https://oktelugu.com/

ప్రభాస్ సినిమాలో గెస్ట్ రోల్ కే 22 కోట్లు !

నేషనల్ స్టార్ అయ్యాక ప్రభాస్ ఏం చేసినా నేషనల్ వైడ్ గా హాట్ టాపిక్ అయిపోతుంది. ఇక ప్రభాస్ హీరోగా, క్రియేటివ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందే సైన్స్ ఫిక్షన్ చిత్రంలో ఓ గెస్ట్ రోల్ ఉంది. అయితే సహజంగా గెస్ట్ రోల్ చేసినందుకు అసలు రెమ్యునరేషన్ తీసుకోరు. కానీ ప్రభాస్ సినిమాలో గెస్ట్ రోల్ లో నటిస్తోన్నందుకు ఏకంగా 22 కోట్లు తీసుకున్నారట. ఇంతకీ ఆ గెస్ట్ రోల్ ఎవరు చేస్తున్నారు అంటే.. అమితాబ్ […]

Written By:
  • admin
  • , Updated On : December 2, 2020 / 02:39 PM IST
    Follow us on


    నేషనల్ స్టార్ అయ్యాక ప్రభాస్ ఏం చేసినా నేషనల్ వైడ్ గా హాట్ టాపిక్ అయిపోతుంది. ఇక ప్రభాస్ హీరోగా, క్రియేటివ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందే సైన్స్ ఫిక్షన్ చిత్రంలో ఓ గెస్ట్ రోల్ ఉంది. అయితే సహజంగా గెస్ట్ రోల్ చేసినందుకు అసలు రెమ్యునరేషన్ తీసుకోరు. కానీ ప్రభాస్ సినిమాలో గెస్ట్ రోల్ లో నటిస్తోన్నందుకు ఏకంగా 22 కోట్లు తీసుకున్నారట. ఇంతకీ ఆ గెస్ట్ రోల్ ఎవరు చేస్తున్నారు అంటే.. అమితాబ్ బచ్చన్. మరి అమితాబ్ కాబట్టి.. ఆయన స్థాయికి తగ్గట్లు ఉండాలి కాబట్టి 22 కోట్లు ఇస్తున్నట్లు ఉన్నారు.

    Also Read: లీడింగ్ పార్టీలోకి ఒకప్పటి స్టార్ హీరోయిన్ !

    ఏది ఏమైనా కొన్ని నిముషాల పాత్ర కోసం 22 కోట్లు అంటే.. మాములు విషయం కాదు. ఐతే, ఈ పాత్ర కోసం అమితాబ్ గట్టిగానే డిమాండ్ చేసినట్లు బాలీవుడ్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అందుకే మేకర్స్ కూడా 22 కోట్ల పారితోషికం ఇవ్వడానికి ముందుకు వచ్చారని.. ఎలాగూ నాలుగు వందల కోట్ల రూపాయల బడ్జెట్ మూవీ కావడంతోనే.. అమితాబ్ కి అంత పారితోషికం ఇచ్చారని.. దానికి తగ్గట్లే తన పారితోషికాన్ని అమితాబ్ కూడా అడిగారని తెలుస్తోంది. అయినా బాలీవుడ్ లో మార్కెట్ కోసం హీరోయిన్ గా దీపికా పదుకోన్ పెట్టుకున్నారు. ఆమెకు కూడా భారీగానే ముట్టజెబుతున్నారు.

    Also Read:: పవన్ కళ్యాణ్ పై భక్తుడు ఎమోషనల్ ట్వీట్స్ !

    పైగా సినిమాకి దీపికా పాత్ర చాలా ఇంపార్టెంట్ అని అందుకే, ఆమెకు కూడా 25 కోట్లు వరకూ ఇస్తున్నారని తెలుస్తోంది. అంత భారీ మొత్తం ఇస్తున్నారంటే మాటలా..! అసలు ఒక క్యారెక్టర్ రోల్ కి అంత భారీ పారితోషికం ఇస్తున్న నిర్మాత అశ్విన్ దత్ ఏ నమ్మకంతో అంత ఖర్చు పెడుతున్నాడో. ఏది ఏమైనా ప్రభాస్ మార్కెట్ ను దృష్టిలో పెట్టుకునే మేకర్స్ కాస్త డేర్ గా ముందుకు వెళ్తున్నారు. అయితే ఇంతకుముందు చిరంజీవి హీరోగా రూపొందిన “సైరా” సినిమాలో అమితాబ్ ఒక కీలక పాత్ర పోషించినా.. ఆ సినిమాలో ఆయన అసలు పారితోషికమే తీసుకోలేదు. కానీ ప్రభాస్ సినిమాకి మాత్రం 22 కోట్లు డిమాండ్ చేసి మరీ తీసుకున్నాడు.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్