Anil Ravipudi , Chiranjeevi
Anil Ravipudi and Chiranjeevi : తెలుగు సినిమా ఇండస్ట్రీలో కమర్షియల్ డైరెక్టర్లకి మంచి గుర్తింపైతే ఉంది. ప్రస్తుతం సీనియర్ హీరోలందరు కమర్షియల్ డైరెక్టర్ల వెంట పడుతున్నారు. అనిల్ రావిపూడి (Anil Ravipudi) లాంటి దర్శకుడు చేసిన ప్రతి సినిమాతో భారీ విజయాన్ని అందుకుంటూ తనకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటిని క్రియేట్ చేసుకుంటున్నాడు. ఇప్పటి వరకు ఆయన చేసిన విజయాలు ఒకెత్తయితే ఇకమీదట చేయబోయే సినిమాలతో మరిన్ని సక్సెస్ లను సాధించాలని చూస్తున్నాడు. ఇక రీసెంట్ గా ‘సంక్రాంతికి వస్తున్నాం’ (Anil Ravipudi) సినిమాతో భారీ విజయాన్ని అందుకొని తన ఎంటైర్ కెరీర్ లో వరుసగా 8వ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు… ఇక ఈ సినిమాతో దాదాపు 350 కోట్లకు పైన కలెక్షన్లు రాబట్టడమే కాకుండా సీనియర్ హీరో అయిన వెంకటేష్ (Venkatesh) తో అంతా కలెక్షన్స్ ను కొల్లగొట్టడం అంటే మామూలు విషయం కాదు. ఇక ఇందులో కూడా ఆయన ఒక రికార్డును అయితే క్రియేట్ చేశాడు. ఈయన ప్రస్తుతం చిరంజీవితో ఒక సినిమా చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు. ఈ సినిమాతో భారీ విజయాన్ని నమోదు చేయాలని చూస్తున్నాడు. ఇక అందులో భాగంగానే చిరంజీవి ఎంటైర్ కెరియర్ లో ఇప్పటివరకు సాధించనటువంటి ఒక గొప్ప విజయాన్ని అతనికి అందించాలనే ప్రయత్నంలో కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది.
నిజానికి అనిల్ రావిపూడి (Anil Ravipudi) లాంటి దర్శకుడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉండడం ఇండస్ట్రీ చేసుకున్న అదృష్టమనే చెప్పాలి. ఎందుకంటే తెలుగులో సక్సెస్ రేట్ చాలా తక్కువగా ఉంది. అలాంటి సందర్భంలో అనిల్ రావిపూడి నుంచి వచ్చిన సినిమా సక్సెస్ సాధిస్తుండడం వల్ల ఆయన వల్ల కొంత వరకు సినిమా సక్సెస్ రేట్ కూడా పెరుగుతుందనే చెప్పాలి…
చిరంజీవి సినిమాలో ఆయనని ఢీకొట్టే విలన్ పాత్రలో ఎవరు నటించబోతున్నారనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. చిరంజీవికి విలన్ గా మోహన్ బాబుని తీసుకుంటే బావుంటుందని కొంతమంది అంటుంటే చిరంజీవి హీరోగా చేస్తే మోహన్ బాబు విలన్ గా అసలు చేయలేడు అంటూ మరి కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు. ఇక అందుతున్న సమాచారం ప్రకారమైతే ఈ సినిమాలో రాజశేఖర్ విలన్ గా నటించే అవకాశాలైతే ఉన్నట్టుగా తెలుస్తున్నాయి.
ఈమధ్య చిరంజీవి(Chiranjeevi) అనిల్ రావిపూడి (Anil Ravipudi) డిస్కషన్ లో రాజశేఖర్ (Rajashekar) పేరు కూడా ఎక్కువగా వినిపిస్తుందట. మరి ఏది ఏమైనా కూడా ఈ సినిమాతో మరో సక్సెస్ ని సాధిస్తే అనిల్ రావిపూడి త్రిబుల్ హ్యాట్రిక్ హిట్స్ ను నమోదు చేసుకుంటాడు. ఇక తాను ఎప్పటినుంచో చిరంజీవితో సినిమా చేయాలనుకుంటున్నాడు కాబట్టి తన కల కూడా నెరవేరుతుంది…