలి…