Homeఎంటర్టైన్మెంట్Kaushal Bigg Boss winner: బిగ్ బాస్ తర్వాత నా జీవితం అలా అయ్యింది... టైటిల్...

Kaushal Bigg Boss winner: బిగ్ బాస్ తర్వాత నా జీవితం అలా అయ్యింది… టైటిల్ విన్నర్ కౌశల్ బయటపెట్టిన చేదు నిజాలు

Kaushal Bigg Boss winner: బిగ్ బాస్ టైటిల్ గెలవడంతో తన జీవితం మారిపోతుందని నటుడు కౌశల్ భావించాడట. కానీ అందుకు భిన్నమైన పరిస్థితులు చోటు చేసుకున్నాయట. తనకు ఎదురైన చేదు అనుభవాలు పంచుకున్నాడు కౌశల్..

Also Read:  తండ్రిని మోసం చేసిన కుటుంబ సభ్యులు.. అనసూయ ఆవేదన.. అసలేం జరిగింది?

బిగ్ బాస్(BIGG BOSS) మోస్ట్ పాప్యులర్ రియాలిటీ షో. ఓవర్ నైట్ స్టార్డం తెచ్చిపెట్టగలదు. అలాగే లక్షల్లో సంపాదించవచ్చు. బిగ్ బాస్ షోకి వెళ్లాలని చాలా మంది కోరుకుంటారు. అయితే సెలెబ్స్ కి సులభంగా అవకాశం దక్కుతుంది. అయితే టైటిల్ కొట్టడం అంత ఈజీ కాదు. బిగ్ బాస్ పెట్టే కఠిన పరీక్షలు ఎదుర్కోవాలి. బిగ్ బాస్ ఇచ్చే టాస్క్ లలో కంటెస్ట్స్ తీసుకునే నిర్ణయాల ఆధారంగా ప్రేక్షకులు వారికి కనెక్ట్ అవుతారు. ఈ క్రమంలో కొందరికి నెగిటివ్ ఇమేజ్, మరికొందరికి పాజిటివ్ ఇమేజ్ ఏర్పడుతుంది.

ప్రతి కంటెస్ట్ ప్రేక్షకుల వ్యతిరేకత చవిచూడాల్సిందే. అయితే మెజారిటీ ఆడియన్స్ మెచ్చిన కంటెస్టెంట్ విన్నర్ అవుతాడు. సీజన్ 7లో సామాన్యుడిగా హౌస్లోకి వెళ్లిన పల్లవి ప్రశాంత్ టైటిల్ విన్నర్ అయ్యాడు. ఇది అనూహ్య పరిణామం కాగా, బిగ్ బాస్ షోలో ఏదైనా జరగొచ్చు అనడానికి నిదర్శనం. బిగ్ బాస్ టైటిల్ కొడితే జీవితం మారిపోతుంది. వండర్స్ జరుగుతాయి అనుకుంటే పొరపాటే. బిగ్ బాస్ తెలుగు టైటిల్స్ కొట్టిన శివబాలాజీ, కౌశల్, అభిజీత్, రేవంత్, సన్నీ, నిఖిల్ ల కెరీర్స్ ఏమంత ఆశాజనకంగా లేవు.

ఇదే విషయాన్ని కౌశల్ వెల్లడించారు. బిగ్ బాస్ సీజన్ 2 టైటిల్ కొట్టిన కౌశల్(KAUSHAL) హౌస్లో అద్భుతమైన ఆట కనబరిచాడు. కౌశల్ ఎవరితో స్నేహం చేసేవాడు కాదు. ఎమోషన్స్ కి రిలేషన్స్ కి దూరంగా ఉంటూ.. గేమ్ ని గేమ్ లా ఆడాడు. కౌశల్ ఆట తీరు భారీగా అభిమానులను తెచ్చిపెట్టింది. కౌశల్ ఆర్మీ పేరుతో సోషల్ మీడియాలో ఓ ట్రెండ్ నడిచింది. సింగర్ గీతా మాధురితో పోటీపడి కౌశల్ టైటిల్ అందుకున్నాడు. ఇక బిగ్ బాస్ ప్రైజ్ మనీని క్యాన్సర్ బాధితులకు ఇస్తానంటూ ప్రకటించాడు.

Also Read: రామ్ ప్రసాద్ కి సుధీర్, శ్రీను చేసిన ద్రోహం, గుండెబద్దలైంది అంటూ జబర్దస్త్ కమెడియన్ ఆవేదన!

బిగ్ బాస్ షోతో వచ్చిన పాపులారిటీతో కౌశల్ హీరోగా బిజీ అవుతాడని భావించాడట. నాని నన్ను ఎంతో ప్రోత్సహించారు. ఆయన ఎంకరేజ్మెంట్ చూశాక జీవితం మారిపోతుంది అనుకున్నాడట. అయితే తనకు సినిమా ఆఫర్ చేస్తూ ఒక్క ఫోన్ కాల్ రాలేదట. కొందరు దర్శకులను నేరుగా కలిసి అవకాశం అడిగినా ఫలితం లేకుండా పోయిందట. పూరి, వివి వినాయక్ వంటి పెద్ద దర్శకులు తనను గౌరవించారని, అవకాశాలు మాత్రం రాలేదని ఆవేదన చెందారు. కౌశల్ పలు చిత్రాల్లో విలన్, సపోర్టింగ్ రోల్స్ చేశాడు. ఇటీవల విడుదలైన కన్నప్పలో కౌశల్ ఓ పాత్రలో కనిపించారు.

Exit mobile version