Raviteja- Kalyan Ram : హీరో రవితేజ వల్ల ఆస్తులు తాకట్టు పెట్టిన నందమూరి కళ్యాణ్ రామ్.. అసలు ఏమి జరిగిందంటే!

అప్పట్లో కళ్యాణ్ రామ్ నిర్మాతగా 'నందమూరి తారకరామారావు ఆర్ట్స్' బ్యానర్ లో 'కిక్ 2' అనే చిత్రం తెరకెక్కింది. గతంలో సురేందర్ రెడ్డి , రవితేజ కాంబినేషన్ లో వచ్చిన సూపర్ హిట్ 'కిక్' చిత్రానికి ఇది రీమేక్. ఈ సినిమాకి కూడా సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించాడు.

Written By: Neelambaram, Updated On : September 9, 2024 8:11 pm

Raviteja- Kalyan Ram

Follow us on

Raviteja- Kalyan Ram :  మాస్ మహారాజా రవితేజ అంటే ఒకప్పుడు మార్కెట్ లో మినిమం గ్యారంటీ హీరో, టాక్ తో సంబంధం లేకుండా వసూళ్లు వచ్చేస్తాయి, నిర్మాతలకు టేబుల్ ప్రాఫిట్స్ ఉంటాయి అని మంచి బ్రాండ్ ఇమేజి ఉండేది. కానీ ఈమధ్య రవితేజ బాలీవుడ్ లో అక్షయ్ కుమార్ లాగా తయారయ్యాడు. ఏడాదికి మూడు నాలుగు క్వాలిటీ లేని సినిమాలను జనాల్లోకి వదులుతూ డిజాస్టర్ ఫ్లాప్స్ అందిస్తున్నాడు. రవితేజ అభిమానులు ఇలాంటి ఫ్లాప్స్ ని తట్టుకోలేక బాధపడుతూ సోషల్ మీడియా లో ఆయన్ని ట్యాగ్ చేసి ఉత్తరాలు కూడా రాసిన సందర్భాలు ఇటీవల కాలం లో ఎన్నో మనం చూసాము. భారీ అంచనాల నడుమ విడుదలైన ‘మిస్టర్ బచ్చన్’ చిత్రం ఇచ్చిన స్ట్రోక్ అలాంటిది పాపం.

ఈ సినిమా ఫ్లాప్ అవ్వడంతో రవితేజ తాను తీసుకున్న రెమ్యూనరేషన్ లో నాలుగు కోట్ల రూపాయిలు తిరిగి ఇచ్చేసాడు, అలాగే డైరెక్టర్ హరీష్ శంకర్ కూడా రెండు కోట్లు నిర్మాతకు తిరిగి ఇచ్చాడు. ఈ సినిమానే కాదు, రవితేజ కెరీర్ లో నిర్మాతలకు భారీ నష్టాలను తెచ్చిపెట్టిన మరో సినిమా కూడా ఉంది. అప్పట్లో కళ్యాణ్ రామ్ నిర్మాతగా ‘నందమూరి తారకరామారావు ఆర్ట్స్’ బ్యానర్ లో ‘కిక్ 2’ అనే చిత్రం తెరకెక్కింది. గతంలో సురేందర్ రెడ్డి , రవితేజ కాంబినేషన్ లో వచ్చిన సూపర్ హిట్ ‘కిక్’ చిత్రానికి ఇది రీమేక్. ఈ సినిమాకి కూడా సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించాడు. 2015 వ సంవత్సరం లో భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా మొదటి ఆట నుండే ఫ్లాప్ టాక్ ని తెచ్చుకుంది. ఇందులో డైరెక్టర్ సురేందర్ రెడ్డి హీరో క్యారక్టర్ ని చాలా చక్కగా రాసుకున్నాడు, ఫస్ట్ హాఫ్ ని కూడా బాగా తీసాడు, కానీ సెకండ్ హాఫ్ మాత్రం కథ పూర్తిగా గాడి తప్పింది. దీంతో భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా కమర్షియల్ గా డిజాస్టర్ అయ్యింది. ప్రీ రిలీజ్ బిజినెస్ దాదాపుగా 42 కోట్ల రూపాయలకు జరగగా, బాక్స్ ఆఫీస్ రన్ కనీసం 17 కోట్ల రూపాయలకు కూడా చేరలేదు. దీంతో నిర్మాత కళ్యాణ్ రామ్ బయ్యర్స్ దగ్గర తీసుకున్న డబ్బులు మొత్తం తిరిగి ఇచేయాల్సి వచ్చింది.

ఈ క్రమం లో ఆయన తన విలువైన ఆస్తిని కూడా కొంతకాలం తాకట్టు పెట్టాల్సిన దుస్థితి ఏర్పడింది. ఎందుకంటే నందమూరి ఆర్ట్స్ బ్యానర్ లో కేవలం ‘అతనొక్కడే’ చిత్రం మాత్రమే అప్పటి వరకు సూపర్ హిట్ గా ఉండేది. ఆ తర్వాత ఆ బ్యానర్ కి సరైన హిట్స్ లేవు. అన్ని సినిమాలు నష్టాలే తెచ్చి పెట్టాయి, కిక్ 2 చిత్రం ఇంకా ఎక్కువ నష్టాలను తెచ్చి పెట్టింది. ఈ సినిమా తెచ్చిన నష్టాల నుండి బయటపడేందుకు కళ్యాణ్ కి చాలా సమయమే పట్టింది. ఎన్టీఆర్ తో తీసిన ‘జై లవ కుశ’ చిత్రంతో కళ్యాణ్ రామ్ తాను తాకట్టు పెట్టిన విలువైన ఆస్తులను వెనక్కి తెచ్చుకున్నాడు.