OTT Round Up: ఈ వారం  ‘ఓటీటీ’  చిత్రాల పరిస్థితేంటి ? 

OTT Round Up:  ప్రస్తుతం తెలుగు బాక్సాఫీస్ కి ‘అఖండ’తో ఊపు వచ్చినా,    ఏపీలో జగన్ దెబ్బకు   వచ్చిన ఆ ఊపు కరిగిపోయింది.  ఇప్పుడు మళ్ళీ అందరికీ కనిపిస్తున్న ఆశా కిరణం  ఓటీటీ.  అవును,  ఈ  కరోనా   క్లిష్ట స‌మ‌యంలో  ప్రేక్షకులను అలరించింది ఒక్క ఓటీటీ మాత్రమే.  నష్టాల్లో నలిగిపోతున్న నిర్మాతలకు లాభలను తెచ్చి పెట్టింది  ఓటీటీ  సంస్థలు మాత్రమే.     కరోనా కోరల్లో పడి నలిగిపోతున్న సినిమా  జీవితాల్లో వెలుగులు నింపిన ఏకైక మాధ్యమం ఒక్క ఓటీటీ మాత్రమే.  ఆ  […]

Written By: Shiva, Updated On : December 27, 2021 12:31 pm

OTT Releases of the Week

Follow us on

OTT Round Up:  ప్రస్తుతం తెలుగు బాక్సాఫీస్ కి ‘అఖండ’తో ఊపు వచ్చినా,    ఏపీలో జగన్ దెబ్బకు   వచ్చిన ఆ ఊపు కరిగిపోయింది.  ఇప్పుడు మళ్ళీ అందరికీ కనిపిస్తున్న ఆశా కిరణం  ఓటీటీ.  అవును,  ఈ  కరోనా   క్లిష్ట స‌మ‌యంలో  ప్రేక్షకులను అలరించింది ఒక్క ఓటీటీ మాత్రమే.  నష్టాల్లో నలిగిపోతున్న నిర్మాతలకు లాభలను తెచ్చి పెట్టింది  ఓటీటీ  సంస్థలు మాత్రమే.  

OTT Round Up:

 
కరోనా కోరల్లో పడి నలిగిపోతున్న సినిమా  జీవితాల్లో వెలుగులు నింపిన ఏకైక మాధ్యమం ఒక్క ఓటీటీ మాత్రమే.  ఆ  ఘనత ఓటీటీలకే దక్కుతుంది.  పైగా   ఓటీటీ సంస్థలు మాత్రమే  నేటి జనరేషన్ అభిరుచులకు తగ్గట్టు, కొత్త కంటెంట్ తో  అప్ డేట్ అవుతూ  వస్తున్నాయి.   ట్రెండింగ్ కంటెంట్ తో  ప్రేక్షకులను అలరిసుస్తూ  వస్తున్నాయి. 

Also Read:<RRR: ఆర్ఆర్ఆర్’ బడ్జెట్.. హీరోల రెమ్యూనరేషన్స్ ఎంతో తెలుసా!

 
కాగా  ఈ  కరోనా సెకెండ్ వేవ్ తగ్గిన  తర్వాత   థియేట‌ర్ల ద‌గ్గ‌ర కొన్ని సినిమాలు  సంద‌డి చేశాయి.  కానీ ఏపీలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు రీత్యా    ఓటీటీలోనే రిలీజ్ కావడానికి మరి కొన్ని సినిమాలు సిరీస్ లు  రెడీ అయ్యాయి. ఈ క్రమంలోనే   ప్రతి ఓటీటీ ప్లాట్  ఫామ్  ప్రతి వారం కొత్త కంటెంట్ వస్తోంది.  
 
 
మరి ఈ వారం ఓటీటీలో రిలీజవుతున్న చిత్రాలు, వెబ్‌ సిరీస్‌ల పై ఓ లుక్కేద్దాం. ఈ కింద పట్టికను గమనించగలరు.
 
ఈ వారం  ఓటీటీలో   రిలీజవుతున్న చిత్రాలు, వెబ్‌ సిరీస్‌ లు ఇవే.   

 




నెట్‌ఫ్లిక్స్‌  :  

క్యూర్‌ ఐ: సీజన్‌-6- డిసెంబరు 31 వ  తేదీ నుంచి స్ట్రీమింగ్‌  కాబోతుంది.

కోబ్రా కాయ్‌(సీజన్‌-4) -డిసెంబరు 31 వ  తేదీ నుంచి స్ట్రీమింగ్‌  కాబోతుంది.

ది లాస్ట్‌ డాటర్‌- డిసెంబరు 31 వ  తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కాబోతుంది.


ది పొస్సెసన్‌ ఆఫ్‌ హన్నా గ్రేస్‌- డిసెంబరు 27 వ  తేదీ నుంచి స్ట్రీమింగ్‌ 
 కాబోతుంది.

చోటా బీమ్‌: ఎస్‌14 -డిసెంబరు 28 వ  తేదీ నుంచి స్ట్రీమింగ్‌  కాబోతుంది.

క్రైమ్‌ సీన్‌: ది టైమ్స్‌ స్వ్కేర్‌ కిల్లర్‌ – డిసెంబరు 29 వ  తేదీ నుంచి స్ట్రీమింగ్‌  కాబోతుంది.  

 

 
  అమెజాన్‌ ప్రైమ్‌  :  

 

లేడీ ఆఫ్‌ మేనర్‌- డిసెంబరు 31 వ  తేదీ నుంచి స్ట్రీమింగ్‌  కాబోతుంది.

టైమ్‌ ఈజ్‌ అప్‌ -డిసెంబరు 31 వ  తేదీ నుంచి స్ట్రీమింగ్‌  కాబోతుంది.

 

  
డిస్నీ+ హాట్‌స్టార్‌   :  

 

కేషు కీ వేదాంత్‌ నదానీ -డిసెంబరు 31 వ  తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కాబోతుంది.  

 
 
 ఆహా   : 
సీనియర్ హాస్య కథానాయకుడు   రాజేంద్ర ప్రసాద్‌ హీరోగా  వస్తోన్న సినిమా  ‘సేనాపతి’.   పవన్‌ సాధినేని దర్శకత్వం వహించిన ఈ సినిమా   ఓటీటీ ‘ఆహా’లో  డిసెంబరు 31న స్ట్రీమింగ్‌ కానుంది.   రాజేంద్ర ప్రసాద్‌ ఇప్పటి వరకూ కనిపించని విభిన్న గెటప్ లో ఈ చిత్రంలో కనిపిస్తాడట.  సినిమా కూడా  ఆద్యంతం ఉత్కంఠభరితంగా  సాగుతుందట. 
Tags