Ananya Panday: యూత్ ఆడియన్స్ లో మంచి క్రేజ్ ఉన్న యంగ్ హీరోయిన్స్ లో ఒకరు అనన్య పాండే. ఈమె మన తెలుగు ఆడియన్స్ కి విజయ్ దేవర కొండా ఫ్లాప్ చిత్రం ‘లైగర్’ ద్వారా పరిచయమైంది. ఆ సినిమా సినిమా కమర్షియల్ గా పెద్ద డిజాస్టర్ ఫ్లాప్ అయినప్పటికీ అనన్య పాండే మాత్రం ఆడియన్స్ ని ప్రత్యేకంగా ఆకర్షించింది. ముఖ్యంగా ఆ క్యూట్ అందానికి ఫిదా అయిపోయారు. అయితే ‘లైగర్’ తర్వాత ఈ హాట్ బ్యూటీ తెలుగు లో ఎలాంటి సినిమాలు చేయలేదు కానీ, హిందీ లో మాత్రం వరుసగా వెబ్ సిరీస్లు, ఓటీటీ కంటెంట్ పైనే ఎక్కువ ద్రుష్టి పెట్టింది. కానీ మెయిన్ స్ట్రీమ్ సినిమాలను ఆమె పెద్దగా పట్టించుకోలేదు. ఈ విషయంలో ఆమె అభిమానులు కాస్త అసంతృప్తిగా ఉన్నారు. అంతే కాకుండా రాకరాక వచ్చిన ఒక బంగారం లాంటి సినిమాని ఈమె ఒక యంగ్ హీరో కోసం వదిలేసుకుందట, ఇదే ఇప్పుడు బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారిన అంశం.
బాలీవుడ్ లో లవ్ స్టోరీస్ తీయాలంటే ఇంతియాజ్ అలీ తర్వాతే ఎవరైనా. బాలీవుడ్ లో ఎన్నో క్లాసికల్ లవ్ స్టోరీస్ ని తెరకెక్కించాడు. అవి కమర్షియల్ గా కూడా సెన్సేషన్ సృష్టించాయి. ఇప్పటికీ ఆ సినిమాలను చూస్తే ఫ్రెష్ లవ్ స్టోరీ ని చూసిన ఫీలింగ్ కలుగుతుంది. అంతటి చక్కటి కథ, స్క్రీన్ ప్లే తో ఆయన సినిమాలు తీస్తాడు. యంగ్ హీరోలకు ఆయనతో కలిసి పనిచేయడం ఒక కల. అలాంటి డైరెక్టర్ త్వరలో తాను తీయబోతున్న పీరియాడిక్ లవ్ స్టోరీ లో హీరోయిన్ రోల్ కోసం అనన్య పాండే ని సంప్రదించాడు. సరైన హిట్ లేకుండా ఇబ్బంది పడుతున్న అనన్య పాండే స్థాయిలో ఏ హీరోయిన్ ఉన్నా, ఈ అవకాశాన్ని కళ్ళకు అద్దుకొని మరీ తీసుకుంటారు. కానీ ఆమె మాత్రం వదిలేసుకుంది.
కారణం ఆమె కార్తీక్ ఆర్యన్ అనే బాలీవుడ్ యంగ్ హీరో సినిమాకి కమిట్ అవ్వడం వల్లే. ఈ సినిమాతో పాటు పలు వెబ్ సిరీస్ షూటింగ్స్ కూడా సమాంతరం గా చేస్తుందట. అందుకే డేట్స్ సర్దుబాటు చేయలేక ఆమె ఈ క్రేజీ ఆఫర్ ని రిజెక్ట్ చేసినట్టు తెలుస్తుంది. ఇంతియాజ్ అలీ చిత్రం సరిగ్గా క్లిక్ అయితే బాలీవుడ్ నుండి వెయ్యి కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను కొల్లగొట్టగలదు. అలాంటి క్రేజీ మూవీ వదులుకోవడం అంటే మామూలు విషయం కాదు. అయితే సినీ ఇండస్ట్రీ అన్న తర్వాత ఇలాంటివి జరగడం సర్వసాధారణమే. ఇప్పుడు ఆమె కార్తీక్ ఆర్యన్ తో చేస్తున్న సినిమానే పెద్ద సూపర్ హిట్ అయ్యి, ఇంతియాజ్ అలీ సినిమా ఫ్లాప్ అవ్వోచ్చేమో, ఎవరు చెప్పగలరు?.. చూసేందుకు ఎంతో అందంగా కనిపించే ఈ అమ్మాయి, మొదట్లో నటన పరంగా చాలా వీక్ గా ఉండేది. కానీ ఇప్పుడు బాగా మెరుగుపడింది. భవిష్యత్తులో ఆమె కెరీర్ ఎలా ఉండబోతుందో చూడాలి.