Bigg Boss 9 team master plan: ఈ సీజన్ బిగ్ బాస్(Bigg Boss 9 Telugu) హౌస్ లో టైటిల్ కొట్టడానికి అన్ని విధాలుగా అర్హతలు ఉన్న కంటెస్టెంట్ ఎవరైనా ఉన్నారా అంటే అది డిమోన్ పవన్ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రస్తుతానికి టాప్ 1 స్థానం లో తనూజ, టాప్ 2 స్థానం లో పవన్ కళ్యాణ్ ఉన్నారు కానీ, టైటిల్ కొట్టే అర్హత మాత్రం డిమోన్ పవన్ కి ఎక్కువ ఉంది. అద్భుతంగా టాస్కులు ఆడడంలో కానీ, అందరితో స్నేహం గా ఉండడంలో కానీ, ఓపిక, సహనం వంటి విషయాల్లో కానీ, డిమోన్ పవన్ ని మించిన కంటెస్టెంట్ మరొకరు లేరు. హౌస్ లో గొడ్డు చాకిరి చేస్తాడు, టాస్కులు ఆడుతాడు, ఎవరికీ ఏ కష్టం వచ్చినా ముందుగా తన చెయ్యి అందించడానికి పరుగులు తీస్తాడు, ఇలా ఏ విషయం లో చూసుకున్న డిమోన్ పవన్ బంగారమే.
కేవలం రీతూ చౌదరి తో రిలేషన్ విషయంలో ఒక్కటే అతనికి నెగిటివ్ అయ్యింది కానీ, మిగిలిన అన్ని విషయాల్లో తోపు కంటెస్టెంట్. కానీ ఇతన్ని ఎవ్వరూ సరిగా గుర్తించడం లేదు. పేద కుటుంబం నుండి రావడం తో, డబ్బులు భారీగా ఖర్చు చేసే స్తొమత లేక, కనీసం సరైన పీఆర్ టీంని కూడా పెట్టుకోలేకపోయాడు. ఇక బిగ్ బాస్ టీం అయితే డిమోన్ పవన్ ని తొక్కేందుకు అన్ని విధాలుగా ప్రయత్నం చేస్తోంది. రీతూ చౌదరి విషయం లో రెడ్ కార్డు ఇచ్చి, బయటకి పంపేంత పని చేశారు. కానీ అతని ఉద్దేశ్యం తప్పు కాదు, వాళ్ళ మధ్య జరిగిన గొడవలో, ఎదో ఫ్లో లో ఆమెని నెట్టాడు అంతే. అదే కాకుండా పాపం అతని చేత మోకాళ్ళ మీద కూర్చొని ఆడియన్స్ కి క్షమాపణలు చెప్పించారు. ఇక ఈ వారం అయితే డిమోన్ పవన్ ని ఎలిమినేట్ చేయడానికి భారీ కుట్రలు జరుగుతున్నాయని టాక్.
ఈ వారం నామినేషన్స్ సమయం లో పవన్ కళ్యాణ్, రీతూ చౌదరి మధ్య పెద్ద గొడవ జరగడం, మధ్యలో డిమోన్ పవన్ వచ్చి పవన్ కళ్యాణ్ ని ఆపే క్రమం లో అతని గొంతు పట్టుకోవడం వంటివి మనం చూసే ఉంటాము. ఇది చాలా తప్పు అంటూ సోషల్ మీడియా లో పెద్ద ఎత్తున చర్చకు దారి తీశారు నెటిజెన్స్. ఇది బిగ్ బాస్ టీం వరకు చేరడం తో ఈ వారం డిమోన్ పవన్ కి రెడ్ కార్డు ఇచ్చి బయటకు పంపే ప్లాన్ చేస్తున్నారట. అంతే కాకుండా డిమోన్ పవన్ కి ఓటింగ్ కూడా అనుకున్నంత రేంజ్ లో పడడం లేదు. బాటమ్ 3 లో ఉన్నాడు, నాల్గవ స్థానం లో భరణి, 5 వ స్థానం లో సుమన్ కొనసాగుతున్నారు. కాబట్టి డిమోన్ పవన్ ని ఈ వారం తొలగిస్తే కళ్యాణ్ కి భారీ పోటీ తప్పుతుంది కదా, అందుకే అతన్ని తొలగించడానికి చూస్తున్నారట. నిన్న ఈ విషయం లో బిగ్ బాస్ టీం మీటింగ్ కూడా పెట్టింది. ఎందుకంటే బిగ్ బాస్ టీం కళ్యాణ్ ని బాగా పైకి లేపి, అతన్ని టైటిల్ విన్నర్ ని చేయడానికి చూస్తున్నారట. డిమోన్ పవన్ ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే, అతనికి ఓట్లు వేసుకోండి. ప్రస్తుతం డేంజర్ జోన్ లో ఉన్నాడు.