NAVAL Dockyard Jobs: విశాఖపట్నం నావల్‌ డాక్‌యార్డ్‌లో ఉద్యోగ ఖాళీలు.. ఎవరు అర్హులంటే?

NAVAL Dockyard Jobs: విశాఖపట్నంలోని నావల్‌ డాక్‌యార్డ్‌ అప్రెంటిస్‌ స్కూల్‌ నిరుద్యోగులకు తీపికబురు అందించింది. 275 ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం ఈ సంస్థ నుంచి జాబ్ నోటిఫికేషన్ రిలీజైంది. భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు సంబంధించిన ఈ సంస్థ వేర్వేరు ట్రేడులలో ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయడానికి సిద్ధమైంది. ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రానిక్స్‌ మెకానిక్, ఫిట్టర్, ఇన్‌స్ట్రుమెంట్‌ మెకానిక్, మెషినిస్ట్, పెయింటర్‌ ఉద్యోగ ఖాళీలను ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. పదో తరగతి […]

Written By: Kusuma Aggunna, Updated On : November 21, 2021 3:14 pm
Follow us on

NAVAL Dockyard Jobs: విశాఖపట్నంలోని నావల్‌ డాక్‌యార్డ్‌ అప్రెంటిస్‌ స్కూల్‌ నిరుద్యోగులకు తీపికబురు అందించింది. 275 ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం ఈ సంస్థ నుంచి జాబ్ నోటిఫికేషన్ రిలీజైంది. భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు సంబంధించిన ఈ సంస్థ వేర్వేరు ట్రేడులలో ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయడానికి సిద్ధమైంది. ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రానిక్స్‌ మెకానిక్, ఫిట్టర్, ఇన్‌స్ట్రుమెంట్‌ మెకానిక్, మెషినిస్ట్, పెయింటర్‌ ఉద్యోగ ఖాళీలను ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు.

పదో తరగతి 50 శాతం మార్కులతో సంబంధిత ట్రేడులలో 65 శాతం మార్కులతో పాసైన వాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలకు అర్హులని చెప్పవచ్చు. 2001 సంవత్సరం ఏప్రిల్ 1 నుంచి 2008 సంవత్సరం ఏప్రిల్ 1 మధ్య జన్మించిన వాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలకు అర్హులని చెప్పవచ్చు. ఆన్ లైన్ విధానంలో లేదా ఆఫ్ లైన్ విధానంలో ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకునే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు.

నావల్‌ డాక్‌యార్డ్‌ అప్రెంటిస్‌ స్కూల్, వీఎం నావల్‌ బేస్‌ ఎస్‌.ఓ, పీ.ఓ. విశాఖపట్నం–530014, ఆంధ్రప్రదేశ్‌ అడ్రస్‌ కు దరఖాస్తులను పంపి ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఇంటర్వ్యూ, మెడికల్‌ టెస్ట్‌ ఆధారంగా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. అబ్జెక్టివ్ విధానంలో ఈ పరీక్ష జరగనుండగా అర్హత సాధించిన అభ్యర్థులను ఈ ఉద్యోగ ఖాళీల కొరకు ఇంటర్వ్యూలకు పిలుస్తారు.

2021 సంవత్సరం డిసెంబర్ 5 ఆన్ లైన్ లో ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉండగా 2021 సంవత్సరం డిసెంబర్ 14వ తేదీ హార్డ్ కాపీలను పంపించడానికి చివరి తేదీగా ఉంది. https://www.apprenticeshipindia.gov.in/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు.