spot_img
Homeఎంటర్టైన్మెంట్సూపర్ స్టార్ కి ఫాదర్ గా బాలీవుడ్ స్టార్ !

సూపర్ స్టార్ కి ఫాదర్ గా బాలీవుడ్ స్టార్ !

Anil Kapoor
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా పరుశురామ్ దర్శకత్వంలో రానున్న ‘సర్కారు వారి పాట’ సినిమాలో ఫాదర్ క్యారెక్టర్ చాల కీలకమైనదట. అయితే, ఆ పాత్రలో మొదట చాలమందిని అనుకున్నా.. చివరకు ఆ పాత్రలో బాలీవుడ్ స్టార్ అనిల్ కపూర్ ను తీసుకున్నారు. మొదట అనిల్ ఒప్పుకోకపోయినా.. నమ్రతా బలవంతంతో అంగీకరించాడట. కాగా భారత బ్యాంకింగ్ రంగాన్ని కదిలించిన భారీ కుంభకోణాల చుట్టూ ఈ సినిమా కథ కేంద్రీకృతమైందని.. మహేష్ ఒక బ్యాంక్ మేనేజర్ అయిన అనిల్ కపూర్ కొడుకు పాత్రను పోషిస్తున్నాడని తెలుస్తోంది

Also Read: బాలయ్యా.. ఓవర్ బడ్జెట్ అయ్యా !

కాగా ఈ సినిమా కొత్త షెడ్యూల్ జ‌న‌వ‌రి నుంచి జ‌ర‌గాలి, కానీ షెడ్యూల్ వాయిదా పడింది. దాంతో దర్శకుడు స్క్రిప్టుని మ‌రింత ప‌ర్‌ఫెక్ట్ గా తీర్చిదిద్దుకోవ‌డానికి క‌థ‌లో కొన్ని కీల‌క‌మైన మార్పులు చేశాడు. ఈ క‌థ‌ మ‌హేష్ కి తొలిసారి వినిపించేట‌ప్పుడు ఇదో రివైంజ్ స్టోరీ. అంటే, త‌న త‌ల్లిని మోసం చేసిన ఓ వైట్ కాల‌ర్ నేర‌స్థుడ్ని ప‌ట్టుకోవ‌డానికి మహేష్ ఎలాంటి ప్ర‌య‌త్నం చేశాడు అనేది మెయిన్ పాయింట్ అట, కాకపోతే ఇప్పుడు ఈ పాయింట్ మార్చారని సమాచారం. పైగా వేలాది కోట్ల ఎగవేసిన ఓ బిజినెస్ మెన్ నుండి ఆ డబ్బు మొత్తాన్ని తిరిగి రాబట్టడానికి మహేష్ ఎలాంటి ప్రయత్నాలు చేశాడనేది చాలా ఇంట్రస్టింగ్ గా ఉంటుందట.

Also Read: పారితోషకంలోనూ ట్రెండ్ సృష్టించిన పవర్ స్టార్ !

ఏది ఏమైనా ఈ సినిమా టైటిల్ ప్రకటించినప్పటి నుండి, ఈ చిత్రంలోని కథకు సంబంధించిన అనేక ఊహాగానాలు వస్తూనే ఉన్నాయి. అన్నట్లు ఈ చిత్రంలో ఆహ్లాదకరమైన ఓ రొమాన్స్ ట్రాక్‌ కూడా ఉందని, చాలా కాలం తర్వాత మహేష్ లవర్ బాయ్‌ గా ఈ సినిమాలో కనిపించబోతున్నాడని తెలుస్తోంది. ఇక మైత్రీ మూవీ మేకర్స్, జీ ఎమ్ బి ఎంటర్టైన్మెంట్ ,14 రీల్స్ ప్లస్ సంస్థలు పరశురామ్ దర్శకత్వంలో ఈ ప్రెస్టీజియస్ మూవీ ను నిర్మిస్తున్నాయి.

మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్

Neelambaram
Neelambaramhttps://oktelugu.com/
Neelambaram is a Web Admin and is working with our organisation from last 6 years and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.

Related News

Most Popular

Balakrishna

Balakrishna: బాలయ్య కి ఫోన్ చేసిన ఎన్టీఆర్… ఇంటికి కూడా వెళ్తున్నాడుగా…

Balakrishna: సినిమా ఇండస్ట్రీలో బ్యాగ్రౌండ్ ఉన్నంత మాత్రాన సక్సెసులైతే రావు... స్టార్ డమ్ అనేది లభించదు. వాళ్ల సత్తాను చూపించి ప్రేక్షకులను మెప్పించగలిగితేనే వాళ్ళకంటూ ఒక ఇమేజ్ అనేది ఏర్పడుతుంది. లేకపోతే మాత్రం...
Talliki Vandanam Scheme

Talliki Vandanam Scheme: తల్లికి వందనం అందలేదా.. ఇలా చేయండి!

Talliki Vandanam Scheme: ఏపీ ప్రభుత్వం తల్లికి వందనం పథకం నిధులు విడుదల చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 65 లక్షల మంది వరకు విద్యార్థుల తల్లుల ఖాతాల్లో పదివేల కోట్ల రూపాయలు జమ కానున్నాయి....
CJP Protests

CJP Protests: సిజెపి ఆందోళనల వెనక ఖలిస్థానీ.. పది కోట్ల ఆఫర్.. వెలుగులోకి కీలక వీడియో

CJP Protests: అనుకున్నదే అయింది. అనుమానిస్తున్నదే జరిగింది. కేంద్ర ప్రభుత్వం ఊహించిందే చోటుచేసుకుంది. మొత్తానికి కాక్రోచ్ జనతా పార్టీ అసలు బాగోతం బయటపడింది. పేరుకు నీట్ పరీక్షలో అవకతవకులకు పాల్పడిన వ్యక్తులను శిక్షించాలని...
NEET Protest

NEET Protest: నాడు రైతుల ఉద్యమం.. నేడు నీట్ విద్యార్థుల పోరాటం.. నరేంద్ర మోడీ మౌనం అందుకే..

NEET Protest: సరిగ్గా నాలుగు సంవత్సరాల క్రితం కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ చట్టాలను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఆ చట్టాలను వ్యతిరేకిస్తూ రైతు సంఘాలు ఆందోళన నిర్వహించాయి. ఢిల్లీ సరిహద్దుల్లో తిష్ట వేసుకొని...
Talliki Vandanam:

Talliki Vandanam: తల్లికి వందనం: కూటమి సైలెంట్ వ్యూహం!

Talliki Vandanam: ఏపీలో కూటమి ప్రభుత్వం మరో రికార్డ్ సృష్టించింది. రెండో ఏడాది తల్లికి వందనం సాయం అందజేసింది. దాదాపు 65 లక్షల మంది లబ్ధిదారుల ఖాతాల్లో పదివేల కోట్ల రూపాయలకు పైగా...
Oktelugu Epaper