Anasuya Bharadwaj: యాంకర్ అనసూయ సమ్మర్ వెకేషన్ లో ఉంది. పెద్ద కొడుకు బర్త్ డే కూడా కావడంతో వెకేషన్ ప్లాన్ చేశారు. ఇష్టమైన ప్రదేశానికి ఫ్యామిలీతో చెక్కేశారు. ఇక అనసూయ ఎప్పటికప్పుడు తన వెకేషన్ ఫోటోలు షేర్ చేస్తుంది. తాజాగా ఆమె పోస్ట్ చేసిన వీడియో బోల్డ్ గా ఉంది. పలుచని టాప్ వేసుకొని ప్యాంటు లేకుండా క్రేజీ వీడియో చేసింది. అనసూయ స్కిన్ షో నెక్స్ట్ లెవెల్ అన్నట్లు ఉంది. వీడియో చూసిన నెటిజెన్స్ దారుణమైన కామెంట్స్ చేస్తున్నారు. పెళ్ళైనా కూడా కుర్రోళ్లని రెచ్చగొడుతోందని ఒకరు కామెంట్ చేశారు. కొందరైతే రాయలేని భాషలో ఆమె శరీరాన్ని వర్ణించారు.
అనసూయ వీడియో పెద్ద ఎత్తున వైరల్ అవుతుంది. అనసూయ మీద ట్రోల్స్ ఎక్కువవుతుండగా ఆమె మరింత ఎక్కువ చేస్తుంది. మీరు ఎంత ట్రోల్ చేస్తే అంత రెచ్చిపోతాను అంటుంది. వెకేషన్ లో అనసూయ బికినీ కూడా వేయడం విశేషం. కాకపోతే అస్పష్టంగా ఆ ఫోటోలు షేర్ చేసింది. పూర్తి స్థాయిలో బికినీ లుక్ రివీల్ చేయలేదు. అనసూయ తెగింపుకు ఆమె హేటర్స్ మైండ్ బ్లాక్ అవుతుంది. ఇటీవల అనసూయ-విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ మధ్య సోషల్ మీడియా వార్ జరిగిన సంగతి తెలిసిందే.
విజయ్ దేవరకొండ పేరు ముందు The అని చేర్చడాన్ని అనసూయ తప్పుబట్టారు. దాంతో విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ ఫైర్ అయ్యారు. ఆంటీ అంటూ ఆమెను ట్రోల్ చేశారు. అనసూయ విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ కి తిరిగి కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేసింది. దాదాపు వారం రోజులు అనసూయ ట్రోల్స్ కి గురైంది. అనసూయకు ఈ వేధింపులు సహజమే. కెరీర్ బిగినింగ్ నుండి దీన్ని అనసూయ ఎదుర్కొంటున్నారు. అనసూయ డ్రెస్సింగ్ పలుమార్లు వివాదాస్పదమైంది.
జబర్దస్త్ యాంకర్ గా అనసూయ పొట్టి బట్టల్లో స్కిన్ షో చేసేవారు. దీన్ని కొందరు వ్యతిరేకించారు. ఎన్ని విమర్శలు వచ్చినా అనసూయ తగ్గలేదు. నాకు నచ్చిన బట్టలు ధరిస్తా మీకేంటి సమస్య అని ఆమె అడిగేవారు. కాగా అనసూయ యాంకరింగ్ మానేసిన విషయం తెలిసిందే. ఆమె పూర్తి స్థాయిలో నటిగా మారారు. అనసూయకు వరుస ఆఫర్స్ వస్తున్న నేపథ్యంలో నటిగా సెటిల్ అయ్యారు. అనసూయ నటించిన పుష్ప 2 చిత్రీకరణ జరుపుకుంటుంది. ఇటీవల రంగమార్తాండ మూవీలో ఆమె కీలక రోల్ చేశారు.
View this post on Instagram