https://oktelugu.com/

Ram Charan Birthday Surprise: వైరల్ : ‘రామ్ చరణ్’ బర్త్‌ డే సర్‌ ప్రైజ్ రెడీ

Ram Charan Birthday Surprise: మెగా పవర్ స్టార్ ‘రామ్ చరణ్ తేజ్’ హీరోగా విజువల్ ఇంద్రజాలికుడు శంకర్ దర్శకత్వంలో రాబోతున్న భారీ పాన్ ఇండియా సినిమా టైటిల్ ఏమిటి ? అంటూ ఎప్పటి నుంచో అనేక రూమర్లు వినిపిస్తున్నాయి. అయితే, తాజాగా ఈ సినిమా టైటిల్ పై క్లారిటీ రానుంది. ఈ సినిమా టైటిల్‌ ను మార్చి 27న ప్రకటించేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆ రోజు చరణ్ బర్త్‌డే కావడంతో అభిమానులకు సర్‌ప్రైజ్ […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : March 9, 2022 / 06:13 PM IST
    Follow us on

    Ram Charan Birthday Surprise: మెగా పవర్ స్టార్ ‘రామ్ చరణ్ తేజ్’ హీరోగా విజువల్ ఇంద్రజాలికుడు శంకర్ దర్శకత్వంలో రాబోతున్న భారీ పాన్ ఇండియా సినిమా టైటిల్ ఏమిటి ? అంటూ ఎప్పటి నుంచో అనేక రూమర్లు వినిపిస్తున్నాయి. అయితే, తాజాగా ఈ సినిమా టైటిల్ పై క్లారిటీ రానుంది. ఈ సినిమా టైటిల్‌ ను మార్చి 27న ప్రకటించేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

    Ram Charan

    ఆ రోజు చరణ్ బర్త్‌డే కావడంతో అభిమానులకు సర్‌ప్రైజ్ ఇవ్వనున్నారట. ‘సర్కారోడు’ అనే పేరును ఖరారు చేశారని తెలుస్తోంది. రూ.350 కోట్లతో పొలిటికల్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ సినిమాలో హీరోయిన్‌గా కియారా అద్వానీ నటిస్తోంది. ఇప్పటికే ఈ పాన్ ఇండియా సినిమా మొదటి షెడ్యూల్ షూటింగ్ ను కూడా పూర్తి చేసుకుంది.

    Also Read: పవన్ కల్యాణ్ యువ క్రికెటర్ కు చేసిన సాయమెంత?

    ఇక ఈ సినిమా షూటింగ్‌ కు చరణ్ స్మాల్‌ బ్రేక్‌ ఇచ్చి తన సతీమణి ఉపాసనతో కలిసి వేకేషన్‌ కి వెళ్లిన సంగతి తెలిసిందే. సినిమాలతో నిత్యం బిజీగా ఉండే ఈ మెగా హీరో.. ప్రస్తుతం తన భార్యకు సమయం కేటాయించి సరదాగా గడుపుతున్నాడు. కాగా చరణ్ తన భార్య ఉపాసనతో కలిసి ఫిన్లాండ్కు విహారయాత్రకు వెళ్లాడు. ఇందుకు సంబంధించిన ఫొటోను చరణ్ తన ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశారు.

    Ram Charan

    ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కూడా అయ్యాయి. కాగా రామ్‌చరణ్‌–శంకర్‌ సినిమాని ‘దిల్‌’ రాజు, శిరీష్‌ నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్‌ చేయాలనే ప్రయత్నాల్లో ఉన్నారు చిత్ర యూనిట్‌. ఇక భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ భారీ సినిమాలో చరణ్ పాత్ర వెరీ పవర్ ఫుల్ గా ఉండనుంది.

    ఇక రాజకీయ నేపథ్యంలో సాగే ఈ సినిమాలో రామ్‌ చరణ్‌ ఐఏఎస్ అధికారిగా నటిస్తున్నాడు. ఐఏఎస్ అంటే.. సినిమా కాస్త సీరియస్ టోన్ లో సాగనుంది.

    Also Read: మెగాస్టార్ సినిమాలో అలనాటి కలువ కళ్ల నటి

    Tags