Anasuya Bharadwaj : పేరుకు క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయినా గ్లామర్ లో మాత్రం అనసూయది హీరోయిన్స్ రేంజ్. బుల్లితెర యాంకరింగ్ లో ట్రెండ్ సెట్టర్. అనసూయ రాకముందు తెలుగు యాంకర్స్ స్కిన్ షో చేయడం అనేది లేదు. జబర్దస్త్ షోతో ఆ సాంప్రదాయం మొదలుపెట్టింది. అనసూయ స్ఫూర్తితో పరిశ్రమకు వచ్చిన రష్మీ గౌతమ్, శ్రీముఖి, వర్షిణి, దీపికా పిల్లి, విష్ణుప్రియ లాంటి వారు కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం అనసూయ యాంకరింగ్ కి దూరంగా ఉంటుంది. అందుకు ఆమె కొన్ని కారణాలు చెప్పారు.
బుల్లితెర షోలలో టీఆర్పీ స్టంట్స్ ఎక్కువైపోయాయి. జబర్దస్త్ కమెడియన్స్ కొందరు బాడీ షేమింగ్ కి పాల్పడ్డారు. అవేమీ షోలో చూపించరు, అన్నారు. అలాగే తాను యాంకర్ గా నవ్విస్తూ, వెండితెర మీద సీరియస్ రోల్స్ చేస్తుంటే ఆడియన్స్ తికమక పడుతున్నారు. తనను ఒక యాంకర్ గానే చూస్తున్నారు. నేను బుల్లితెర వదిలేయడానికి ఇది కూడా కారణమని చెప్పుకొచ్చింది.
ఈ ఏడాది అనసూయ పలు చిత్రాల్లో భిన్నమైన పాత్రలు చేసింది. దర్శకుడు కృష్ణవంశీ తెరకెక్కించిన రంగమార్తాండ మూవీలో మోడరన్ కోడలు రోల్ లో అదరగొట్టింది. ఇక విమానం చిత్రంలో వేశ్యగా నటించి మైండ్ బ్లాక్ చేసింది. ఇలాంటి సాహసోపేత పాత్రలు చేసేందుకు నటులు ముందుకు రారు. బోల్డ్ అనసూయ ఐ డోంట్ కేర్ అంటూ చేసేశారు. విమానంలో అనసూయ పాత్రకు ప్రశంసలు దక్కాయి. అలాగే పెదకాపు 1లో కీలక రోల్ చేసింది. ఈ మూవీ నిరాశపరిచింది.
అనసూయ కీలక రోల్ చేసిన ప్రేమ విమానం ఇటీవల విడుదలైంది. ప్రేమ విమానంలో మరో విలక్షణ రోల్ ఆమె చేశారు. ప్రస్తుతం అనసూయ పుష్ప 2లో నటిస్తుంది. అనసూయ కెరీర్ పీక్స్ లో ఉంది. అదే సమయంలో సోషల్ మీడియా వేదికగా గ్లామర్ ట్రీట్ ఇస్తుంది. బుల్లితెర మీద అందాల విందు మిస్ అవుతున్న ఫ్యాన్స్ కి ఇంస్టాగ్రామ్ ద్వారా ఆ లోటు తీరుస్తుంది. తాజాగా చీరలో మెస్మరైజ్ చేసింది అనసూయ. ఆమె గ్లామరస్ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.