Anasuya Before Anchoring: హీరోయిన్ రేంజ్ ఫేమ్ ఎంజాయ్ చేస్తున్న అనసూయ భరద్వాజ్ సంపాదన కోట్లలో ఉంటుందని సమాచారం. ఖరీదైన కార్లు, విలాసవంతమైన బంగ్లాలు ఆమె సొంతం. అయితే అనసూయ ఒకప్పటి జీవితం వేరు. వాళ్లకు వెట్టి చాకిరి చేయాల్సి వచ్చిందని ఆమె స్వయంగా వెల్లడించారు.
అనసూయ భరద్వాజ్(ANASUYA BHARADWAJ) జీవితాన్ని జబర్దస్త్ మార్చేసింది. జబర్దస్త్ కి ముందు ఆమె కొన్ని షోలు చేశారట. కానీ అవేమీ ఫేమ్ తేలేదు. జబర్దస్త్ షో బ్లాక్ బస్టర్ కావడంతో అనసూయ సైతం స్టార్డం రాబట్టింది. అనసూయ గ్లామర్ షో చేయడం కూడా ఆమెకు కలిసొచ్చింది. తెలుగు లేడీ యాంకర్స్ పొట్టి బట్టలు ధరించడం, మన ప్రేక్షకులకు పరిచయం లేని వ్యవహారం. ప్రతివారం అనసూయ గ్లామర్ ఎంజాయ్ చేయడానికే షో చూసే ఆడియన్స్ కూడా ఉండేవారు. నటి కావాలన్న ఆమె కోరిక కూడా జబర్దస్త్ తో నెరవేరింది.
Also Read: ఒక్క సీన్ చెప్పి స్పిరిట్ సినిమాలో ప్రభాస్ బిహేవియర్ ఎలా ఉంటుందో చెప్పేశాడుగా..?
జబర్దస్త్ తర్వాత అనసూయ స్టార్ యాంకర్ హోదా రాబట్టింది. దాంతో ఆమెకు సినిమా ఆఫర్స్ వెల్లువెత్తాయి. సోగ్గాడే చిన్ని నాయనా చిత్రంలో చిన్న గెస్ట్ రోల్ చేసిన అనసూయకు, క్షణం రూపంలో కీలక పాత్ర దక్కింది. ఆ చిత్రంలో ఆమె మెయిన్ విలన్ రోల్ చేసింది. రంగస్థలం, యాత్ర, పుష్ప, పుష్ప 2, విమానం, పెదకాపు చిత్రాలు అనసూయను నటిగా నిలబెట్టాయి. స్పెషల్ సాంగ్స్ సైతం చేసిన అనసూయ… విమానం మూవీలో వేశ్య పాత్ర చేయడం కొసమెరుపు. అనసూయ గట్స్ కి విమానం మూవీ ఒక నిదర్శనం.
చేతినిండా సినిమాలు, ప్రమోషన్స్, షోలతో అనసూయ సంపాదన నెలకు కోట్లలోకి చేరింది. ఇటీవలే ఆమె ఖరీదైన ఇంటిని నిర్మించుకుంది. గృహప్రవేశం చేసి, సదరు ఫోటోలు ఫ్యాన్స్ తో పంచుకుంది. ఎంత తీరిక లేకున్నా కుటుంబానికి సమయాన్ని కేటాయిస్తుంది అనసూయ. తరచుగా ఫ్యామిలీతో వెకేషన్స్ కి వెళుతుంది. అయితే అనసూయ ఒకప్పటి జీవితం వేరు. ఎంబీఏ చదివిన అనసూయ… పరిశ్రమకు రాక ముందు ఓ విఎఫ్ఎక్స్ కంపెనీలో జాబ్ చేసిందట. వారు అనసూయతో వెట్టి చాకిరి చేయించేవారట.
Also Read: ఏఎన్నార్ కి పిల్లను ఇవ్వడానికి ఎవరూ ఇష్టపడలేదా? కారణం తెలిస్తే షాక్ అవుతారు?
ఆ సంస్థలో పని చేసేటప్పుడే సుకుమార్, త్రివిక్రమ్, మెహర్ రమేష్ వంటి దర్శకులు పరిచయం అయ్యారట. కంత్రి సినిమాలోని ఎన్టీఆర్ యానిమేటెడ్ అవతార్ ని అక్కడే రూపొందించారట. లైఫ్ ఆఫ్ పై, లార్డ్ ఆఫ్ ది రింగ్స్ వంటి బడా హాలీవుడ్ చిత్రాలకు కూడా సదరు సంస్థ పని చేసినట్లు అనసూయ చెప్పుకొచ్చింది. ఇక జబర్దస్త్ కి రాకముందే అనసూయకు వివాహమైంది. బీహార్ కి చెందిన సుశాంక్ భరద్వాజ్ ని ప్రేమించి పెళ్లి చేసుకుంది. అనసూయకు ఇద్దరు అబ్బాయిలు సంతానం. ఇటీవల బుల్లితెరకు రీఎంట్రీ ఇచ్చిన అనసూయ… పలు షోలలో సందడి చేస్తుంది.