Anasuya Bharadwaj: సినిమా ఇండస్ట్రీలో అవకాశాలు రావడమే కష్టం. ఒకవేళ వస్తే వదులుకోవడానికి ఎవరు సిద్దంగా ఉండరు. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ మరో అవకాశం కోసం పాకులాడుతుంటారు. ఒకవేళ స్టార్ హీరోల సినిమాలో వస్తే అవకాశాన్ని వదులుకోవడానికి ఎవరు సిద్దంగా ఉండరు. ఇదే విధంగా అనుకుందట యాంకర్ అనసూయ. ఈమె గురించి తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరం లేదు. జబర్దస్త్ షో ద్వారా ఎంతో గుర్తింపు సంపాదించిన ఈ యాంకర్ సినిమాల్లో నటిస్తూ అందరిని ఆకట్టుకుంటుంది. కొందరు ట్రోల్ చేస్తే కొందరు మాత్రం సపోర్ట్ చేస్తుంటారు.
గతంలో ఈమెకు పవన్ కళ్యాణ్ సినిమాలో నటించే అవకాశం వచ్చిందట. త్రివిక్రమ్, పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో వచ్చిన అత్తారింటికి దారేది సినిమాలో అనసూయకు అవకాశం రావడంతో చాలా సంతోషించిందట. అయితే నటించే అవకాశం కాకుండా డాన్స్ చేసే అవకాశం వచ్చిందట. ఓ స్పెషల్ సాంగ్ కోసం అమ్మడును సంప్రదించారట మేకర్స్. పవన్, ప్రణీత, సమంత పబ్ కి వెళ్లినప్పుడు పవన్ ని చూసిన హంస నందిని మరో హీరోయిన్ స్పెషల్ సాంగ్ చేస్తారు. ఇదే సాంగ్ కోసం అనసూయను సంప్రదించారట మేకర్స్.
మేకర్స్ అనసూయను సంప్రదించినప్పుడు ఆమె గర్భివతి. అయినా సరే పవన్ కళ్యాణ్ కాబట్టి స్టార్ డమ్ కోసం ఒప్పుకోవాలి అనుకుందట. కానీ చివరకు అందరితో కలిసి చేయాలి అని తెలిసాక ఆ ఆఫర్ ను తిరస్కరించిందట అనసూయ. గుంపులో గోవిందం లాగా కాకుండా సింగిల్ గా అయితే బెటర్ అనుకున్న అనసూయ పవన్ కళ్యాణ్ ఆఫర్ ను వదులుకుంది. ప్రెగ్నెంట్ గా ఉన్నా కూడా చీర కవర్ చేసి అయినా నటించాలి అనుకుంది. కానీ అందరిలో ఒకరిలా చేయడం వల్ల పెద్ద ఫేమస్ రాదనుకున్న అను తిరస్కరించింది అని టాక్.