Vijay Deverakonda: తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలా మంది స్టార్ హీరోలు వాళ్ల క్రేజ్ ను పెంచుకుంటూ ముందుకు దూసుకెళుతున్న విషయం మనకు తెలిసిందే. ఇక ఇలాంటి బ్యా గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చి సెటిల్ అయిన హీరోలు చాలా తక్కువ మంది ఉన్నారు. చిరంజీవి తర్వాత ఆ రేంజ్ లో సక్సెస్ ని సాధించిన వాళ్ళలో రవితేజ ఒకరు. ఇక ఆయన తర్వాత నాని లాంటి హీరో కూడా ఏ సపోర్టు లేకుండా ఇండస్ట్రీకి అయితే వచ్చారు. ఇక ఇలాంటి క్రమంలోనే విజయ్ దేవరకొండ సైతం అది మాదిరిగా వచ్చి ప్రస్తుతం స్టార్ హీరోల రేంజ్ కి వెళ్లిపోయాడు. విజయ్ చిన్నప్పుడు తను హాస్టల్లో ఉండి చదువుకునేవాడు. ఇక ఇలాంటి క్రమం లోనే వాళ్ళ నాన్న టీవీ సీరియల్ ఆర్టిస్ట్ గా తన కెరియర్ ను స్టార్ట్ చేశాడు. ఇక ఆ తర్వాత ఒక సినిమాకి డైరెక్షన్ కూడా చేయాలని అనుకున్నప్పటికి అంత తొందరగా వర్కౌట్ అయితే కాలేదట…
ఇక విజయ్ దేవరకొండ హాలిడేస్ కి హాస్టల్ నుంచి ఇంటికి వచ్చిన ప్రతిసారి వాళ్ళ నాన్నని అడుగుతూ నాన్న సినిమా ఎప్పుడు ఓకే అవుతోంది. ఎప్పుడు మూవీ చేస్తున్నారు, మనం కార్ ఎప్పుడు కొనుక్కుంటాము అంటూ అడిగేవారట. దానికి వాళ్ళ నాన్న మాత్రం తొందరలోనే సినిమా వర్కౌట్ అవుతోంది.
మనం సినిమా చేస్తాము అంటూ సమాధానం చెప్పుకుంటూ వచ్చేవారట. ఇలా చాలా సందర్భాల్లో విజయ్ వాళ్ళ నాన్నను అడిగినప్పటికి వాళ్ళ నాన్న మాత్రం ఇలానే సమాధానం చెప్పేవారట. ఇక విజయ ఇంటికి వచ్చిన ప్రతిసారి ఇంటి దగ్గర కార్లు లేకుండా జస్ట్ బైకులు మాత్రమే కనిపించేవి…విజయ్ దేవరకొండ సినిమాల్లో ట్రైల్స్ చేస్తున్న సందర్భంలో సినిమా ఇండస్ట్రీ ఎలా ఉంటుంది, వాళ్ళ నాన్న ఎందుకని ఇక్కడ అంత పెద్దగా సక్సెస్ ని సాధించలేకపోయారు అనే విషయాల పట్ల అవగాహన అయితే వచ్చిందట.
ఇక్కడ మనం అనుకున్న రీతిలో ఏది జరగదు. ఒక సినిమా ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఆ సినిమా ఎప్పుడు షూటింగ్ పూర్తి చేసుకుంటుంది. ఎప్పుడు రిలీజ్ అవుతుందనే విషయాలను చెప్పడం చాలా కష్టం…అలాగే ఎవరికి ఎప్పుడు బ్రేక్ వస్తుందనేది కూడా చెప్పడం చాలా ఇబ్బందితో కూడుకున్న పని అని ఆయన చెప్పడం విశేషం… మరి ఏది ఏమైనా కూడా పెళ్లి చూపులు సినిమా సమయంలో విజయ్ దేవరకొండ మాట్లాడిన మాటలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి…
Things won’t happen unless you make them happen.
:- #VijayDevarakonda pic.twitter.com/NiyMweQGQq
— Milagro Movies (@MilagroMovies) September 19, 2025