https://oktelugu.com/

Anchor Suma: టమాటాలు, బియ్యం దొంగతనం.. పాపం యాంకర్ సుమ పరిస్థితి ఇంత దిగజారిందా?

జూలై నెల మొదటి వారంలో టమాటాల ధరలు పెరగడం ప్రారంభించాయి. అప్పటినుంచి ఇప్పటిదాకా ఆ ధరలు తగ్గడం లేదు. పైగా రోజురోజుకు బంగారం ధరతో పోటీ పడుతున్నాయి.

Written By: , Updated On : July 26, 2023 / 06:18 PM IST
Anchor Suma

Anchor Suma

Follow us on

Anchor Suma: నిత్యావసరాలు ధరలు అమాంతం పెరుగుతున్నాయి. ఏం కొనేటట్టు లేదు ఏం తినేటట్టు లేదు అని పాడేలా చేస్తున్నాయి. ధరలు ఎంత పెరిగినప్పటికీ తినక తప్పదు కాబట్టి జనం తిట్టుకుంటూనే వాటిని కొనుగోలు చేస్తున్నారు. కొంతమందయితే ఎవరు ఏమనుకున్నా పర్వాలేదు అనుకుంటూ దొంగతనాలు చేస్తున్నారు. ఆ మధ్య కర్ణాటక రాష్ట్రంలో ఓ వ్యక్తి తోట నుంచి కొంతమంది టమాటా బాక్సులు ఎత్తుకెళ్లారు. ఇటీవల ఆర్మూర్లో ఇంట్లో దొంగతనం జరిగినప్పుడు దొంగలు బంగారంతో పాటు ఇంట్లో ఫ్రిడ్జ్లో దాచిన టమాటాలు కూడా ఎత్తుకెళ్లారు. ఇక నిన్నటిదాకా టమాటాలు మాత్రమే ఖరీదైన వస్తువులుగా ఉండేవి. ఇప్పుడు ఆ స్థానాన్ని బియ్యం కూడా ఆక్రమించాయి. అది మన దగ్గర కాదు. కేంద్రం ఎగుమతులపై నిషేధం విధించడంతో పొరుగు దేశాల్లో ముఖ్యంగా అమెరికాలో బియ్యానికి విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. అయితే పెరిగిన ధరలను దృష్టిలో ఉంచుకొని సోషల్ మీడియాలో రకరకాల మీమ్స్ చక్కర్లు కొడుతున్నాయి.

దొంగిలించింది

పెరిగిన టమాటాల ధరలను ప్రస్తావిస్తూ నెటిజన్లు ఒక్కొక్కరు ఒక్కో విధంగా వ్యంగ్య విధానాన్ని అనుసరిస్తున్నారు. ఈ జాబితాలోకి ప్రముఖ సినీ యాంకర్ కనకాల సుమ కూడా చేరింది. ఆమె తన ఇన్ స్టా గ్రామ్ లో ఒక వీడియో పోస్ట్ చేసింది. ఇందులో ఒకతను బస్తాలో టమాటాలు తీసుకొస్తుండగా వెనుక నుంచి వచ్చిన సుమ అమాంతం వాటిని లాగేసుకుంది. దీంతో ఆ టమాటాలు తీసుకొస్తున్న వ్యక్తి బిక్క మొహం వేశాడు. అదే సమయంలో అమెరికాలో పెరిగిన బియ్యం ధరలనూ వ్యంగ్యంగా ప్రతిబింబించింది సుమ. టమాటాలు తీసుకొచ్చిన వ్యక్తి బస్తాలో బియ్యం తీసుకొస్తుండగా.. సుమ దౌర్జన్యంగా వాటిని లాక్కుంది. అమెరికాలో బియ్యం, ఇండియాలో టమాటాలు.. భరించలేకుండా ఉన్నాయి అంటూ సుమ వీడియోలో ప్రస్తావించింది.

హాహా కారాలు

జూలై నెల మొదటి వారంలో టమాటాల ధరలు పెరగడం ప్రారంభించాయి. అప్పటినుంచి ఇప్పటిదాకా ఆ ధరలు తగ్గడం లేదు. పైగా రోజురోజుకు బంగారం ధరతో పోటీ పడుతున్నాయి. చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా టమాటాల కోసం దొంగతనాలు జరుగుతున్నాయి. టమాటాల చుట్టూ బందోబస్తు ఏర్పాటు చేయాల్సిన పరిస్థితులు నెలకొంటున్నాయి. ఇక బియ్యం ఎగుమతి పై నిషేధం విధించడంతో అమెరికా లాంటి దేశాల్లో సూపర్ మార్కెట్లలో నో స్టాక్ బోర్డులు ఏర్పాట్లు చేయాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి.. దీనికి తోడు అకాల వర్షాలు కురుస్తుండడంతో ఇప్పట్లో టమాటాల ధరలు తగ్గే అవకాశం లేదని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. బియ్యం కూడా ఇప్పట్లో అమెరికాలాంటి దేశాలకు పరిస్థితులు లేకపోవడంతో అక్కడ ధరలు మరింత మండే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. కానీ మొత్తానికి అటు టమాటాల ధరలను, ఇటు బియ్యం కొరతను ప్రతిబింబిస్తూ కనకాల సుమ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా. ఈ వీడియో పై ఒక్కొక్కరు ఒక్కో విధంగా స్పందిస్తున్నారు. “పెరిగిన ధరల వల్ల కనకాల సుమలాంటి వ్యక్తి కూడా టమాటాలు, నిషేధం వల్ల బియ్యం దొంగతనం చేస్తున్నారని” కామెంట్లు చేస్తున్నారు.