https://oktelugu.com/

అరె.. హీరోయిన్స్ కంటే యాంకర్లకే ఎక్కువ !

కరోనా కాలం.. పెద్ద పెద్ద స్టార్ హీరోయిన్స్ కూడా లక్షల రూపాయల ఆదాయం వదులుకుని ఇంట్లో ఖాళీగా కూర్చుంటూ కాలక్షేపం చేస్తుంటే.. కాస్త తెలుగు వచ్చి.. కాస్త అందాలని ప్రదర్శించే అలవాటు ఉన్న యాంకర్స్ మాత్రం కరోనా టైంలో కూడా లక్షలు సంపాదిస్తున్నారు. నిజానికి సినిమా ఇండస్ట్రీ అంతా లాస్ లోనే ఉంది.. టీవీ ప్రొడ్యూసర్లు కూడా లాస్ లోనే ఉన్నారు. ఆ మాటకొస్తే ఇండస్ట్రీ చాలా సమస్యలనే ఫేస్ చేస్తోంది. సినిమా షూటింగ్ లతో పాటు […]

Written By:
  • admin
  • , Updated On : August 20, 2020 / 07:21 PM IST
    Follow us on


    కరోనా కాలం.. పెద్ద పెద్ద స్టార్ హీరోయిన్స్ కూడా లక్షల రూపాయల ఆదాయం వదులుకుని ఇంట్లో ఖాళీగా కూర్చుంటూ కాలక్షేపం చేస్తుంటే.. కాస్త తెలుగు వచ్చి.. కాస్త అందాలని ప్రదర్శించే అలవాటు ఉన్న యాంకర్స్ మాత్రం కరోనా టైంలో కూడా లక్షలు సంపాదిస్తున్నారు. నిజానికి సినిమా ఇండస్ట్రీ అంతా లాస్ లోనే ఉంది.. టీవీ ప్రొడ్యూసర్లు కూడా లాస్ లోనే ఉన్నారు. ఆ మాటకొస్తే ఇండస్ట్రీ చాలా సమస్యలనే ఫేస్ చేస్తోంది. సినిమా షూటింగ్ లతో పాటు థియేటర్లు మూతపడ్డాయనేది ఒకటి ఆయితే.. ఆర్టిస్టులకు అవకాశాలు లేక అన్ని వదిలేసి ఇంటికే పరిమితం అయిపోయారు. మరో పక్క హీరో హీరోయిన్లు కూడా తమ పారితోషకాన్ని తగ్గించుకొని సినిమా చేయడానికి ఒప్పుకుంటున్నారు.

    Also Read: హీరోల ఇగోలను సంతృప్తి పరుస్తారా..!

    ఇక చిన్న చిన్న ఆర్టిస్టులు, జూనియర్ ఆర్టిస్టుల పరిస్థితి అయితే మరీ ఘోరంగా తయారైందని కృష్ణ నగర్ గల్లీల్లో రకరకాల కథలు వినిపిస్తున్నాయి. ఇలా అందరూ కష్టకాలంలో ఉంటే.. టాలీవుడ్ టాప్ యాంకర్లు మాత్రం లక్షల పారితోషకాన్ని తీసుకుంటూ కరోనా కాలంలో కూడా బాగానే డబ్బు చేసుకుంటున్నారు. జనాలంతా టీవీలకు అతుక్కుపోయిన రోజులు ఇవి.. దీంతో రకరకాల షోలను ఎంటర్ టైన్ మెంట్ చానెళ్లు ప్రసారం చేయాల్సిన పరిస్థితి వచ్చింది. దాంతో యాంకర్లకు గ్యాప్ లేకుండా పోయింది. సాధారణంగా స్టార్ యాంకర్లకు మొదటి నుండి డిమాండ్ ఉంది. పైగా ఇప్పుడు వాళ్లే షోని నడిపించాల్సిన బాధ్యత నెత్తిన వేసుకున్నారు.

    Also Read: ‘నిశ్శబ్దం’గా 25 కోట్ల డీల్… అక్కడ శబ్దం చేస్తుందా మరి?

    దాంతో రెమ్యునరేషన్ ను భారీగా తీసుకుంటున్నారు. మరి ఎవరెవరు ఎంత తీసుకుంటున్నారో ఒక లుక్కేద్దాం. టాప్ యాంకర్ సుమ షోకు 2.5 లక్షలు, హాట్ బ్యూటీ అనసూయ 2 లక్షలు, మరో హాట్ గ్లామర్ బ్యూటీ రష్మీ 1.25 లక్షలను తీసుకుంటున్నారు. ఇక సెకండ్ లెవల్ యాంకర్స్ వర్షిణి, మంజూష, శ్యామల లాంటి వారు షోకి 50 వేల వరకు తీసుకుంటున్నారు. ఇకపోతే ప్రత్యేక యాంకర్లుగా గుర్తింపు తెచ్చుకున్న బబ్లీ బ్యూటీ శిల్పా చక్రవర్తి, అలాగే గాయత్రి భార్గవి, ఝాన్సీ లాంటి వారు లక్ష వరకూ అడుగుతున్నారట. ఇక శ్రీముఖి ప్రొడ్యూసర్లను బట్టి అడుగుతుందట. మొత్తానికి సంపాదన విషయంలో ప్రస్తుతం హీరోయిన్స్ కంటే యాంకర్లకే ఎక్కువ.