Anasuya Bharadwaj: అనసూయ అంటే పెద్దగా పరిచయం అవసరం లేదు. జబర్దస్త్ యాంకర్ గానే కాకుండా అటు సినిమాల కెరీర్ పరంగా బాగానే సక్సెస్ సాధించిన ఈ బ్యూటీ.. సినిమాల్లో చాలా కీలకమైన పాత్రల్లో నటిస్తూ ఫుల్ బిజీగా ఉంటోంది. పుష్ప లాంటి పాన్ ఇండియా సినిమాలో దాక్షాయణి పాత్ర ఆమెకు బాగా గుర్తింపు తెచ్చింది. ఇక మొన్న ఖిలాడీ మూవీలో కూడా ఆమె గుర్తుండిపోయే పాత్రను చేసింది.

ఇంకొన్ని సినిమాల్లో ఆమెకు కొంచెం ఏజ్ ఎక్కకు ఉన్న పాత్రలు వస్తున్నా కూడా అవి తన వయసుకు తగ్గ పాత్రలు కాదని చేయట్లేదంట. కానీ ఇటు బుల్లితెరపై మాత్రం చాలానే ఆఫర్లు వస్తున్నాయని తెలుస్తోంది. కానీ బుల్లితెరపై కంటే కూడా.. వెండితెరపైనే తన ఫోకస్ పెట్టింది ఈ హాట్ బ్యూటీ. ఇదిలా ఉండగా.. ఇప్పుడు ఈమెపై నెటిజన్లు చాలా సీరియస్ అవుతున్నారు.
Also Read: టుడే వైరల్ అవుతున్న క్రేజీ అప్ డేట్స్
గతంలో కూడా అనసూయ ఇలాగే ట్రోలింగ్‌కు గురయింది. ఏదో ఒక విషయంలో వివాదాస్పద కామెంట్లు చేయడం, చివరకు విమర్శల పాలు కావడం ఆమెకు సర్వ సాధారణం అయిపోయింది. ఇక ఈ రోజు మహిళా దినోత్సవం సందర్భంగా మీమ్ పేజీలు, ట్రోలర్స్ పేజీలు అన్నీ కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అంటూ పోస్టులు పెట్టాయి.

అయితే ఈ పోస్టులపై అనసూయ స్పందించింది. ఈ మీమ్, ట్రోలర్స్ పేజీలకు గౌరవించడం ఈ ఒక్క రోజు సాధ్యం అవుతుందని, వీరు సడెన్ గా ఇలా మహిళలను పూజించే రోజు ఇదేనని సెటైర్లు వేసింది. అయితే ఈ రోజు 24గంటల్లో గడిచిపోతుందని, కాబట్టి మహిళలను పక్కన పెడితే.. మిగతా వారందరికీ ఫూల్స్ డే అంటూ ట్వీట్ చేసింది. ఇక మరో ట్వీట్ లో గుమ్మడి కాయ దొంగలు ఎవరో తెలియాలంటే తన ట్వీట్ కింద కామెంట్లు పెట్టే వారే అంటూ రాసుకొచ్చింది. అంటే తన ట్వీట్‌కు ఎవరైతే రిప్లై ఇస్తారో వారే మహిళలను ట్రోల్ చేసే వారన్నట్టు చెప్పుకొచ్చింది. ఇంకేముంది ఈ ట్వీట్ పై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. ఇక ట్రోలర్స్ అయితే దొరికిందే ఛాన్స్ అన్నట్టు మళ్లీ ఆమెను ట్రోల్ చేయడం స్టార్ట్ చేస్తున్నారు.
Also Read: ట్రోలర్స్ కి షాకిచ్చేలా ట్వీట్ చేసిన అనసూయ