Shakib Al Hasan: ప్రపంచ కప్ లో ప్రతి మ్యాచ్ కూడా కీలకమే అనే విషయం ప్రస్తుతం టీమ్ లు ఆడుతున్న మ్యాచ్ లను బట్టి చూస్తే మనకు అర్థమవుతుంది. ఒక ప్లేయర్ క్రీజ్ లోకి వచ్చిన తర్వాత ఒక్క బాల్ కూడా ఆడకుండా ఔట్ అయిపోయాడు అంటే మనం ఏమనుకోవాలి దానికి ప్రత్యర్థి కెప్టెన్ మద్దతు కూడా కారణం అయిందంటే మనం అర్థం చేసుకోవచ్చు ఆ బ్యాట్స్ మెన్ అంటే ఆ టీమ్ ఎంతలా భయపడుతుందొ అని, ఆ ప్లేయరే శ్రీలంకన్ టీమ్ ఆల్ రౌండర్ అయిన మాథ్యూస్ ఆయన ని ఔట్ చేసిన కెప్టెన్ షకిబుల్ హాసన్…
ఇక మాథ్యూస్ బలహీనతని బలంగా వాడుకొని ఏ మాత్రం స్పిరిట్ ఆఫ్ ది గేమ్ ని చూపించకుండా ఆడిన బంగ్లాదేశ్ కెప్టెన్ షకిబుల్ హాసన్ పైన శ్రీలంక అభిమానులు నెగిటివ్ కామెంట్స్ చేస్తూ విరుచుకు పడుతున్నారు.ఇక ఇది ఇలా ఉంటే బంగ్లాదేశ్ ఆడే చివరి మ్యాచ్ లో షకిబుల్ హాసన్ మ్యాచ్ కి దూరం అవుతున్నాడని బంగ్లాదేశ్ బోర్డు అధికారికంగా ప్రకటించింది.ఇక శ్రీలంక తో ఆడిన లాస్ట్ మ్యాచ్ లో ఆయన చిటికెన వేలికి గాయం తగిలింది దాన్ని స్కానింగ్ చేయిస్తే అది రెండు గా చీలినట్టుగా తెలిసింది. దాంతో అతను టీమ్ ఆడే చివరి మ్యాచ్ కి దూరం కాబోతున్నడని బంగ్లాదేశ్ బోర్డ్ తెలియజేసింది.
అయితే ఇదంతా తెలిసిన శ్రీలంక అభిమానులు మాత్రం బంగ్లాదేశ్ కెప్టెన్ కి మాథ్యూస్ శాపం తగిలిందని అందువల్లే అతను చివరి మ్యాచ్ కి దూరమవుతున్నాడు అంటూ పలు రకాల కామెంట్లను చేస్తున్నారు. నిజానికి బంగ్లాదేశ్ కెప్టెన్ అయిన షకిబుల్ హాసన్ మాథ్యూస్ విషయం లో అలా వ్యవహరించి ఉండకూడదు అంటూ చాలా మంది దిగ్గజ ప్లేయర్లు సైతం వాళ్ల అభిప్రాయాలు తెలియజేశారు. ఇక అందులో భాగంగానే ఇప్పుడు షకిబుల్ హసన్ టీంకు దూరమవడంతో ప్రపంచం మొత్తం షకిబుల్ హసన్ మీద నెగెటివిటీ స్ప్రెడ్ అయింది. కాబట్టి బంగ్లాదేశ్ టీం అతన్ని పక్కన పెట్టినట్లు గా తెలుస్తుంది. అతను కనిపించకుండా ఉంటే ఇంతవరకు స్ప్రెడ్ అయిన నెగిటివిటీ తగ్గుతుందని బంగ్లాదేశ్ బోర్డు భావించినట్టుగా తెలుస్తుంది. ఇక అందులో భాగంగానే అతనికి గాయమైనట్టుగా ఒక హై డ్రామా సృష్టించి అతనిని టీం లో నుంచి పక్కన పెట్టినట్టుగా మరి కొంతమంది అభిప్రాయపడుతున్నారు.
ఏది ఏమైనా మాథ్యూస్ లాంటి ఒక మంచి ప్లేయర్ ని టైమ్డ్ ఔట్ కింద ఔట్ చేయడం శ్రీలంక అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. దాని ఎఫక్ట్ వల్లే షకిబుల్ కూడా మ్యాచ్ కి దూరం అవుతున్నాడు అంటూ సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు…ఆ మ్యాచ్ అనంతరం మాథ్యూస్ కూడా తను ఔట్ అయిన విషయం మీద మాట్లాడుతూ ఇంత చండాలమైన టీంని నేను ఎప్పుడూ చూడలేదు అని ఆ టీమ్ మీద నెగిటివ్ గా వ్యాఖ్యలు చేయడం జరిగింది… ఇక ఇప్పటికే బంగ్లాదేశ్ టీం శ్రీలంక టీం రెండు కూడా వరల్డ్ కప్ టోర్నీ నుంచి ఎలిమినేట్ అయ్యాయి…