టీం ఇండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని ఇటీవలే అంతర్జాతీయ క్రికెట్ కు విడ్కోలు పలికాడు. ఆగస్టు 15న సాయంత్రం 19.29 నుంచి తాను అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్ అయినట్లు భావించడంటూ ధోని తన ఇన్ స్ట్రాగ్రామ్ లో పోస్టు చేసిన సంగతి తెల్సిందే. అనుహ్యంగా ధోని రిటైర్మెంట్ ప్రకటించడంపై ధోని ఫ్యాన్స్ తో సహా క్రికెట్ అభిమానులు షాక్ కు గురయ్యారు. తన చివరి మ్యాచ్ ప్రకటించకుండానే ధోని రిటైర్మెంట్ ప్రకటించడంపై పలురకాల గాసిప్స్ చక్కర్లు కొడుతోన్నాయి.
Also Read: కరోనా వచ్చిపోతే బతుకుకు భరోసా..?
అయితే మహేంద్ర సింగ్ ధోనికి ప్రధాని ప్రశంసిస్తూ లేఖ రాయడం చర్చనీయాంశంగా మారింది. ధోనిని అభినందిస్తూ ప్రధాని రెండు పేజీల లేఖను ధోనికి రాశారు. మహీ అంటే కేవలం గణాంకాలు.. మ్యాచ్ రికార్డులుగా గుర్తించుకోవడం కరెక్ట్ కాదని.. అతడిని కేవలం ఒక క్రీడాకారుడిగా చూడొద్దని.. తండ్రిగా కూడా జీవాతో ధోనీకి ఉన్న అనుబంధాన్ని ప్రధాని ధోనికి రాసిన లేఖలో ప్రత్యేకంగా ప్రస్తావించారు.
ఇక ధోని సైతం తన ట్వీటర్లో ప్రధాని మోదీకి అదిరిపోయే రిప్లయ్ ఇచ్చి అందరినీ ఆకట్టుకున్నాడు. ‘ఓ కళాకారుడు.. సైనికుడు.. క్రీడాకారుడికి ప్రశంసకు మించింది ఏముంటుంది.. వారి త్యాగాలు, కఠోర శ్రమను గుర్తించి ప్రశంసిస్తున్నారు.. మీ ప్రశంసలకు థ్యాంక్’ అంటూ ప్రధాని మోదీకి రాసిన లేఖను ధోని తన ట్వీటర్లో పోస్టు చేశాడు.
2004 డిసెంబర్ 23న బంగ్లాదేశ్‌తో మ్యాచ్ ద్వారా ధోని అంతర్జాతీయ క్రికెట్లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఈ మ్యాచులో ధోని స్కోరు చేయకుండానే వెనుదిరిగినా ఆ తర్వాతి కాలంలో భారత్ కు అనేక విజయాలు అందించడంలో కీరోల్ పోషించాడు. వికెట్ కీపర్ గా.. బాట్స్ మెన్ గా.. కెప్టెన్ గా ఎన్నో విజయాలను అందించారు. ధోని కెప్టెన్‌గా 2007లో టీ20 ప్రపంచకప్.. 2011లో వన్డే ప్రపంచకప్.. 2013లో ఛాంపియన్స్ ట్రోఫీని భారత్ కు అందించాడు.
Also Read: రాజకీయాల్లోకి వచ్చేందుకు జంకుతున్న రజనీ?
ధోని నాయకత్వంతో భారత్ తొలిసారి ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో నెంబర్ వన్ గా నిలిచింది. ఐసీసీ మూడు ట్రోఫీలను అందుకున్న ఏకైక కెప్టెన్ గా ధోని పేరిట ప్రపంచ రికార్డు ఉంది. 2011లో భారత్ వన్డే ప్రపంచ కప్ విజయం సాధించాక ధోనీకి ఆర్మీలో లెప్టినెంట్ కల్నల్ హోదా దక్కింది. ధోని రిటైర్మెంట్ చూడలేని వారంతా ఐపీఎల్ లో మహీ మెరుపులను చూసే అవకాశం ఉంది. దీంతో ఐపీఎల్ ఎప్పుడు మొదలవుందా? అని మహీ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు.