https://oktelugu.com/

సినిమాల కోసం మరో గ్లామరస్ యాంకర్.. !

తెలుగులో గ్లామరస్ యాంకర్ అంటే.. ఇప్పుడు అనసూయ, రష్మీ గౌతమ్, శ్రీముఖి అంటూ చాలామంది పేర్లే వినిపిస్తున్నాయి గానీ, ఒకప్పుడు తెలుగులో గ్లామరస్ యాంకర్ అంటే ఒక్కరి పేరే ఎక్కువుగా వినిపించేది ఆమె యాంకర్ ‘శిల్పా చక్రవర్తి’. ఒకప్పుడు మంచి మంచి షోలకు అదిరిపోయేలా యాంకరింగ్ చేసింది. యాంకర్‌ గానే కాకుండా కొన్ని సినిమాల్లో నటిగా కూడా కనిపించి అలరించింది. నిజానికి ఒక జూనియర్ ఆర్టిస్ట్ గా తన కెరీర్ ను మొదలుపెట్టి సక్సెస్ ఫుల్ యాంకర్ […]

Written By:
  • admin
  • , Updated On : September 25, 2020 / 06:11 PM IST
    Follow us on


    తెలుగులో గ్లామరస్ యాంకర్ అంటే.. ఇప్పుడు అనసూయ, రష్మీ గౌతమ్, శ్రీముఖి అంటూ చాలామంది పేర్లే వినిపిస్తున్నాయి గానీ, ఒకప్పుడు తెలుగులో గ్లామరస్ యాంకర్ అంటే ఒక్కరి పేరే ఎక్కువుగా వినిపించేది ఆమె యాంకర్ ‘శిల్పా చక్రవర్తి’. ఒకప్పుడు మంచి మంచి షోలకు అదిరిపోయేలా యాంకరింగ్ చేసింది. యాంకర్‌ గానే కాకుండా కొన్ని సినిమాల్లో నటిగా కూడా కనిపించి అలరించింది. నిజానికి ఒక జూనియర్ ఆర్టిస్ట్ గా తన కెరీర్ ను మొదలుపెట్టి సక్సెస్ ఫుల్ యాంకర్ గా క్రేజ్ తెచ్చుకుని, ఆ క్రేజ్ తో సినిమాల్లోనూ అవకాశాలను తెచ్చుకుని కెరీర్ సక్సెస్ ఫుల్ గా వెళ్తున్న టైంలో సడెన్ గా పెళ్లి చేసుకుని, కొన్నాళ్ళు యాంకరింగ్ కి, ఇండస్ట్రీకి దూరం అయిపొయింది ‘శిల్పా చక్రవర్తి’.

    Also Read: కోరిక తీరకుండానే చనిపోయిన ఎస్పీ బాలు

    ఈ గ్యాప్ లో అనసూయ, రష్మీ గౌతమ్, లాస్య, శ్రీముఖి అంటూ చాలామంది యాంకర్లే క్రేజ్ ను సంపాదించుకున్నారు. మళ్లీ శిల్పా చక్రవర్తి యాంకర్ గా ప్రయత్బాలు చేసినా అంత గొప్పగా చాన్స్ లు ఏమి రాలేదు. ఏదో చిన్న చిన్న సినిమాల ఆడియో ఫంక్షన్స్ కు యాంకర్ గా తప్ప.. పెద్దగా అవకాశాలు కూడా ఆమెకు రాలేదు. వెండితెరైనా బుల్లితెరైనా హీరోయిన్స్ కు లాగే యాంకర్లకు కూడా తక్కువ కెరీరే ఉంటుందనేది దీన్ని బట్టి అర్ధం అయింది. పైగా ఆ తక్కువ కెరీర్లోనే కరెక్ట్ గా ప్లాన్ చేసుకోకపోతే డల్ ఫేజ్ ను కూడా భరించాల్సిందే. ప్రస్తుతం ఈ ఓల్డ్ యాంకర్ కూడా అలాంటి దశలోనే ఉంది.

    Also Read: బిగ్ బాస్-4లో మరో వైల్డ్ కార్డు ఎంట్రీ.. హాట్ హీరోయిన్ ఎంట్రీ?

    ఒకపక్క తనకంటే వెనుక వచ్చిన యాంకర్స్ కి రోజురోజుకు డిమాండ్ పెరుగుతూ పోతుంటే.. తనకు మాత్రం సరైన చాన్స్ లు కూడా రావట్లేదని శిల్పా చక్రవర్తి బాధ పడుతుందట. అయితే కొన్ని టీవీ షోలలో అవకాశాలు ఉన్నప్పటికీ అవి చెప్పుకోదగ్గ ఆఫర్లు కాదని, సమ, అనసూయ లాంటి వారికీ మెయిన్ షోల నుండి ఆఫర్స్ వస్తుంటే, తనకు మాత్రం ఊరు పేరు లేని సినిమాల ఫంక్షన్స్ కి యాంకరింగ్ చేయమని అడుగుతున్నారని శిల్పా చక్రవర్తి ఫీల్ అవుతోంది. అందుకే ఇక సినిమాల్లో నటిగా అవకాశాల కోసం ప్రయత్నించి.. సక్సెస్ ఫుల్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారిపోవాలని శిల్పా చక్రవర్తి ప్రస్తుతం ప్లాన్ లో ఉందట. ఈ క్రమంలోనే ఆమె త్రివిక్రమ్ ను ఛాన్స్ ఇవ్వమని అడుగుతుందట, ‘నువ్వే నువ్వే’ సినిమా దగ్గర నుండి ఆమెకు త్రివిక్రమ్ తో పరిచయం ఉంది.