Andhra King Taluka 1st Day Collections: రామ్ పోతినేని(Ram Pothineni) హీరో గా నటించిన లేటెస్ట్ మూవీ ‘ఆంధ్రా కింగ్ తాలూకా'(Andhra king Taluka) చిత్రం నిన్న ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలై పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకుంది. నూన్ మరియు మ్యాట్నీ షోస్ కాస్త డల్ గానే ఉన్నప్పటికీ, ఫస్ట్ షోస్ నుండి సినిమా బాగా పుంజుకోవడం తో వరల్డ్ వైడ్ గా మంచి ఓపెనింగ్స్ ని సొంతం చేసుకున్న సినిమాగా నిల్చింది ఈ చిత్రం. అంతే కాకుండా రామ్ గత చిత్రాల ప్రభావం కూడా ఈ సినిమా ఓపెనింగ్స్ మొదటి రెండు షోస్ పై బలంగా పడింది. ఇస్మార్ట్ శంకర్ చిత్రం తర్వాత రామ్ చేసిన ప్రతీ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ ఫ్లాప్స్ గా నిలుస్తూ వచ్చాయి. ముఖ్యంగా ఆయన గత చిత్రం ‘డబుల్ ఇస్మార్ట్’ రామ్ మార్కెట్ ని బాగా దెబ్బ తీసింది.
కానీ ట్యాక్ పబ్లిక్ లో నెమ్మదిగా పాకడంతో కలెక్షన్స్ ఫస్ట్ షోస్ నుండి పుంజుకోవడం వల్ల ఈ చిత్రానికి వరల్డ్ వైడ్ గా 7 కోట్ల 65 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు, 4 కోట్ల 25 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. ప్రాంతాల వారీగా వచ్చిన వసూళ్లను ఒకసారి పరిశీలిస్తే నైజాం ప్రాంతం నుండి 1 కోటి 30 లక్షలు, సీడెడ్ ప్రాంతం నుండి 30 లక్షలు, ఆంధ్ర ప్రాంతం నుండి 1 కోటి 15 లక్షలు వచ్చాయి. ఓవరాల్ గా తెలుగు రాష్ట్రాల్లో 2 కోట్ల 75 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు, 4 కోట్ల 35 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. రామ్ రేంజ్ కి ఇది చాలా తక్కువ అనే చెప్పాలి. కానీ ఆయన గత చిత్రాల ప్రభావం, అదే విధంగా సినిమా జానర్ ని పరిగణలోకి తీసుకుంటే డీసెంట్ స్థాయి ఓపెనింగ్ అని చెప్పొచ్చు.
ఇక కర్ణాటక + రెస్ట్ ఆఫ్ ఇండియా కలిపి 25 లక్షల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టిన ఈ చిత్రం, ఓవర్సీస్ నుండి 1 కోటి 25 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. ఓవరాల్ గా ఈ చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా 4 కోట్ల 25 లక్షల రాయిపాయిల శరేవసూల్లు వచ్చాయి. ఓవర్సీస్ లో కూడా వసూళ్లుయ్ బాగా పుంజుకున్నాయి. నార్త్ అమెరికా లో అయితే రామ్ ఈ చిత్రం ద్వారా మొట్టమొదటి 1 మిలియన్ గ్రాస్ సినిమాని అందుకోబోతున్నాడు. రెండవ రోజు కూడా అన్ని ప్రాంతాల్లో కలెక్షన్స్ బాగున్నాయి. రేపు లేదా ఎల్లుండి వచ్చే కలెక్షన్స్ మొదటి రోజు కంటే ఎక్కువ ఉన్నా ఆశ్చర్యపోనక్కరలేదు. ఓవరాల్ గా ఈ సినిమా బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకోవాలంటే 23 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు రావాలి. వీకెండ్ కి 20 కోట్ల షేర్, అదే విధంగా మొదటి వారం లో బ్రేక్ ఈవెన్ మార్కుని ఈ చిత్రం అందుకునే అవకాశాలు ఉన్నాయి.