Pakistan Occupied Kashmir
Pakistan Occupied Kashmir: ఇది ఇప్పటి విషయం కాదు. దశాబ్దాలుగా కొనసాగుతున్న యుద్ధం. నాడు నెహ్రూ హయాంలో జరిగిన తప్పిదం నేటికీ కాశ్మీర్ ను రావణ కాష్టం లాగా మండిస్తూనే ఉంది. మరోవైపు పాకిస్తాన్ ఇతర దేశాల అండతో సరిహద్దుల వెంట కవ్వింపు చర్యలకు పాల్పడుతూనే ఉంది. మన దేశ సైనికుల ప్రాణాలను బలి తీసుకుంటూనే ఉంది. అయితే మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత గేమ్ అనేది మరోవైపు టర్న్ తీసుకుంది. కాశ్మీర్లో పాకిస్తాన్ అనుకూల శక్తులను అణచడం ప్రారంభమైంది. భారత వ్యతిరేక శక్తులను పాకిస్థాన్లో ఏరి వేయడం షురూ అయింది. అంతేకాదు కాశ్మీర్లో భారత జెండా ఎగిరింది. ఆర్టికల్ 370 రద్దయింది. ఏర్పాటు వాదులకు ప్రభుత్వ ప్రోత్సాహకాల నిలుపుదల విజయవంతంగా కొనసాగుతోంది. అంతేకాదు పాకిస్తాన్ వెళ్లి ఉగ్రవాదులను మన దేశ సైన్యం మట్టు పెడుతోంది. అయితే సహజంగానే ఈ చర్యలు పాకిస్తాన్ దేశానికి మింగుడు పడటం లేదు. అందుకే అది ప్రపంచ వేదికల మీద భారతదేశాన్ని ఆడిపోసుకుంటుంది. అయితే తాజాగా ఆ దేశం చేసిన ఒక వ్యాఖ్య లు దుమారాన్ని రేపింది. ఆ కథలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వేలు పెట్టడంతో పాకిస్తాన్ పరిస్థితి కుడితి లో పడ్డ ఎలక మాదిరి అయింది.
భారత్ నుంచి పాకిస్తాన్ విడిపోతున్నప్పుడు అప్పట్లో కొన్ని ఒడంబడికలు జరిగాయి. అప్పటి ప్రధానమంత్రి నెహ్రూ హయాంలో ఈ ఒప్పందాలు కుదిరాయి. అయితే ఈ ఒప్పందాలను పాకిస్తాన్ కాల రాయడం ప్రారంభించింది. భారత్లో అంతర్భాగమైన కాశ్మీర్ ను ఆక్రమించడం మొదలుపెట్టింది. ఉగ్రవాద కార్యకలాపాలను పెంచి భారతదేశాన్ని నష్టపరిచింది. తాను కాశ్మీర్ లో కొంత ప్రాంతాన్ని ఆక్రమించి దానికి పిఓకే అని పేరు పెట్టుకుంది. అయితే పాకిస్తాన్ ఆర్థిక పరిస్థితి నానాటికి దిగజారి పోతుండడంతో పిఓకే లో ఉన్న ప్రజలు భారత దేశంలో కలిసి పోతామని గత కొంతకాలం నుంచి డిమాండ్ చేస్తున్నారు. అయితే ఈ ఆందోళనలను పాకిస్తాన్ ప్రభుత్వం అణిచి వేస్తోంది. అయితే ఇటీవల దీనికి సంబంధించిన వివాదాన్ని ఐక్యరాజ్యసమితి దృష్టికి పాకిస్తాన్ తీసుకెళ్ళింది. కాశ్మీర్ ప్రాంతాన్ని ప్రత్యేక దేశంగా ప్రకటించాలని, నెహ్రూ హయంలో కుదిరిన ఒప్పందం ప్రకారం రిఫరెండం నిర్వహించాలని డిమాండ్ చేసింది. దీనికి భారత్ కూడా ఒప్పుకుంది. అయితే భారత్ ఇక్కడ ఒక మెలిక పెట్టింది.
కాశ్మీర్ విషయంలో పాకిస్తాన్ కోరినట్టుగా తాము రెఫరండానికి ఓకే అని.. కాకపోతే కాశ్మీర్ ప్రాంతంలో పాకిస్తాన్ ప్రేరేపిత మూకలు, పాకిస్తాన్ ఆనవాళ్లు ఉండకూడదని డిమాండ్ చేసింది. అప్పుడు ప్రజలు ఏ వైపు ఉంటే ఆ వైపు తాము నిలబడతామని భారత్ ప్రకటించింది. అయితే పాకిస్తాన్ ఐఎస్ఐ కార్యకలాపాలను పీఓకే కేంద్రంగానే సాగిస్తోంది. పైగా ఉగ్రవాద స్థావరాలు కూడా అక్కడ చాలానే ఉన్నాయి. అలాంటప్పుడు ఆ ప్రాంతం నుంచి తన మూలాలను తరలించడం పాకిస్తాన్ కు అంత సులభం కాదు. ఒకవేళ వాటన్నిటిని తొలగిస్తే ఖచ్చితంగా అక్కడి ప్రజలు భారత్ లోనే కలిసి ఉండాలని కోరుకుంటారు. ఇప్పుడు ఆ ప్రాంతం కూడా భారత్లో అంతర్భాగం అవుతుంది. సో ఐక్యరాజ్యసమితిలో పాకిస్తాన్ చేసిన ఒక వ్యాఖ్య ఇప్పుడు పెద్ద దుమారాన్నే లేపింది. దీనిపై ఐక్యరాజ్యసమితి ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాల్సి ఉంది. అయితే పాకిస్తాన్ అటువంటి వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో సరిహద్దుల వెంట భద్రతను భారత్ మరింత కట్టుదిట్టం చేసింది.