Chiranjeevi Mother Anjana Devi: చిరంజీవి గారి తల్లికి బాగా ఇష్టమైన హీరో ఎవరో తెలిస్తే ఆశ్చర్యపోతారు

Chiranjeevi Mother Anjana Devi: ఏ జన్మలో ఎంత పుణ్యం చేసుకొందో తెలియదు కానీ..అంజనా దేవి గారికి తన ఇంట్లో కోట్లాది మంది ఆరాధ్య దైవం లాగ కొలిచే చిరంజీవి మరియు పవన్ కళ్యాణ్ వంటి వారికి జన్మని ఇచ్చింది..వీళ్ళ ద్వారా అదే కుటుంబం నుండి ఎంత మంది హీరోలు నేడు ఇండస్ట్రీ కి వచ్చి అభిమానుల నుండి విశేష ఆదరణ పొందుతున్నారో మన అందరికి తెలిసిందే..ముఖ్యంగా అంజనా దేవి గారి మనవడు మెగా పవర్ స్టార్ […]

Written By: Neelambaram, Updated On : August 26, 2022 6:06 pm
Follow us on

Chiranjeevi Mother Anjana Devi: ఏ జన్మలో ఎంత పుణ్యం చేసుకొందో తెలియదు కానీ..అంజనా దేవి గారికి తన ఇంట్లో కోట్లాది మంది ఆరాధ్య దైవం లాగ కొలిచే చిరంజీవి మరియు పవన్ కళ్యాణ్ వంటి వారికి జన్మని ఇచ్చింది..వీళ్ళ ద్వారా అదే కుటుంబం నుండి ఎంత మంది హీరోలు నేడు ఇండస్ట్రీ కి వచ్చి అభిమానుల నుండి విశేష ఆదరణ పొందుతున్నారో మన అందరికి తెలిసిందే..ముఖ్యంగా అంజనా దేవి గారి మనవడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నేడు పాన్ వరల్డ్ రేంజ్ స్టార్ గా ఎదిగాడు..ఇక రెండవ కొడుకు నాగబాబు తనయుడు వరుణ్ తేజ్ , మరియు కూతురు కొడుకులు సాయి ధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్ వంటి వారు కూడా ఇండస్ట్రీ లో గ్రాండ్ సక్సెస్ అయ్యారు..ఇలా తన కుటుంబం లో ఎంతో మంది ఇండస్ట్రీ కి వచ్చి స్టార్ హీరోలుగా కొనసాగుతూ అశేష ప్రేక్షాదరణని పొందుతున్నారు..కానీ తన కుటుంబం లో ఇంతమంది హీరోలు ఉన్నప్పటికీ కూడా..అంజనా దేవి గారికి ఇష్టమైన హీరో వేరేనట.

Chiranjeevi Mother Anjana Devi

ఆమెకి సినిమాలు అంటే ఊహ తెలిసినప్పటి నుండి అక్కినేని నాగేశ్వర రావు అంటే మహా ఇష్టమట..ఒక్కమాటలో చెప్పాలంటే ఆయనకీ పెద్ద వీరాభిమాని అని చెప్పొచ్చు..ఆయన సినిమా వస్తే థియేటర్ కి వెళ్లి కచ్చితంగా చూసేవారట అప్పట్లో అంజనా దేవి గారు..ఇక చిరంజీవి గారు చిన్నప్పటి నుండి నందమూరి తారకరామారావు గారికి ఫ్యాన్ అనే సంగతి మన అందరికి తెలిసిందే..ఇక పవన్ కళ్యాణ్ అమితాబ్ బచ్చన్ గారికి పెద్ద ఫాన్..ఇలా కోట్లాది మంది అభిమానుల చేత ఆరాధింపబడే వీళ్ళు ఇతర హీరోలకు ఇంత పెద్ద ఫాన్స్ అని తెలిసి మెగా అభిమానులు ఆశ్చర్యపోతున్నారు.

Chiranjeevi Mother Anjana Devi

ఇక చిరంజీవి మరియు పవన్ కళ్యాణ్ ప్రస్తుతం చేస్తున్న సినిమాల విషయానికి వస్తే..చిరంజీవి మలయాళంలో సూపర్ హిట్ గా నిలిచినా లూసిఫెర్ రీమేక్ గాడ్ ఫాదర్ లో నటిస్తుండగా..పవన్ కళ్యాణ్ హరిహరవీరమల్లు అనే సినిమా లో నటిస్తున్నాడు..ఈ రెండు సినిమాలపై అభిమానులు భారీ స్థాయిలోనే అంచనాలు పెట్టుకున్నారు..చూడాలిమరి వారి అంచనాలను ఈ సినిమా ఎంతవరుకు అందుకుంటుంది అనేది.

 

 

Tags