https://oktelugu.com/

Salaar Fight: సలార్ లో హైలెట్ అవ్వనున్న గొడ్డలి ఫైట్…ప్రశాంత్ నీల్ ఏంటి భయ్యా ఇంత వైలెంట్ గా ఉన్నాడు…

ప్రభాస్ అభిమానులకు ఈ సినిమా మీద మరింత అంచనాలు పెరుగుతున్నాయి.ఇక ఈ సినిమా మీద ప్రేక్షకులకు విపరీతమైన అంచనాలు ఉండటంతో ఈ సినిమాని చాలా స్పెషల్ గా చూస్తున్నారు.

Written By:
  • Gopi
  • , Updated On : December 21, 2023 / 06:47 PM IST

    Salaar Fight

    Follow us on

    Salaar Fight: ప్రభాస్ హీరోగా వచ్చిన సలార్ సినిమా రిలీజ్ అవ్వడానికి మరికొన్ని గంటల సమయం ఉండడంతో ఇప్పటికే ఈ సినిమాను చూసిన కొంతమంది సెలబ్రిటీలు ఈ సినిమా మీద తమ విశేషమైన స్పందనని తెలియజేస్తున్నారు.ఇక ఈ సినిమాతో ప్రభాస్ మరో రేంజ్ కి వెళ్తారు అంటూ చాలా మంది కామెంట్ చేస్తున్నారు…అలాగే ఈ సినిమాలో నటించిన నటన గాని ఆయన చూపించిన హావభావాలు గాని ఆయన చేసిన యాక్షన్ సీక్వెన్స్ లు గాని అన్ని ప్రేక్షకుల్ని కట్టిపడేసేలా ఉన్నాయంటూ ఈ సినిమా చూసిన సెలబ్రిటీలు సైతం సోషల్ మీడియా వేదిక గా వాళ్ల అభిప్రాయాన్ని పంచుకుంటున్నారు.

    ఇక దీంతో ప్రభాస్ అభిమానులకు ఈ సినిమా మీద మరింత అంచనాలు పెరుగుతున్నాయి.ఇక ఈ సినిమా మీద ప్రేక్షకులకు విపరీతమైన అంచనాలు ఉండటంతో ఈ సినిమాని చాలా స్పెషల్ గా చూస్తున్నారు. అయితే ఈ సినిమాలో హైలెట్ పాయింట్స్ ఏంటంటే పృథ్వి రాజ్ సుకుమారన్ ని చంపడానికి కొంత మంది రౌడీలు వచ్చినప్పుడు ప్రభాస్ తనని కాపాడటానికి ఒక గొడ్డలి తో ఫైట్ అనేది ఈ సినిమా లో డిజైన్ చేసినట్టు గా తెలుస్తుంది. ఈ ఫైట్ మాత్రం సినిమా మొత్తానికి హైలైట్ గా నిలువబోతున్నట్టుగా తెలుస్తుంది. ప్రశాంత్ నీల్ ఈ ఫైట్ ని చాలా జాగ్రత్తగా తీసాడనే వార్తలు కూడా ఇంతకుముందు వచ్చాయి. ఈ ఫైట్ చూస్తున్నంత సేపు ప్రేక్షకుడు కుర్చీలో నరాలు బిగపట్టుకొని కుర్చుంటాడనేది పక్క అంటూ సెలబ్రెటీ లు చెప్తున్నారు…

    ఇక దీనితో పాటు ఈ సినిమాకి ప్రశాంత్ నీల్ డైరెక్షన్ కూడా ఈ సినిమా కి చాలా వరకు ప్లస్ అయినట్టు గా కూడా చాలా వార్తలు వస్తున్నాయి…ఇక ఇది ఇలా ఉంటే ప్రభాస్ మరోసారి పాన్ ఇండియా రేంజ్ లో తన సత్తా చాటుతున్నట్టు గా కూడా చాలా వార్తలు అయితే వస్తున్నాయి…గత మూడు చిత్రాలతో డౌన్ అయిన ప్రభాస్ కెరియర్ ఒక్కసారి గా ఈ సినిమా తో తార స్థాయి లోకి వెళ్ళబోతూన్నట్టు గా కూడా తెలుస్తుంది…ఇక ఈ సినిమా తర్వాత ప్రభాస్ వరుసగా పాన్ ఇండియా సినిమా లతో దండయాత్ర చేయబోతున్నట్టు గా కూడా తెలుస్తుంది…ఇక మరికొన్ని గంటల్లో ప్రభాస్ సలార్ మన ముందుకు వస్తుంది…