Amitabh Bachchan: బాలీవుడ్ అంటే మన అందరికీ గుర్తుకు వచ్చే పేరు బిగ్ బి అమితాబ్ బచ్చన్(Amitabh Bachchan). కేవలం బాలీవుడ్ ఒక్కటే కాదు, ఇండియన్ సినిమా ఇండస్ట్రీ కి ముఖ చిత్రం లాంటోడు ఆయన. ప్రస్తుతం ఆయన వయస్సు 82 ఏళ్ళు. ఇప్పటికీ ఆయన యాక్టీవ్ గా సినిమాలను చేస్తూనే ఉన్నాడు. ఈ వయస్సు లో కూడా ఆయన ‘కల్కి’ లో ఎలాంటి పాత్ర పోషించాడో మనమంతా చూసాము. ఒకానొక దశలో ఈ సినిమాలో హీరో ప్రభాసా(Rebel Star Prabhas)?, లేకపోతే అమితాబ్ బచ్చన్ నా? అనే సందేహం కలిగింది. ఆ రేంజ్ లో ఆయన తన స్క్రీన్ ప్రెజెన్స్ తో ఫైటింగ్ సన్నివేశాల్లో డామినేట్ చేసాడు. ఒకప్పుడు అమితాబచ్చన్ చేసినన్ని యాక్షన్ హీరో రోల్స్ ఇండియా లో ఏ హీరో కూడా చేయలేదు. పూరి జగన్నాథ్ మార్క్ హీరోయిజం ని ఆయన మన తల్లిదండ్రులు చిన్నతనం లో ఉన్న రోజుల్లోనే చేసాడు.
అందుకే అమితాబ్ బచ్చన్ అంటే అన్ని ఇండస్ట్రీ లకు సంబంధించిన వారు ఆ స్థాయిలో గౌరవిస్తూ ఉంటారు. అమితాబ్ బచ్చన్ జీవితం మొత్తం సాఫీగా ఏమి సాగిపోలేదు. మధ్యలో ఆయన ఎన్నో ఒడిదుడుగులు ఎదురుకోవాల్సి వచ్చింది. రెండు సార్లు ప్రాణాలు కోల్పోయే రేంజ్ లో ఆయనకు ప్రమాదాలు కూడా జరిగాయి. ఆస్తులు పోగొట్టుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉంది. అలా పడి లేచే కెరటం లాగా ఆయన జీవితం కొనసాగింది. ఆయన జీవిత కాలం మొత్తం మీద దాదాపుగా 3,190 కోట్ల రూపాయిల ఆస్తులను సంపాదించాడు. ఇప్పటికీ, ఈ వయస్సు లో కూడా ఆయన సంపాదిస్తూనే ఉన్నాడు. కొడుకు అభిషేక్ బచ్చన్(Abhishek Bachchan) హీరో గా ఎంట్రీ ఇచ్చి పలు సూపర్ హిట్ సినిమాలు చేసాడు కానీ, ఇప్పుడు ఆయన ఇమేజ్ మొత్తం డౌన్ అయిపోయింది, మార్కెట్ లేకపోవడం సినిమాలు చేయడానికి కూడా ఎవ్వరూ ముందుకు రావడం లేదు.
దీంతో అభిషేక్ బచ్చన్ ప్రస్తుతం ఇంటికే పరిమితం అయిపోయాడు. హీరో రోల్స్ రాకపోవడంతో క్యారక్టర్ రోల్స్ చేయడానికి సిద్ధంగా ఉన్నాడు కానీ, ఆయనకు ఎవ్వరూ అవకాశాలు ఇవ్వడం లేదు. కొడుకు ఇంట్లో ఉంటే 80 ఏళ్ళ వయస్సు ఉన్నటువంటి అమితాబ్ బచ్చన్ ఇప్పటికీ సినిమాలు చేస్తూనే ఉన్నాడు. కోట్ల రూపాయిలు సంపాదిస్తూనే ఉన్నాడు. ఇది ఇలా ఉండగా అమితాబ్ బచ్చన్ ఎన్నో ఏళ్ళ నుండి ‘కౌన్ బనేగా కరోడ్ పతి’ అనే గేమ్ షో కి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. రీసెంట్ గా ఆయన ఒక కంటెస్టెంట్ తో తన ఆస్తుల వివరాల గురించి చెప్తూ, ఈ ఆస్తి మొత్తం నేను చనిపోయిన తర్వాత అభిషేక్ బచ్చన్ కి చెందుతుందని అందరూ అనుకుంటున్నారు, కానీ అందులో ఎలాంటి నిజం లేదు. అభిషేక్ బచ్చన్ తో పాటు నా కూతురు, మనవాళ్ళు, మానవరాళ్లకు కూడా సమానంగా పంచుతాను అని చెప్పుకొచ్చాడు అమితాబ్ బచ్చన్.
Also Read: ఫైనల్ లో రోహిత్ పరిణతి… హాఫ్ సెంచరీతో జట్టుకు ఊపిరి