OG Trailer: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా వస్తున్న ఓజీ సినిమా ఈనెల 25వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. మరి ఈ సినిమాతో తనకంటూ ప్రత్యేకమైన ఐడెంటిటి క్రియేట్ చేసుకోవాలనుకుంటున్న పవన్ కళ్యాణ్ తన అభిమానులకు ఒక హై వోల్టేజ్ సినిమా అయితే ఇవ్వబోతున్నాడు అనే వార్తలైతే వస్తున్నాయి. ఇక ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ ని ఈనెల 21వ తేదీన ఉదయం 10:08 నిమిషాలకు రిలీజ్ చేస్తున్నామంటూ మేకర్స్ అయితే అనౌన్స్ చేశారు. అయితే ఈ ట్రైలర్లో పవన్ కళ్యాణ్ తో పాటు గా మరో ఇద్దరు నటులను హైలెట్ చేసి చూపించబోతున్నారట. అందులో ఒకరు అర్జున్ దాస్ కాగా, మరొకరు ఇమ్రాన్ హష్మీ…
వీళ్లిద్దరూ క్యారెక్టర్ ను పరిచయం చేస్తూ వీళ్లిద్దరికి మధ్య ఉన్న సంబంధం ఏంటి? అనేది కూడా ట్రైలర్ రివిల్ చేయబోతున్నారు. అలాగే వీళ్ళిద్దరికీ పవన్ కళ్యాణ్ కి మధ్య ఉన్న సంబంధాన్ని కూడా చాలా డిటెయిలింగ్ గా ఎక్స్ప్లెయిన్ చేసి సినిమా రిలీజ్ కి ముందే సినిమా వరల్డ్ ని ప్రేక్షకులకు పరిచయం చేయాలనే ప్రయత్నం అయితే చేస్తున్నట్టుగా తెలుస్తోంది.
మరి సుజీత్ లాంటి దర్శకుడు ఇప్పటివరకు చేసినవి చాలా తక్కువ సినిమాలే అయినప్పటికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ను చాలా బాగా హ్యాండిల్ చేసినట్టుగా సినిమా యూనిట్ నుంచి కొన్ని వార్తలైతే బయటకు వస్తున్నాయి. ఇక సుజీత్ కొన్ని స్ట్రాటజీలను మెయింటైన్ చేస్తూ ముందే సినిమాలో ఉన్న క్యారెక్టర్స్ ను ముందే ఎస్టాబ్లిష్ చేస్తే ప్రేక్షకుడు ఆ క్యారెక్టర్ లోకి ఇన్వాల్వ్ అయిపోయే అవకాశాలు ఉంటాయి.
కాబట్టి ట్రైలర్లో వాళ్ళని హైలెట్ చేసి చూపించాలని సుజిత్ ఒక ప్రణాళికనైతే రూపొందించినట్టుగా తెలుస్తోంది. మరి ఇప్పటివరకు పవన్ కళ్యాణ్ సినిమాలకు ఉన్న క్రేజ్ వేరు ఈ సినిమాతో పవన్ కళ్యాణ్ కి రాబోతున్న క్రేజ్ మరో రేంజ్ లో ఉండబోతుందనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి…చూడాలి మరి ఈ సినిమా రిలీజ్ తర్వాత పాన్ ఇండియాలో పవన్ కళ్యాణ్ క్రేజ్ ఏ రేంజ్ లో ఉంటుంది… తద్వారా ఆయన అభిమానులు ఖుషీ అవుతారా లేదా అనేది…