Andhra Pradesh : ఏపీలో( Andhra Pradesh) కూటమి ప్రభుత్వం పర్యాటక రంగంపై ఫుల్ ఫోకస్ పెట్టింది. గత ఐదేళ్ల వైయస్సార్ కాంగ్రెస్ పాలనలో పర్యాటకం పడకేసిందని చెబుతోంది. అందుకే పర్యాటకాన్ని పెద్ద పీట వేయడం ద్వారా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగుపరచాలని భావిస్తోంది. తద్వారా ఆదాయాన్ని సమకూర్చుకోవాలని కూడా చూస్తోంది. అందులో భాగంగా హోం స్టే విధానాన్ని ప్రవేశపెట్టేందుకు నిర్ణయించింది. దీని ద్వారా పర్యాటకులు తక్కువ ధరలు సొంతింట్లో ఉన్న అనుభూతి పొందే అవకాశం కల్పించనుంది. ప్రధానంగా ఆధ్యాత్మిక, పర్యాటక ప్రాంతాల్లో హోమ్ స్టే లను అభివృద్ధి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. అరకు, కోనసీమ, తిరుపతి వంటి ప్రాంతాల్లో వీటిని ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. సామాన్య మధ్యతరగతి ప్రజలకు సైతం అందుబాటు ధరల్లో వీటిని అందించనున్నట్లు తెలుస్తోంది. వీలైనంత త్వరగా వీటి నిర్మాణ పనులను పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.
Also Read : ఏపీలో కొత్త రేషన్ కార్డుల జారీ.. కూటమి సర్కార్ సంచలన నిర్ణయం!
* ఉత్తరాఖండ్ లో అధ్యయనం
ఉత్తరాఖండ్ లో హోం స్టే విధానం( Homestay system ) విజయవంతం అయింది. దానిని అధ్యయనం చేసిన పర్యాటక శాఖ అధికారులు నివేదికలు సమర్పించారు. సీఎం చంద్రబాబు ఆమోదం ముద్ర వేసినట్లు తెలుస్తోంది. అరకు, విశాఖపట్నం, కోనసీమ, విజయవాడ, తిరుపతి ప్రాంతాల్లో హోమ్ స్టేలను అభివృద్ధి చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే 729 ఇళ్ళను గుర్తించారు. ఆ ఇళ్లల్లో అవసరమైన మార్పులు చేస్తున్నారు. ఎందుకు ప్రైవేటు సంస్థలతో ఒప్పందం కుదుర్చుకున్నారు. రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ వచ్చే నెలలో హోమ్ స్టేలను అందుబాటులోకి తీసుకురావడానికి చర్యలు తీసుకుంటోంది. పర్యాటకులకు తక్కువ ధరల్లో అన్ని సౌకర్యాలు కల్పించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. సాధారణంగా పర్యాటక ప్రాంతాల సందర్శన సమయంలో ప్రైవేట్ లాడ్జిలు బుక్ చేసుకుంటాం. కానీ అక్కడ ధరలు సామాన్యుడికి అందుబాటులో ఉండవు. అందుకే హోమ్ స్టెల ద్వారా ఇబ్బంది లేకుండా చూడాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది.
* ఆ గ్రామాల్లో సైతం..
సాధారణంగా విశాఖ( Visakhapatnam) వెళ్లే పర్యాటకులు మన్యం ప్రాంతాన్ని సందర్శిస్తారు. అరకు తో పాటు లంబసింగి ప్రాంతాలకు వెళ్తారు. ఇటువంటి వారి కోసం అరకు తో పాటు వంటమూరు, మగధ, కురిడి, తాజంగి గ్రామాల్లో 48 ఇళ్ళను గుర్తించారు. ఆ ఇళ్లలో పర్యాటకులకు వస్తుతోపాటు ఇతర సౌకర్యాలు కల్పిస్తారు. కోనసీమ అందాలను చూడడానికి వెళ్లే పర్యాటకుల కోసం దిండితో పాటుగా మలికిపురం, తూర్పు పాలెం, పాసర్ల పూడిలో 20 ఇళ్ళను గుర్తించారు. విశాఖ, విజయవాడ, తిరుపతిలో 90 ఇళ్లను గుర్తించారు. వీటిలో సగం ఇల్లు అన్ని సౌకర్యాలతో అందుబాటులో ఉన్నాయి. మిగిలిన వాటిలో సౌకర్యాలు కల్పించే పనిలో అధికారులు ఉన్నారు.
Also Read : ఏపీలో ఈశాన్య రాష్ట్రాల బస్సులు.. రూ.82.14 కోట్లకు టెండర్!
* హోం స్టే లకు రాయితీ
ఇలా గుర్తించిన ఇళ్లకు సంబంధించి వివరాలను వెబ్ సైట్ల( websites ) ద్వారా అందుబాటులోకి వస్తారు. పర్యాటకులు వసతి కోసం ముందుగా బుక్ చేసుకోవచ్చు. ముందుగా ప్రయోగాత్మకంగా ఎంపిక చేసి.. మిగతా ఆధ్యాత్మిక, పర్యాటక ప్రాంతాలకు విస్తరించాలన్న ఆలోచనలో ప్రభుత్వం ఉంది. అయితే ఈ మొత్తం ఇళ్ళన్నీ ప్రైవేటు వ్యక్తులకు చెందినవే. వీటిని ఒప్పంద ప్రాతిపదికన తీసుకుంటారు. విద్యుత్ తో పాటు ఇతరత్రా రాయితీలు కూడా కల్పిస్తారు. పర్యాటక రంగాన్ని ఊతం ఇవ్వడం ద్వారా.. ఉద్యోగ ఉపాధి అవకాశాలు మెరుగుపరచవచ్చు అన్నది ప్రభుత్వ ఆలోచన. పర్యాటకులకు తక్కువ ధరకే విడిది అందించేందుకు కూడా ఈ హోమ్ స్టేలు ఎంతగానో దోహద పడనున్నాయి.