Anchor Vishnupriya: యంగ్ యాంకర్స్ లో ఒకరైన విష్ణుప్రియ హాట్ బాంబ్ గా పేరు తెచ్చుకున్నారు. ఇంస్టాగ్రామ్ వేదికగా ఆమె చేసే ఫోటో షూట్స్ సంచలనం రేపుతుంటాయి. బికినీల్లో కూడా మొహమాటం లేకుండా చూపించేసింది. విష్ణుప్రియ తీరు చూసి నెటిజెన్స్ మైండ్ బ్లాక్ అవుతుంది. ఇక విందులు, విహారాలు చేస్తూ హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తుంది. తన ఎంజాయ్మెంట్ గురించి ఫ్యాన్స్ కి తెలిసేలా ప్రతి అప్డేట్ ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తుంది. ఆ ఫోటోలు చూసి లైఫ్ అంటే విష్ణుప్రియదని పలువురు వాపోతుంటారు. అయితే ఈ కలర్ ఫుల్ లైఫ్ వెనుక కన్నీళ్ల కథలు కూడా ఉన్నాయట.
విష్ణుప్రియ ఒక దశలో తిండికి కూడా డబ్బులు లేక ఇబ్బందిపడ్డారట. పరిశ్రమకు వచ్చాక ఆమెకు పోవే పోరా షో బ్రేక్ ఇచ్చిందట. నంబర్ వన్ యారీ, పోవే పోరా షోలలో ఒకేసారి ఆఫర్స్ వచ్చాయట. ఆ సమయంలో తాను అనేక ఆర్థిక కష్టాలు పడిందట. ఇప్పుడు కొంచెం పర్లేదు. కనీసం ఆన్లైన్లో ఆర్డర్స్ పెట్టుకొని కడుపునిండా తింటున్నానని విష్ణుప్రియ అన్నారు. ఇంకా తన వ్యక్తిగత విషయాలు గురించి విష్ణుప్రియ చెప్పారు.
మా అమ్మ నాన్నలది చీరాల, బాపట్ల. నేను పుట్టింది చెన్నైలో. అమ్మ హెయిర్ డ్రెస్సర్. శ్రియ శరన్, ఆర్తి అగర్వాల్ వంటి స్టార్ హీరోయిన్స్ కి హెయిర్ డ్రెస్సర్ గా పని చేశారు. ఇంత టాలెంట్ ఉండి కూడా అమ్మ ఇలానే ఎందుకు ఉండిపోయిందనిపించేది, అని విష్ణుప్రియ చెప్పుకొచ్చారు. విష్ణుప్రియ బుల్లితెరకు రాకముందు యూట్యూబ్ లో షార్ట్ ఫిల్మ్, కామెడీ వీడియోలు చేసేవారు. పోవే పోరా ఆమెను వెలుగులోకి తెచ్చింది. ఇటీవల విష్ణుప్రియ తల్లి మరణించారు.
విష్ణుప్రియ కొన్ని చిత్రాల్లో హీరోయిన్ గా నటించడం విశేషం. ట్వంటీ ఫస్ట్ సెంచరీ లవ్, చెక్ మేట్ చిత్రాల్లో విష్ణుప్రియ హీరోయిన్. ఆమె బోల్డ్ సన్నివేశాల్లో కూడా నటించారు. గత ఏడాది విడుదలైన వాంటెడ్ పండుగాడ్ మూవీలో కీలక రోల్ చేశారు. సునీల్, వెన్నెల కిషోర్, అనసూయ వంటి స్టార్స్ ఆ చిత్రంలో నటించారు. విష్ణుప్రియ బుల్లితెర మీద కనిపించడం లేదు. ప్రైవేట్ మ్యూజిక్ ఆల్బమ్స్ చేస్తున్నారు. కెరీర్ ని అలా నెట్టుకొస్తున్నారు.