sunil arora
బీహార్ లో అసెంబ్లీ ఎన్నికల తేదీలను చీఫ్ ఎలక్షన్ కమిషనర్ సునీల్ అరోరా గారు ప్రకటించారు. అసెంబ్లీ ఎన్నికలు మూడు దశల్లో జరగనున్నాయి. మొదటి దశ పోలింగ్ అక్టోబర్ 28న, రెండవ దశ పోలింగ్ నవంబర్ 3న, మూడో దశ పోలింగ్ నవంబర్ 7న జరగనున్నాయి. కరోనా మహమ్మారి నేపథ్యంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. దీని కోసం 7లక్షల హ్యాండ్ శానిటైజర్ లు, 46లక్షల మాస్క్ లు, 6.7లక్షల పీపీఈ కిట్లను 23లక్షల గ్లౌస్ ను సిద్ధం చేసినట్లు చెప్పారు. 243అసెంబ్లీ స్థానాలున్న బీహార్ ప్రభుత్వం గడువు అక్టోబర్ 29న ముగియనుంది.
Also Read: సీఏఏ అల్లర్లు.. దిగ్గజ నేతలకు బీజేపీ షాక్