Anasuya: ‘నా కలల రాణి చేయి తాకిందిరోయ్’​.. అనసూయ అభిమాని సంబరం చూడండి

Anasuya: ఓ వైపు బుల్లితెరపై యాంకరింగ్​తో సందడి చేస్తూనే.. మరోవైపు సినిమాల్లో విభిన్న పాత్రలు పోషిస్తూ.. తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది అనసూయ.  తన నటనతో స్టార్ హీరోయిన్​ రేంజ్​లో ఫాలోయింగ్​ను సంపాదించుకుంది. ఇటీవలే పుష్ప సినిమాలో దాక్షాయణిగా కనిపించిన అనసూయ.. తన నటనతో అందర్నీ మత్రముగ్దుల్ని చేసింది. కాగా, తాజాగా, ఖమ్మంలో ఓ షాపింగ్ మాల్ ఓపెనింగ్​కు అనసూయ వెళ్లగా.. ఆమెను చూసేందుకు అభిమానులు పెద్దసంఖ్యలో వచ్చారు. ఆమెతో సెల్ఫీ దిగి ఒక్ షేక్ హ్యాండ్​ […]

Written By: Raghava Rao Gara, Updated On : December 27, 2021 12:23 pm
Follow us on

Anasuya: ఓ వైపు బుల్లితెరపై యాంకరింగ్​తో సందడి చేస్తూనే.. మరోవైపు సినిమాల్లో విభిన్న పాత్రలు పోషిస్తూ.. తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది అనసూయ.  తన నటనతో స్టార్ హీరోయిన్​ రేంజ్​లో ఫాలోయింగ్​ను సంపాదించుకుంది. ఇటీవలే పుష్ప సినిమాలో దాక్షాయణిగా కనిపించిన అనసూయ.. తన నటనతో అందర్నీ మత్రముగ్దుల్ని చేసింది. కాగా, తాజాగా, ఖమ్మంలో ఓ షాపింగ్ మాల్ ఓపెనింగ్​కు అనసూయ వెళ్లగా.. ఆమెను చూసేందుకు అభిమానులు పెద్దసంఖ్యలో వచ్చారు. ఆమెతో సెల్ఫీ దిగి ఒక్ షేక్ హ్యాండ్​ ఇప్పించుకునేందుకు అభిమానులు పోటీ పడ్డారు. ఈ క్రమంలోనే పోలీసులు రంగం లోకి దిగి మరి గుంపును అదుపు చేయాల్సి వచ్చింది.

కాగా, తనకోసం అంతలా వచ్చిన అభిమానులను చూసిన అను షాకై.. వారిని నిరాశపరచకూడదని కొందరికి సెల్పీలు ఇచ్చింది. ఈ క్రమంలోనే అనసూయ చేయి తాకిందని మురిసిపోయిన ఓ అభిమాని.. సంబరాలు చేసుకుంటూ.. ఇన్​స్టాలో పోస్ట్ చేశాడు. తన కలల రాణి చేతిని తాకానని సోషల్​ మీడియాలో ఫొటో పోస్ట్ చేశాడు. ఈ విషయంపై అనసూయం స్పందిస్తూ.. అయ్యో శానిటైజ్​ చేసుకోండి అంటూ సరదాగా అభిమానిని ఆటపట్టించింది.

కాగా, గతంలో రంగస్థలంలో రంగమ్మత్తగా అలరించిన అనసూయ.. ఆ సినిమాతో మంచి ఫామ్​లోకి వచ్చింది. అప్పటి నుంచి విభిన్న పాత్రల్లో పోషించేందుకు ఎక్కువ మక్కువ చూపిస్తున్నట్లు కనిపిస్తోంది. ఇటీవలే పుష్పలో కూడా ఆ తరహా పాత్రలోనే కనిపించడం విశేషం. ఈ రెండు సినిమాలకు సుకుమార్​ దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే.