మహారాష్ట్రలోని ఔరంగాబాద్ లో ఈ రోజు (శుక్రవారం) తెల్లవారుజామున జరిగిన ఘోర రైలు ప్రమాదంలో 15 మంది వలస కార్మికులు మరణించడం పై ప్రధాని మోడీ దిగ్భ్రాంతి చెందారు. ఔరంగాబాద్ లో జరిగిన ఈ రైలు ప్రమాదం కారణంగా ప్రాణాలు కోల్పోయినందుకు ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తి చేశారు..
ఈ ఘటనపై రైల్వే మంత్రి శ్రీ పియూష్ గోయల్ మాట్లాడుతూ… పరిస్థితిని నిశితంగా పరిశీలించిన అనంతరం.. లాక్ డౌన్ కారణంగా కార్మికులు మధ్యప్రదేశ్ కి వారి సొంత ప్రాంతాలకు ట్రాక్స్ వెంట నడుస్తున్నారు. ఈ క్రమంలో రాత్రి కావడం వల్ల 20మంది కూలీలు సేదతీరడం కోసం ట్రాక్ పైన ఉపక్రమించారు. తెల్లవారుజామున సుమారు 4గంటల ప్రాంతంలో అటుగా వచ్చిన ఒక గూడ్స్ రైలు వలస కూలీలను చిదిమేసింది. ఈ ఘటన పై తాను ప్రగాఢ సానుభూతిని తెలిజేస్తున్నట్లు మంత్రి వెల్లడించారు.