Homeఎంటర్టైన్మెంట్Anasuya Bharadwaj: లైగర్ మూవీ ఫ్లాప్ అవ్వడం తో సంబరాలు చేసుకుంటున్న యాంకర్ అనసూయ

Anasuya Bharadwaj: లైగర్ మూవీ ఫ్లాప్ అవ్వడం తో సంబరాలు చేసుకుంటున్న యాంకర్ అనసూయ

Anasuya Bharadwaj: భారీ అంచనాల నడుమ పాన్ ఇండియా లెవెల్ లో అన్ని ప్రాంతీయ బాషలలో ఈరోజు విజయ్ దేవరకొండ హీరో గా నటించిన లైగర్ సినిమా విడుదలైన సంగతి మన అందరికి తెలిసిందే..విడుదలకు ముందు ఎంతో హైప్ ని పెంచిన ఈ చిత్రం విడుదల తర్వాత ఆ అంచనాలను కనీస స్థాయిలో కూడా అందుకోలేకపోయింది..వరల్డ్ ఫేమస్ లవర్ అనే భారీ డిజాస్టర్ సినిమా తర్వాత మళ్ళీ ఇంకో డిజాస్టర్ ఫ్లాప్ తగలడం విజయ్ దేవరకొండ కి పెద్ద షాక్ అనే చెప్పాలి..ఫస్ట్ హాఫ్ పర్వాలేదు అని అనిపించినప్పటికీ, సెకండ్ హాఫ్ మరీ రొటీన్ గా అనిపించడం తో ఈ సినిమాకి ఆ రేంజ్ ఫ్లాప్ టాక్ వచ్చింది అంటున్నారు సినీ విశ్లేషకులు..స్టార్ హీరో ప్రీ రిలీజ్ బిజినెస్ రేంజ్ లో ఈ సినిమాకి 90 కోట్ల రూపాయిల థియేట్రికల్ బిజినెస్ జరిగింది..టాక్ తేడా అవ్వడం తో చాలా చోట్ల మ్యాట్నీ నుండే థియేటర్స్ ఖాళి అయిపోయాయి..ఇక రేపటి నుండి పరిస్థితి ఏమిటో అని ఈ సినిమాని కొన్న బయ్యర్లు ఆందోళన చెందుతున్నారు.

Anasuya Bharadwaj
Anasuya Bharadwaj

అసలే టాలీవుడ్ కి జులై నెల ఒక పీడకల లాంటిది..వరుస డిజాస్టర్ ఫ్లాప్స్ తో సంక్షోభం లో పడింది..ఇక ఆ తర్వాత ఆగస్టు నెల భలే కలిసివచ్చింది..ఈ నెలలో విడుదలైన భింబిసారా, సీతారామం మరియు కార్తికేయ 2 వంటి చిత్రాలు బాక్స్ ఆఫీస్ ని దున్నేశాయి..టాలీవుడ్ లో కొత్త ఆశలు చిగురించేలా చేసాయి..అలా మంచి ఊపు మీద వెళ్తున్న టాలీవుడ్ కి ఇప్పుడు లైగర్ సినిమా ఒక పెద్ద స్పీడ్ బ్రేకర్ లాగ నిలిచింది..ఇదంతా పక్కన పెడితే ఈ సినిమా ఫ్లాప్ అవ్వగానే విజయ్ దేవరకొండ అంటే పడని కొంతమంది సెలెబ్రిటీలు పండగ చేసుకున్నారు..వారిలో యాంకర్ అనసూయ కూడా ఒకరు.

Anasuya Bharadwaj
Anasuya Bharadwaj

ఈమెకి మొదటి నుండి విజయ్ దేవరకొండ అంటే అసలు పడదు..అర్జున్ రెడ్డి సినిమా సమయం లో కూడా విజయ్ దేవరకొండ పై చాలా తీవ్రమైన విమర్శలు చేసింది..’మదర్ చోర్’ వంటి పదాలను సినిమాల్లో ఉపయోగిస్తారా..అసలు మీరు మనుషులేనా అంటూ కామెంట్ చేసింది..ఈరోజు లైగర్ సినిమా ఫ్లాప్ అయ్యింది అని తెలియగానే వెంటనే ట్విట్టర్ లో ‘అమ్మని అన్న ఉసురు ఊరికే పోదు. కర్మ.. కొన్నిసార్లు రావటం లేటవ్వచ్చేమో కాని రావటం మాత్రం పక్కా!!’ అంటూ విజయ్ దేవరకొండ ని ఉద్దేశిస్తూ వేసిన ఒక ట్వీట్ ఇప్పుడు సెన్సషనల్ గా మారింది..ఈమె ఈ ట్వీట్ వెయ్యడం తో నెటిజెన్స్ ఆమెని దారుణంగా ట్రోల్ చేస్తున్నారు..నువ్వు చేసే బూతు షో లు మళ్ళీ నువ్వు వచ్చి నీతులు చెప్తున్నావా అంటూ తిడుతూ ఉన్నారు..మరి అనసూయ కామెంట్స్ కి విజయ్ దేవరకొండ రెస్పాన్స్ ఇస్తాడా లేదా అనేది చూడాలి.

 

నువ్వే నా భార్య || Posani Give Shock To Serial Actress Yamuna || Tollywood || Oktelugu Entertainment

 

బిగ్ బాస్ ప్రియాంక సింగ్ హల్దీ ఫొటోస్ వైరల్ | Bigg Boss Priyanka Singh Haldi Photos Viral | BiggBoss

Neelambaram
Neelambaramhttps://oktelugu.com/
Neelambaram is a Web Admin and is working with our organisation from last 6 years and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.
Exit mobile version