INDIA Alliance : ఇండియా కూటమి సమావేశం జరుగకుముందే అనుమానాలు ఉండేవి. ఇవ్వాలా అయిపోయిన తర్వాత చూస్తే యూపీఏ కూటమినే తలపించింది. యూపీఏ కూటమిగా కూడా ఈ ఇండియా కూటమి కొనసాగే పరిస్థితులు కనిపించడం లేదు.
ఈ మీటింగ్ లో ఎవరి ఎజెండా వారిదేగా సాగుతోంది. మమతా బెనర్జీ, కేజ్రీవాల్ లు ఇండియా కూటమి ఏజెండానే మార్చేశారు. కాంగ్రెస్ సహా ఎవరికి మింగుడు పడని విధంగా మల్లికార్జున ఖర్గేను దేశ ప్రధాని అభ్యర్థిగ ఇండియా కూటమి తరుఫున ప్రకటించడమే ఇక్కడ అందరికీ షాక్ ఇచ్చినట్టైంది.
రెండోది అదే వ్యక్తులు మోడీపై ఉత్తరప్రదేశ్ లో ప్రియాంక గాంధీని పోటీకి దింపాలని పిలుపునివ్వడం కూడా కూటమిలోని ఇతర పక్షాలు బీటలు వారేలా చేసింది. ఇవన్నీ చూస్తుంటే కావాలని కేజ్రీవాల్, మమతలు ఇదంతా చేస్తున్నారని తెలుస్తోంది. కాంగ్రెస్ ను బెంగాల్ లో కలుపుకుపోమని.. కేవలం 2 సీట్లు మత్రమే ఇస్తానని మమతా ప్రకటించడం చూస్తే వారు కాంగ్రెస్ ను లైట్ తీసుకున్నట్టు అర్థమవుతోంది. ఇక ఢిల్లీలో అయితే 13 ఎంపీ సీట్లకు 13 తామే పోటీచేస్తామని కేజ్రీవాల్ చెప్పడం.. కాంగ్రెస్ కు అస్సలు సీట్లు ఇవ్వమని చెప్పడంతో ఇక ఇండియా కూటమి బీటలు వారడం ఖాయంగ కనిపిస్తోంది.
కప్పల తక్కెడగా మారిన ఇండీ కూటమి తీరుపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.