Anasuya Bharadwaj: అనసూయ భరద్వాజ్ టాలీవుడ్ క్రేజీ యాక్ట్రెస్. ఒకప్పటి ఈ జబర్దస్త్ యాంకర్ సిల్వర్ స్క్రీన్ పై దూసుకుపోతుంది. విలక్షణ పాత్రలు చేస్తుంది. 2023లో ఆమె నటించిన పలు చిత్రాలు విడుదలయ్యాయి. రంగమార్తాండ, విమానం, మైఖేల్, పెదకాపు 1, ప్రేమ విమానం చిత్రాల్లో అనసూయ అలరించారు. ప్రతి సినిమాలో ఆమె ఛాలెంజింగ్ రోల్ చేసింది. విమానం మూవీలో అయితే ఏకంగా వేశ్య పాత్ర చేసి తన గట్స్ నిరూపించుకుంది. సాధారణంగా ఇలాంటి బోల్ రోల్స్ చేసేందుకు నటులు వెనుకాడతారు. అనసూయ మాత్రం ఐ డోంట్ కేర్ అంటూ చేసిపడేసింది.
పెదకాపు 1లో కూడా ఆమె కీలకంగా ఉంటుంది. అయితే ఆ మూవీ ఆడలేదు. దాంతో అనసూయకు గుర్తింపు రాలేదు. అనసూయ చేతిలో ఉన్న భారీ ప్రాజెక్ట్ పుష్ప 2. దర్శకుడు సుకుమార్ తెరకెక్కిస్తున్న పుష్ప 2 మొదటి భాగం పుష్పకు సీక్వెల్. పార్ట్ 1 లో అనసూయ మెయిన్ విలన్ సునీల్ భార్య పాత్రలో కనిపించిన విషయం తెలిసిందే. దాక్షాయణిగా అదే పాత్రలో మరోసారి ఆమె మెప్పించనుంది. పుష్ప 2 వచ్చే ఏడాది ఆగస్టు 15న విడుదల కానుంది.
నటనపై పూర్తి దృష్టి పెట్టిన అనసూయ యాంకరింగ్ మానేశారు. అందుకు ఆమె పలు కారణాలు చెబుతున్నారు. నటిగా-యాంకర్ గా చేయడం వలన ఆడియన్స్ కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఒకే విధమైన ఇమేజ్ కి పరిమితం కావాలనే బుల్లితెరను వదిలేశానని ఓ సందర్భంలో అనసూయ చెప్పుకొచ్చింది. గతంలో బుల్లితెర షో మేకర్స్ టీఆర్పీ స్టంట్స్ నచ్చకే మానేశాను అని కూడా చెప్పింది. ఏది ఏమైనా ఇకపై యాంకరింగ్ చేయకూడదని అనసూయ ఫిక్స్ అయ్యింది.
అయినా యాంకరింగ్ చేయాల్సిన అవసరం కూడా అనసూయకు లేదు. ఆమె సంపాదన కోట్లకు చేరింది. ఈ మధ్య అనసూయతో షాపింగ్ మాల్స్ ఓపెన్ చేయించేందుకు రెండు రాష్ట్రాల వ్యాపారాలు ఆసక్తి చూపుతున్నారు. అనేక ప్రదేశాల్లో షాపింగ్ మాల్స్ ఓపెనింగ్ ఈవెంట్స్ లో ఆమె పాల్గొంది. అందుకు లక్షలు వసూలు చేస్తుంది. అదే సమయంలో ఫ్యాన్స్ ని తన గ్రామర్ తో అలరిస్తుంది. తాజాగా పట్టు చీర కట్టిన అనసూయ బ్యాక్ లెస్ బ్లౌజ్ ధరించి అట్రాక్ చేసింది. అనసూయ లేటెస్ట్ గ్లామరస్ లుక్ వైరల్ అవుతుంది.