Anil Ravipudi and Chiranjeevi : చిరంజీవి హీరోగా అనిల్ రావిపూడి (Anil Ravipudi) దర్శకత్వంలో ఒక సినిమా రాబోతుంది. వీళ్ళ కాంబోలో వచ్చే సినిమా కోసం యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తుంది. ఇప్పటివరకు ఫెయిల్యూర్ ఎరుగని దర్శకుడిగా మంచి గుర్తింపును సంపాదించుకున్న అనిల్ రావిపూడి ఎప్పటి నుంచో చిరంజీవితో ఒక సినిమా చేయాలని తీవ్రమైన ప్రయత్నం చేస్తున్నప్పటికి ఆయన కల ఇప్పుడు నెరవేరింది. మరి ఈ సినిమాతో ఎలాంటి సక్సెస్ ని సాధిస్తారు. తద్వారా వీళ్ళు ఎలాంటి గుర్తింపును తెచ్చుకోబోతున్నారు అనేది కూడా తెలియాల్సి ఉంది. ఇక ఈ సినిమాతో యావత్ తెలుగు ఇండస్ట్రీ మొత్తం ఒక్కసారిగా ఉలిక్కి పడుతుంది అంటూ కొంతమంది కొన్ని కామెంట్లు అయితే చేస్తున్నారు. మరి మొత్తానికైతే అనిల్ రావిపూడి సినిమాలు కమర్షియల్ వే లోనే సాగుతూ ఉంటాయి. తద్వారా ఆయన సినిమాలకు ప్రేక్షకుల్లో విపరీతమైన క్రేజ్ అయితే దక్కుతోంది. ఈ సినిమాతో కూడా ఆయన అదే పద్ధతిని ఫాలో అవుతున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలు అన్నీ వైవిధ్యాన్ని సంతరించుకుంటూ ముందుకు సాగుతున్నాయి. రీసెంట్ గా పూజా కార్యక్రమాలను జరుపుకున్న ఈ సినిమా తొందరలోనే రెగ్యులర్ షూట్ కి వెళ్ళబోతున్నట్టుగా కూడా తెలుస్తోంది. అయితే ఈ సినిమాలో చిరంజీవి సిస్టర్ గా ఒక స్టార్ హీరోయిన్ నటించబోతుంది అనే వార్తలైతే వినిపిస్తున్నాయి.
Also Read : వచ్చే సంక్రాంతి కి చిరంజీవి విన్నర్ గా నిలుస్తాడా..? అనిల్ రావిపూడి ఏం చేయబోతున్నాడు..?
ఒకరిద్దరు హీరోయిన్ల పేరు బయటికి చెబుతున్నప్పటికి సినిమా యూనిట్ నుంచి అఫీషియల్ గా అయితే అనౌన్స్ మెంట్ అయితే రాలేదు. మరి ఏది ఏమైనా కూడా ఇప్పుడున్న స్టార్ హీరోయిన్లలో ఎవరో ఒకరిని చిరంజీవికి సిస్టర్ గా సెలెక్ట్ చేయబోతున్నారనే వార్తలు కూడా వస్తున్నాయి.
మరి ఈ సినిమాతో చిరంజీవి మరోసారి తన సత్తా చాటుకోవాలని చూస్తున్నాడు. ఇప్పటికే సీనియర్ హీరోలందరు వరుస సక్సెస్ లను సాధిస్తూ ముందుకు దూసుకెళ్తుంటే చిరంజీవి మాత్రం కొద్ది వరకు సతమతమవుతూ ఫ్లాపులను మూట గట్టుకుంటున్నాడు.
మరి ఈసారి చేయబోతున్న సినిమాతో భారీ విజయాన్ని అందుకొని తనకంటూ ఒక సపరేట్ క్రేజ్ ను ఏర్పాటు చేసుకోవాలనే ఉద్దేశ్యంలో చిరంజీవి అయితే ఉన్నాడు. మరి తను అనుకున్నట్టుగానే భారీ విజయాన్ని సాధించి తనకంటూ ఒక స్పెషల్ ఐడెంటిటిని క్రియేట్ చేసుకుంటాడా? లేదా అనేది తెలియాలంటే మాత్రం ఈ సినిమా రిలీజ్ అయ్యేంతవరకు వెయిట్ చేయాల్సిందే…ఇక ఈ సినిమా అటు చిరంజీవి కి, ఇటు అనిల్ రావిపూడి ఇద్దరికి చాలా కీలకంగా మారబోతోంది…
Also Read : 2026 సంక్రాంతికి చిరంజీవి సినిమాతో రానున్న అనిల్ రావిపూడి…ఆ పండుగ కూడా నాదే అంటున్న డైరెక్టర్…