Pawan Kalyan And Prabhas: ఈ సమ్మర్ కి టాలీవుడ్ స్టార్ హీరోల నుండి ఒక్క సినిమా కూడా వచ్చే అవకాశం లేదా?, ఇలా అయితే ఇండస్ట్రీ కి చాలా నష్టం చేకూరుతుంది అని ట్రేడ్ విశ్లేషకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముందు అనుకున్న ప్లాన్ ప్రకారం, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) నటించిన ‘హరి హర వీరమల్లు'(Hari Hara Veeramallu) చిత్రం ఈ నెల 28 న విడుదల కావాలి, అదే విధంగా రెబెల్ స్టార్ ప్రభాస్(Rebel Star Prabhas) నటించిన ‘రాజా సాబ్'(Raja saab Movie) చిత్రం ఏప్రిల్ 10న రావాలి. కానీ ఇప్పుడు వాళ్లిద్దరూ ఆ డేట్స్ లో రావడం లేదు. కనీసం మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) ‘విశ్వంభర'(Viswambhara Movie) చిత్రం అయినా మే నెలలో వస్తుందని అనుకుంటే, ఆ సినిమాకి సంబంధించిన VFX వర్క్ బోలెడంత పెండింగ్ లో ఉందట. వాస్తవానికి VFX పనులు పూర్తి అయ్యాయి. కానీ టీజర్ కి వచ్చిన ఫీడ్ బ్యాక్ ని చూసి మళ్ళీ రీ వర్క్ చేయించడం మొదలు పెట్టారు. దీంతో ఈ చిత్రం మే లో రావడం కష్టమే అని అంటున్నారు.
ఇక పవన్ కళ్యాణ్ ‘హరి హర వీరమల్లు’ సినిమా విషయానికి వస్తే, పవన్ కళ్యాణ్ కేవలం నాలుగు రోజుల షూటింగ్ కి డేట్స్ ఇస్తే చాలు, ఈ సినిమా పూర్తి అవుతుంది. సినిమా అయితే పూర్తి అవుతుంది కానీ, VFX వర్క్ చాలా వరకు బ్యాలన్స్ ఉందట. మార్చ్ నెల మిస్ అయినా , ఏప్రిల్ లో అయినా విడుదల అవుతుందని అనుకున్నారు ఫ్యాన్స్. కానీ ఏప్రిల్ లో కూడా కష్టమే అని అంటున్నారు. VFX పనులు చాలా ఆలస్యం అయ్యే అవకాశాలు ఉన్నాయి, అదే విధంగా కొత్తగా పవన్ కళ్యాణ్ తో చేయబోయే సన్నివేశాలకు కూడా VFX చేయాలట. ఇవన్నీ పూర్తి అవ్వడానికి కనీసం నెల రోజుల సమయం పడుతుంది. అంటే ఏప్రిల్ నెల మొత్తం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరగబోతున్నాయి అన్నమాట.
అదే కనుక నిజమైతే ప్రొమోషన్స్ కోసం కనీసం 20 రోజుల సమయం అయినా కావాలి, అంటే మే నెలలో కూడా ఈ చిత్రం రాకపోవచ్చని లేటెస్ట్ గా వినిపిస్తున్న సమాచారం. విడుదల తేదీ పై ఈ నెలాఖరు లోపు క్లారిటీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇక ప్రభాస్ ‘రాజా సాబ్’ మీద పూర్తిగా ఆశలు వదిలేసుకోవాల్సిందే. ఈ సమ్మర్ లో వచ్చే అవకాశాలే లేవట. ఈ సినిమాకి కూడా విశ్వంభర కి ఉన్నట్టుగానే VFX సమస్యలు ఉన్నాయట. రీసెంట్ గానే ఔట్పుట్ ని చూసిన ప్రభాస్ తీవ్రమైన అసంతృప్తి వ్యక్తం చేసాడని, VFX అద్భుతంగా వచ్చే వరకు విడుదుల తేదీని ప్రకటించవద్దని మేకర్స్ కి చాలా గట్టిగా చెప్పాడట. దీంతో ఈ చిత్రం ఈ ఏడాది డిసెంబర్ వరకు విడుదల అయ్యే అవకాశాలు లేవని లేటెస్ట్ గా అందుతున్న సమాచారం.
Also Read: ఫైనల్ లో రోహిత్ పరిణతి… హాఫ్ సెంచరీతో జట్టుకు ఊపిరి