WASHI YO WASHI OG Glimps: పవన్ కళ్యాణ్ మోస్ట్ క్రేజీ చిత్రం ‘ఓజీ’ మరో ఆరు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సందర్భంగా ఈ సినిమా నుండి కాసేపటి క్రితమే ఒక బ్లాస్టింగ్ వీడియో ని విడుదల చేసింది మూవీ టీం. థియేట్రికల్ ట్రైలర్ ముందు ఒక స్వీట్ సర్ప్రైజ్ అంటూ మేకర్స్ విడుదల చేసిన ఈ వీడియో ని చూసి అభిమానుల మైండ్ బ్లాక్ అయ్యినంత పని అయ్యింది. నాలుగు రోజుల క్రితమే ‘#WashiOWashi’ అంటూ మూవీ టీం ఒక చిన్న వీడియో ప్రోమో ని విడుదల చేసింది. అభిమానులకు అసలు ఏంటి ఇది అనేది అర్థం కాలేదు. పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు నాడు OMI ఓజీ కి ఒక వార్నింగ్ నోటీసు ఇస్తున్నట్టు ఒక గ్లింప్స్ వీడియో ని విడుదల చేశారు గుర్తుందా. ఆ వార్నింగ్ నోటీసు కి OG ఇస్తున్న రెస్పాన్స్ అట ఈ వీడియో.
Also Read: ‘భద్రకాళి’ ఫుల్ మూవీ రివ్యూ… హిట్టా? ఫట్టా?
జపనీజ్ భాషలో పవన్ కళ్యాణ్ మాట్లాడిన ఈ మాటలు అభిమానులను ప్రత్యేకంగా ఆకర్షించింది. వింటేజ్ పవన్ కళ్యాణ్ మార్క్ ఎనర్జీ కనిపించింది ఈ వీడియో. కానీ ఒక్కటే నిరాశకు కలిగించే విషయం ఏమిటంటే, సినిమాలోని విజువల్స్ ని చూపించి ఉండుంటే బాగుండేది అని అనిపించింది. ముఖ్యంగా చివరి షాట్ చాలా రిచ్ గా అనిపించింది. కానీ బ్లర్ లో చూపించి అది కూడా సర్ప్రైజ్ కంటెంట్ గా దాచి పెట్టారు. ఒక సినిమాకు కంటెంట్ ని ఎక్కువగా రెవీల్ చేయకుండా, చాలా తక్కువ చూపించి అభిమానులను ప్రత్యేకంగా ఆకర్షించిన చిత్రం ఈమధ్య కాలం లో ఏదైనా ఉందా అంటే అది ఓజీ నే. సోషల్ మీడియా ని ఒక రేంజ్ లో ఊపేస్తున్న ఈ వీడియో ని మీరు కూడా చూసి మీ అభుప్రాయాన్ని తెలియజేయండి. పవన్ కళ్యాణ్ జపాన్ లో మాట్లాడిన ఆ మాటలకు కింద సబ్ టైటిల్స్ కూడా ఉన్నాయి చూడండి.
