https://oktelugu.com/

Anchor Shyamala: ఇండస్ట్రీ పై యాంకర్ కమ్ నటి అసంతృప్తి

Anchor Shyamala: యాంకర్ శ్యామల సినీ నటిగా రాణించాలని చాలా ఆశ పడింది. అయితే, శ్యామల ప్రస్తుతం తెలుగు సినీ పరిశ్రమ పై అసంతృప్తిగా ఉందట. ఆ అసంతృప్తికి కారణం.. తానూ మంచి యాంకర్ అని.. అలాగే మంచి నటిని కూడా అని.. అయినా అవకాశాలు మాత్రం తనకు తగినట్టు రావడం లేదని యాంకర్ శ్యామల తెగ ఫీల్ అయిపోతుంది. అసలు హీరోయిన్ రేంజ్ గ్లామర్ తనలో ఉన్నా… తనను ఇప్పటికీ చిన్నాచితకా పాత్రలకు మాత్రమే పరిమితం […]

Written By: , Updated On : March 9, 2022 / 06:09 PM IST
Follow us on

Anchor Shyamala: యాంకర్ శ్యామల సినీ నటిగా రాణించాలని చాలా ఆశ పడింది. అయితే, శ్యామల ప్రస్తుతం తెలుగు సినీ పరిశ్రమ పై అసంతృప్తిగా ఉందట. ఆ అసంతృప్తికి కారణం.. తానూ మంచి యాంకర్ అని.. అలాగే మంచి నటిని కూడా అని.. అయినా అవకాశాలు మాత్రం తనకు తగినట్టు రావడం లేదని యాంకర్ శ్యామల తెగ ఫీల్ అయిపోతుంది.

Anchor Shyamala

Anchor Shyamala

అసలు హీరోయిన్ రేంజ్ గ్లామర్ తనలో ఉన్నా… తనను ఇప్పటికీ చిన్నాచితకా పాత్రలకు మాత్రమే పరిమితం చేశారనే కోపం ఆమెలో రోజురోజుకూ ఎక్కువ అవుతుందట. తనను కేవలం చిన్న నటిగానే చూస్తున్నారని, అలాగే చిన్న యాంకర్ గానే చూస్తున్నారని మొత్తానికి శ్యామల తెగ ఇదైపోతుంది. ఎంత గొప్ప టాలెంట్ ఉన్నా కెరీర్లో ఎప్పుడో ఒకసారి డల్ ఫేజ్ చూడాల్సిందే కదా,

Also Read: ‘ఆడవాళ్లు..’ దెబ్బకు నష్టాల్లో కూరుకుపోయిన నిర్మాత

ఇదే విషయాన్ని ఆమె సన్నిహితులు ఆమెకు సర్ది చెబుతున్నా యాంకర్ శ్యామల మాత్రం శాతించట్లేదట. నాకు అన్నీ ఉన్నాయి. మరి నాకెందుకు అవకాశాలు ఇవ్వరు ? నాలో ఏమి తక్కువ ? నేను అనసూయ కంటే బాగుంటాను కదా ?, కానీ మేకర్స్ మాత్రం అనసూయ వెంటే పడుతున్నారు. టాలెంట్ ను సరిగ్గా గుర్తించడం లేదు అంటూ శ్యామల విరుచుకుపడుతుందట.

తనకు ఈ మధ్య టీవీ షోలలో కూడా సరైన అవకాశాలు రావడం లేదని యాంకర్ శ్యామల చేస్తోన్న ప్రధాన ఆరోపణ. నిజానికి శ్యామల ఎప్పటినుంచో ఇండస్ట్రీలో ఉన్నప్పటికీ మొదటి నుంచి ఆమెకు సినిమాల్లో చెప్పుకోదగ్గ ఆఫర్లు రాలేదు. ఒకటి రెండు సినిమాల్లో కాస్త గుర్తింపు ఉన్న పాత్రల్లో నటించినా అవేవీ యాంకర్ శ్యామల కెరీర్ కు ఏ రకంగానూ ఉపయోగపడలేదు.

Anchor Shyamala

Anchor Shyamala

అందుకే శ్యామలకు ఇండస్ట్రీ మీద ఇంట్రస్ట్ పోతుందని బాధ పడుతుంది. కనీసం ఇక నుండైనా తను మూవీస్ లో బిజీ కావాలని తెగ ఆరాట పడుతుంది. ఏది ఏమైనా ఆమె బాధలో అర్ధం ఉంది. ఆమె కంటే టాలెంట్ తక్కువ ఉన్న వారు కూడా చక్కగా కెరీర్ లో మంచి అవకాశాలను అందిపుచ్చుకుంటుంటే.. యాంకర్ శ్యామల మాత్రం ఇంకా సరైన ఛాన్స్ అంటూ ఎదురుచూడటం బాధాకరమైన విషయమే.

Also Read:మెగాస్టార్ సినిమాలో అలనాటి కలువ కళ్ల నటి

Tags