Amitabh Bachchan: బాలీవుడ్ స్టార్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తనదైన నటనతో బాలీవుడ్ ను శాసిస్తున్న బిగ్ బీ దేశ విదేశాల్లో కోట్లలో అభిమానులను సంపాదించుకున్నారు. అమితాబ్ ఇప్పటి వరకు పలు ప్రకటనల్లో నటించిన విషయం తెలిసిందే. కాగా ఇటీవల కమలా పసంద్ అనే పాన్ మసాలా యాడ్ లో కూడా అమితాబ్ నటించారు. యువకులు పొగాకుకు అలవాటు పడకుండా చేయడంలో సహాయపడటానికి పాన్ మసాలా బ్రాండ్‌ను ప్రచారం మానుకోవాలని జాతీయ పొగాకు వ్యతిరేక సంస్థ అభ్యర్థించడంతో అక్టోబర్‌లో కమ్లా పసంద్ ప్రచారం నుండి వైదొలుగుతున్నట్లు ఆయన ప్రకటించారు.
ఈ యాడ్ లో నటించినందుకు బచ్చన్ ను సోషల్ మీడియాలో ట్రోల్ కూడా చేశారు. అయితే తాజాగా ఈ పాన్ మసాల బ్రాండ్‌కు లీగల్ నోటీసు పంపారు అమితాబ్. కాంట్రాక్ట్ ముగిసినప్పటికీ తనతో కూడిన టీవీ వాణిజ్య ప్రకటనలను ప్రసారం చేస్తున్నందుకు గాను లీగల్ నోటీసు పంపినట్లు తెలుస్తుంది. దీంతో ఈ ప్రకటనల ప్రసారం రద్దు చేయాలని ‘కమలా పసంద్’ పాన్ మసాల బ్రాండ్‌కు అమితా బచ్చన్ లీగల్ నోటీస్ ఇచ్చారు. కాగా అమితాబ్ పాన్ మసాల బ్రాండ్ ప్రకటన ప్రసారం అయిన కొన్ని రోజులకు అందులో నుంచి వైదొలిగారు. ఒప్పందం చేసుకునేప్పుడు, అది సర్రోగేట్ అడ్వర్టైజింగ్ కిందకు వస్తుందని తెలియదని తెలిసిన తర్వాత ఈ బ్రాండ్‌తో ఒప్పందాన్ని రద్దు చేసుకున్నాట్లు అమితాబ్ తెలిపారు. ప్రమోషన్ కోసం తీసుకున్న డబ్బును కూడా తిరిగి ఇచ్చినట్లు ఆయన వివరించారు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.