https://oktelugu.com/

Pawan Kalyan Help Cricketer Shaikh Rasheed: పవన్ కల్యాణ్ యువ క్రికెటర్ కు చేసిన సాయమెంత?

Pawan Kalyan Help Cricketer Shaikh Rasheed: ప్రముఖ కథానాయకుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ సాయం చేయడానికి ఎప్పుడు ముందుంటారు. సామాజిక సేవలో తనదైన శైలిలో దూసుకుపోతారు. అలాగని అపాత్ర దానం చేయరు. అవసరమైన వారికే ఆర్థికంగా చేయూతనిచ్చి ప్రచారం మాత్రం చేసుకోరు. దీంతో ఆయన సాయం చేసిన వారెందరో ఉన్నా ఆయన మాత్రం తాను చేస్తున్న పని గురించి నలుగురికి తెలవాలని అనుకోరు. అదే ఆయన ప్రత్యేకత. దీంతో పవన్ కల్యాణ్ చేసిన సాయంతో […]

Written By:
  • Srinivas
  • , Updated On : March 9, 2022 / 06:02 PM IST
    Follow us on

    Pawan Kalyan Help Cricketer Shaikh Rasheed: ప్రముఖ కథానాయకుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ సాయం చేయడానికి ఎప్పుడు ముందుంటారు. సామాజిక సేవలో తనదైన శైలిలో దూసుకుపోతారు. అలాగని అపాత్ర దానం చేయరు. అవసరమైన వారికే ఆర్థికంగా చేయూతనిచ్చి ప్రచారం మాత్రం చేసుకోరు. దీంతో ఆయన సాయం చేసిన వారెందరో ఉన్నా ఆయన మాత్రం తాను చేస్తున్న పని గురించి నలుగురికి తెలవాలని అనుకోరు. అదే ఆయన ప్రత్యేకత. దీంతో పవన్ కల్యాణ్ చేసిన సాయంతో ఎందరో తమ సమస్యలు తీర్చుకుని జీవితంలో ఎంతో ఎత్తుకు ఎదిగిన వారు ఉన్నట్లు తెలుస్తోంది.

    Pawan Kalyan Help Cricketer Shaikh Rasheed

    ఆయన సినిమాల్లోనే కాదు నిజజీవింతో కూడా హుందాగానే వ్యవహరిస్తారు. తన సంపాదనతో ఏదో చేయాలని భావించరు. ఉన్న దాంట్లోనే తృప్తి చెందుతూ సామాజిక సేవలో పలువురికి సాయం చేస్తూ ఉంటారు. మీడియా ముఖంగా కూడా ఎప్పుడు ఇదే చెబుతారు. తనకు ఏదో ఫామ్ హౌస్ కొనుక్కుని అందులో ఉంటూ కాలక్షేపం చేయాలని ఉండదని మనసులోని మాట చెబుతుంటారు. జీవితంలో మనతో పాటు ఇతరులు కూడా బతకాలని ఆశిస్తుంటారు.

    Also Read:  ఉద్యోగాల ప్రకటనపై ప్రతిపక్షాల గోల

    ఇటీవల యువ క్రికెట్ లో సంచలన సృష్టించిన తెలుగు కుర్రాడు షేక్ రషీద్. యువ ప్రపంచ కప్ గెలుచుకోవడంలో ప్రధాన భూమిక పోషించాడు. బ్యాట్ తో తనదైన శైలిలో ఆడి భారత అభిమానుల ఆశలు సజీవం చేశాడు. కప్ గెలుచుకోవడంలో ముఖ్య పాత్ర వహించడం తెలిసిందే. దీంతో అతడికి సాయం చేయాలని భావించారు. ఈ నేపథ్యంలో పవన్ కల్యాణ్ లెర్నింగ్ సెంటర్ హ్యూమన్ ఎక్సలెన్స్ ట్రస్ట్ నుంచి రూ. 2 లక్షల ఆర్థిక సాయం అందజేశారు.

    Shaikh Rasheed

    దీంతో పవన్ కల్యాణ్ ను ఆయన అభిమానులు ప్రశంసించారు. పవన్ కు ఉన్న ఉదారతను చాటుకోవడం సమంజసమే అని చెబుతున్నారు. ఈ విషయం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. నెటిజన్లు పొగడ్తల్లో ముంచెత్తుతున్నారు. పవన్ కల్యాణ్ చేసిన సాయం గురించి పలు రకాలుగా ప్రచారం సాగుతోంది. క్రికెటర్ షేక్ రషీద్ ను ఆదుకోవడం నిజంగా మంచి పరిణామమే అని చెబుతున్నారు.

    Also Read:  ప్రతి సంవత్సరం ఉద్యోగ క్యాలెండర్ విడుదలకు కేసీఆర్ రెడీయేనా?

    Tags