https://oktelugu.com/

Pawan Kalyan: టాలీవుడ్ ను ఒక్కటి చేస్తున్న ఆ హీరోలపై పవన్ ప్రేమ..

మన తెలుగు పరిశ్రమలో ప్రతి ఒక్క అగ్ర నటుడు గురించి ప్రస్తావిస్తూ వాళ్లందరితోనూ తాను చాలా స్నేహంగా వుంటాను అని, వాళ్ళందరూ అంటే ఇష్టమని, అలాగే వాళ్ళ సినిమాలు చాలా బాగా ఆడాలని అన్నారు పవన్. "జూనియర్ ఎన్టీఆర్ గారిలా, రామ్ చరణ్ లాగా నేను గొప్పగా డ్యాన్స్ లు చేయలేకపోవచ్చు. ప్రభాస్ గారిలా, రానా గారిలా సంవత్సరాలు కష్టపడి చేయలేకపోవచ్చు. కానీ సినిమా అంటే ప్రేమ నాకు, సమాజం అంటే బాధ్యత," అని ప్రతి ఒక్క హీరో గొప్పతనాన్ని తెలియజేశారు పవన్.

Written By:
  • Swathi Chilukuri
  • , Updated On : July 26, 2023 / 06:08 PM IST

    Pawan Kalyan

    Follow us on

    Pawan Kalyan: పవన్ కళ్యాణ్ అని పేరు వింటేనే తెలుగు సినీ ప్రేక్షకులకు ఒక పవర్ పాస్ అవుతుంది. అందుకే ఆయనకి మన సినీ ప్రియులు పవర్ స్టార్ అనే బిరుదు ఇచ్చి తమ మదిలో ఒక స్టార్ హీరో స్టేటస్ ఇచ్చేసారు. సినిమా రంగంలో ఆయనకు ఉన్నటువంటి పిచ్చి ప్రేమ ఉందే అభిమానులు వేరే హీరోకి ఉండరేమో అనిపిస్తుంది.

    సూపర్ స్టార్ రజినీకాంత్ లాగా చిన్న చిన్న మేనరిజంతో తో ఒక సాధారణమైన సినిమాని కూడా బ్లాక్ బస్టర్ చేసి మ్యాజిక్ చేయగలరు పవర్ స్టార్. అందుకే ఆయనకి తెలుగులో విపరీతమైన క్రేజ్. నిజంగానే పవన్ కళ్యాణ్ తన వందశాతం సినిమాల పైనే పెట్టుంటే, తప్పకుండా తమిళంలో రజనీకాంత్ లాగా తెలుగులో ఆయన కూడా సూపర్ స్టార్ అయి ఉండేవారు. కానీ పవన్ అలా చేయలేదు. తనను అంతగా అభిమానించి తారాస్థాయిలో పెట్టిన ప్రేక్షకులకు వేరే విధంగా సహాయపడాలి అనుకున్నాడు. అందుకే సినిమాలలో నెంబర్ వన్ సీట్ కి దగ్గరలో ఉన్న టైంలో సినిమాలు కాదని రాజకీయంలోకి అడుగుపెట్టాడు.

    అయితే పవన్ కళ్యాణ్ అభిమానులు మాత్రం ఆయన సినిమాలను వదులుకోవడం ఒప్పుకోలేదు. ఇక భారీ నిర్ణయం కూడా గౌరవించి రాజకీయాలతో పాటు సినిమాలు కూడా చేస్తున్నారు. ఇక ఎన్నికలు దగ్గర పడుతూ ఉండడంతో, తన సినిమాలను చకచకా ముగించి, ఎన్నికల ప్రచారం వైపు ఎక్కువ మగ్గు చూపుతున్నాడు ఈ హీరో.

    ఈ నేపథ్యంలో ఎన్నికలలో పూర్తి బీజీ కాడానికి ముందే తన అభిమానుల కోసం బ్రో అనే సినిమాని చేశారు. ఈ చిత్రం పవన్ తన మేనల్లుడు సాయి ధర మ్ తేజ్ తో కలిసి నటించిన సినిమా కావడంతో ఈ చిత్రంపై అంచనాలు భారీగానే ఉన్నాయి. జూలై 28న ఈ చిత్రం విడుదలవుతున్న సందర్భంగా నిన్న ఈ సినిమా మేకర్స్ ఘనంగా ఈ చిత్రం ఫ్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ నేపథ్యంలో పలు తెలుగు హీరోల గురించి పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలు ప్రస్తుతం అందరి దృష్టిని ఆకట్టుకుంటున్నాయి.

    మన తెలుగు పరిశ్రమలో ప్రతి ఒక్క అగ్ర నటుడు గురించి ప్రస్తావిస్తూ వాళ్లందరితోనూ తాను చాలా స్నేహంగా వుంటాను అని, వాళ్ళందరూ అంటే ఇష్టమని, అలాగే వాళ్ళ సినిమాలు చాలా బాగా ఆడాలని అన్నారు పవన్. “జూనియర్ ఎన్టీఆర్ గారిలా, రామ్ చరణ్ లాగా నేను గొప్పగా డ్యాన్స్ లు చేయలేకపోవచ్చు. ప్రభాస్ గారిలా, రానా గారిలా సంవత్సరాలు కష్టపడి చేయలేకపోవచ్చు. కానీ సినిమా అంటే ప్రేమ నాకు, సమాజం అంటే బాధ్యత,” అని ప్రతి ఒక్క హీరో గొప్పతనాన్ని తెలియజేశారు పవన్.

    అంతేకాదు మహేష్ బాబు తదుపరి సినిమా గురించి మాట్లాడుతూ.. “రాజమౌళి గారు మన పరిశ్రమని హాలీవుడ్ స్థాయికి తీసుకెళ్లారు. మహేష్ బాబు గారితో ఆయన చేసే సినిమా మన స్థాయిని మరింత పెంచాలి. దీనిని కొత్తగా వచ్చేవాళ్ళు కొనసాగించాలి. నాకు అందరూ హీరోలు ఇష్టం. వారివల్ల ఎందరో కడుపు నిండుతుంది,” అని చెప్పారు పవన్ కళ్యాణ్.

    ఇక ఈ మధ్య ఎన్నికల ప్రచారంలో కూడా, పవన్ జూనియర్ ఎన్టీఆర్ మరియు మహేష్ బాబుని పొగిడిన విషయం తెలిసిందే. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒక హీరో ఫ్యాన్స్ మరో హీరో ఫ్యాన్స్ తో ఎలా గొడవ పడుతున్నారు మన అందరికీ తెలుసు. ఏకంగా ఫ్యామిలీల గురించి కూడా నీచంగా మాట్లాడుతూ గొడవలు పడుతున్నారు. ఇలాంటి తరుణంలో అందరి హీరోలని కలుపుకుంటూ పవన్ చేస్తున్న వ్యాఖ్యలు చాలామంది దగ్గర నుంచి ప్రశంసలు అందుకుంటున్నాయి.

    సినిమా వారు అందరూ కలిసి ఉండాలి అని, సినిమా రంగంలో పోటీ ఆరోగ్యకరంగా కొనసాగాలి అని పవన్ భావిస్తున్నట్లు ఆయన మాటలు వింటేనే అర్థం అవుతుంది. ఇక ప్రతి హీరో ఇలానే ఆలోచిస్తే, సోషల్ మీడియాలో ఫాన్స్ గొడవ కూడా నీచ స్థాయికి పోకుండా ఉంటుంది అని అందరి అభిప్రాయం.