https://oktelugu.com/

Bigg Boss 7 Telugu: లీకైన స్టార్ మా అఫీషియల్ ఫైనల్ ఓటింగ్… అతడు ఎలిమినేట్, విన్నర్ ఎవరంటే?

షకీలా, దామిని, శుభశ్రీ, నయని పావని, పూజ మూర్తి, సందీప్, తేజ, భోలే షావలి, అశ్వినిశ్రీ, రతిక రోజ్, గౌతమ్, శోభ శెట్టి వరుసగా ఎలిమినేట్ అయ్యారు.

Written By:
  • NARESH
  • , Updated On : December 16, 2023 / 03:38 PM IST

    Bigg Boss 7 Telugu

    Follow us on

    Bigg Boss 7 Telugu: మూడు నెలలుగా ప్రసారం అవుతున్న బిగ్ బాస్ తెలుగు 7 గ్రాండ్ సక్సెస్. మరికొన్ని గంటల్లో టైటిల్ విన్నర్ ఎవరో కూడా తేలిపోనుంది. సెప్టెంబర్ 3న 14 మంది కంటెస్టెంట్స్ తో సీజన్ 7 స్టార్ట్ అయ్యింది. ఐదు వారాల అనంతరం వైల్డ్ కార్డు ఎంట్రీతో మరో 5 మంది కంటెస్టెంట్స్ హౌస్లో అడుగుపెట్టారు. కిరణ్ రాథోడ్ ఫస్ట్ వీక్ ఎలిమినేట్ అయ్యింది. షకీలా, దామిని, శుభశ్రీ, నయని పావని, పూజ మూర్తి, సందీప్, తేజ, భోలే షావలి, అశ్వినిశ్రీ, రతిక రోజ్, గౌతమ్, శోభ శెట్టి వరుసగా ఎలిమినేట్ అయ్యారు.

    మిగిలిన అమర్, శివాజీ, అర్జున్, ప్రశాంత్, ప్రియాంక, యావర్ లను ఫైనలిస్ట్స్ గా ప్రకటించారు. వీరిలో టైటిల్ విన్నర్ ఎవరనే ఉత్కంఠ నడుస్తుంది. రెండు వారాల క్రితమే ఓటింగ్ లైన్స్ ఓపెన్ అయ్యాయి. పలు మీడియా సంస్థలు అనధికారిక పోల్స్ నిర్వహిస్తున్నాయి. స్టార్ మా రెండు పద్ధతుల్లో ఫేవరేట్ కంటెస్టెంట్ కి ఓటు వేసే విధానం ఏర్పాటు చేసింది.

    హాట్ స్టార్ సబ్స్క్రైబర్స్ యాప్ లో లాగిన్ అయ్యి ఓటు వేయవచ్చు. అలాగే మిస్డ్ కాల్ ద్వారా ఓటు వేయవచ్చు. స్టార్ మా అధికారిక ఓటింగ్ గురించి ఎవరికీ తెలియదు. ఆ సమాచారం బయటకు రాదు. మరికొన్ని గంటల్లో ఫినాలే అనగా అధికారిక ఓటింగ్ రిజల్ట్ లీకైంది. దాని ప్రకారం ఎవరెవరు ఈ పొజీషన్ లో ఉన్నారో చూద్దాం. అర్జున్ అంబటికి అందరి కంటే తక్కువ ఓట్లు పోల్ అయ్యాయట. అతడు టాప్ 5 నుండి తప్పుకున్నాడట.

    ఇక టాప్ 5లో ప్రియాంక నిలిచిందట. ఆమె కంటే మెరుగైన ఓట్లతో యావర్ టాప్ 4లో ఉందట. ఇక టైటిల్ రేసు శివాజీ, అమర్, ప్రశాంత్ మధ్యే అని ముందు నుండి అనుకుంటున్నాం. ఫైనల్ ఓటింగ్ లో కూడా అదే రిజల్ట్ వచ్చింది. అమర్ దీప్ 3 స్థానంలో నిలిచాడట. ఇక టైటిల్ కోసం శివాజీ-ప్రశాంత్ పోటీపడ్డారట. ఉత్కంఠ మధ్య పల్లవి ప్రశాంత్ ని టైటిల్ విన్నర్ గా ప్రకటించారట. శివాజీ రన్నర్ గా నిలిచాడట. ఈ మేరకు విశ్వసనీయ సమాచారం అందుతుంది. అనధికారిక పోల్స్ లో కూడా పల్లవి ప్రశాంత్ టాప్ లో ఉన్నాడు.