Peddi vs Paradise : సినిమా ఇండస్ట్రీలో హీరోల మధ్య పోటీ అనేది సర్వసాధారణంగా ఉంటుంది. ఎందుకంటే ఒక హీరో ఒక భారీ సక్సెస్ ని సాధించి ముందుకు దూసుకు వెళ్తుంటే మరొక హీరో మరొక సినిమా తో భారీ సక్సెస్ ని అందుకోవాలనే దృఢ సంకల్పంతో ముందుకు సాగుతూ ఉంటాడు. ఇక వీళ్ళ మధ్య పోటీ అనేది తీవ్ర తరమవుతుంది. మరి ఇలాంటి సందర్భంలో ఎవరు ఏ సినిమాతో సూపర్ సక్సెస్ ని సాధించినా కూడా భారీ కలెక్షన్స్ ని కొల్లగొట్టడమే లక్ష్యంగా పెట్టుకుని ముందుకు సాగుతూ ఉంటారు. మెగా పవర్ స్టార్ గా తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను సంపాదించుకున్న రామ్ చరణ్ బుచ్చిబాబు డైరెక్షన్ లో చేస్తున్న పెద్ది (Peddi) సినిమాతో పెను రికార్డులను క్రియేట్ చేయడానికి సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఫస్ట్ షాట్ పేరుతో నిన్న రిలీజ్ చేసిన గ్లింప్స్ ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలను పెంచేసింది.
Also Read : అక్షరాలా 3 కోట్ల వ్యూస్..మొదటి షాట్ తోనే ప్రభంజనం సృష్టించిన ‘పెద్ది’
ఈ సినిమాలో రామ్ చరణ్ (Ram Charan) ఒక మాస్ లుక్ లో కనిపించబోతున్నాడు అనేది మరోసారి స్పష్టంగా తెలుస్తోంది. ఇక ఇదిలా ఉంటే నాని(Nani) లాంటి స్టార్ హీరో సైతం ప్యారడైజ్ (Paradaise) సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. అయితే ఈ సినిమాకు సంబంధించిన గ్లింప్స్ ని కూడా గత నెల రోజులు క్రితమే రిలీజ్ చేశారు…
ఇక ఈ గ్లింప్స్ ని చూస్తే మరోసారి నాని పవర్ ఫుల్ పాత్రను పోషించబోతున్నాడు అనే విషయమైతే చాలా స్పష్టంగా తెలుస్తోంది. మరి ఇలాంటి సందర్భంలోనే నాని లాంటి స్టార్ హీరో రామ్ చరణ్ తో పోటీపడి మరి తన సినిమాని రిలీజ్ చేయాలని అనుకుంటున్నాడు. ఇక ఇప్పటికే ప్యారడైజ్ సినిమాని వచ్చే సంవత్సరం మార్చి 26వ తేదీన రిలీజ్ చేస్తామంటూ అనౌన్స్ చేశారు.
మరి నిన్న రిలీజ్ అయిన పెద్ది గ్లింప్స్ లో ఈ సినిమాను మార్చి 27వ తేదీన రిలీజ్ చేస్తున్నామంటూ అనౌన్స్ మెంట్ చేశారు. ఒక్క రోజు గ్యాప్ లోనే ఈ రెండు సినిమాలు రావడం వల్ల రెండింటికి భారీగా డామేజ్ అయ్యే అవకాశాలైతే ఉన్నాయి. ముఖ్యంగా నాని సినిమాకి ఎక్కువగా డ్యామేజ్ జరిగే పరిస్థితి అయితే రావచ్చు. అందువల్ల నాని తన రిలీజ్ డేట్ ని మార్చుకునే అవకాశాలు ఉన్నాయా అనే కోణంలో కూడా కొన్ని ప్రశ్నలైతే తలెత్తుతున్నాయి. మరి ఈ సినిమాలతో వీళ్ళు ఎలాంటి సక్సెస్ ను దక్కించుకుంటారు అనేది తెలియాల్సి ఉంది…
Also Read : ‘పెద్ది’ టీజర్ పై అల్లు శిరీష్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు..మండిపడుతున్న ఫ్యాన్స్!