https://oktelugu.com/

రవిప్రకాష్ కొత్త చానెల్ తో రెచ్చిపోతారట..!

తెలుగు న్యూస్ చానెల్స్ కే ఒక ఒరవడిని నేర్పిన ఘనత ఖచ్చితంగా టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్ దే.. ఆయన సారథ్యంలోని ప్రముఖ చానెల్ తెలుగులో ఇప్పటికీ నంబర్ 1 పొజిషన్ లో ఉందంటే అది ఖచ్చితంగా రవిప్రకాశ్ ఘనతే అంటారు.. రవిప్రకాష్ ప్రభుత్వాలతో పెట్టుకొని కేసులతో మీడియా సర్కిల్స్ నుంచి వైదొలగాల్సి వచ్చింది. లేకుంటే ఈ పరిస్థితి వచ్చేది కాదంటారు. Also Read: హరీష్ రావుకు గట్టి కౌంటర్ ఇచ్చిన ఏపీ మంత్రి అందుకే ఈసారి […]

Written By:
  • NARESH
  • , Updated On : September 25, 2020 / 06:06 PM IST
    Follow us on

    తెలుగు న్యూస్ చానెల్స్ కే ఒక ఒరవడిని నేర్పిన ఘనత ఖచ్చితంగా టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్ దే.. ఆయన సారథ్యంలోని ప్రముఖ చానెల్ తెలుగులో ఇప్పటికీ నంబర్ 1 పొజిషన్ లో ఉందంటే అది ఖచ్చితంగా రవిప్రకాశ్ ఘనతే అంటారు..

    Image Source: Ravi Prakash

    రవిప్రకాష్ ప్రభుత్వాలతో పెట్టుకొని కేసులతో మీడియా సర్కిల్స్ నుంచి వైదొలగాల్సి వచ్చింది. లేకుంటే ఈ పరిస్థితి వచ్చేది కాదంటారు.

    Also Read: హరీష్ రావుకు గట్టి కౌంటర్ ఇచ్చిన ఏపీ మంత్రి

    అందుకే ఈసారి రాజకీయ నాయకులకు తావివ్వకుండా.. ఎవ్వరినీ ఇన్ వాల్వ్ చేయకుండా.. సొంత డబ్బులతో ఎవ్వరి ప్రమేయం లేకుండా రవిప్రకాష్ కొత్త చానెల్ కు పురుడు పోస్తున్నాడన్న టాక్ జర్నలిస్ట్ సర్కిల్స్ లో వినిపిస్తోంది.

    Image source : tv9journalists.live

    ఈ క్రమంలోనే కొంతమంది ఫేమస్ జర్నలిస్టులు టాప్ న్యూస్ చానెల్స్ నుంచి వైదొలుగుతున్నారు. నంబర్ 1 న్యూస్ చానెల్స్ బాధ్యతలు చూస్తున్న గట్టి సీనియర్ జర్నలిస్టు కూడా రవిప్రకాష్ తో టై అప్ అయ్యాడని ఆయన కూడా వైదొలుగుతున్నాడనే ప్రచారం రెండు మూడు రోజులుగా సాగుతోంది. కీలక జర్నలిస్టులు అంతా వరుసబెట్టి చానెల్స్ నుంచి వైదొలగుతుండడంతో ఏంటీ పరిణామం అని ఆరాతీస్తే అసలు విషయం వెలుగుచూస్తోంది.

    Also Read: ఎస్పీ బాలుకు సినీ, రాజకీయ ప్రముఖుల నివాళులు

    రవిప్రకాష్ కొత్తగా న్యూస్ చానెల్స్ పెట్టబోతున్నాడని.. ఏ పార్టీకి సంబంధం లేకుండా ప్రజల కోణం.. అందరినీ ఉతికి ఆరేసేలా చానెల్ తీర్చిదిద్దబోతున్నట్టు టాక్ నడుస్తోంది. అందుకే ఫేమస్ జర్నలిస్టులు అందరినీ తన వద్దకు పిలిపించుకొని మళ్లీ కొత్త చానెల్ కు పురుడు పోస్తున్నట్టు మీడియా వర్గాల్లో ప్రచారం సాగుతోంది. జాతీయ స్థాయిలో రిపబ్లిక్ చానెల్ లాగా తెలుగులోనూ రవిప్రకాష్ కొత్త న్యూస్ చానెల్ పెట్టి తెలుగు రాజకీయాల్లో రెచ్చిపోవాలని.. ప్రజలకు నిఖార్సైన వార్తలు అందించాలని కంకణం కట్టుకున్నారట.. మరి ఇది నిజమా ఆయనది కార్యరూపం దాల్చుతుందా అనేది చూడాలి.