https://oktelugu.com/

పవన్ కళ్యాణ్ పై భక్తుడు ఎమోషనల్ ట్వీట్స్ !

హైదరాబాద్ లో ఎన్నికలు ముగిశాయి కాబట్టే.. నిర్మాత బండ్ల గణేష్ ఇప్పుడు నోరు విప్పుతున్నాడట. పవన్ కళ్యాణ్ పై ప్రకాష్ రాజ్ చేసిన కామెంట్స్ పై ఇప్పుడు తీరిగ్గా మాట్లాడుతున్నాడు బండ్ల బాబు. ఎన్నికల టైంలో స్పందిస్తే రాజకీయం అనుకుంటారని సైలెంట్ గా ఉన్నాడట, లేకపోతే మాములుగా ఉండదు అని తన శైలిలో చెప్పుకొస్తూ.. ఎప్పటిలాగే ట్వీట్ చేశాడు. “నేను ఈ రోజు అనుభవిస్తున్న ఈ స్థాయి నాకు పవన్ కళ్యాణ్ పెట్టిన భిక్ష. నాకు కృతజ్ఞత […]

Written By:
  • admin
  • , Updated On : December 2, 2020 / 02:27 PM IST
    Follow us on


    హైదరాబాద్ లో ఎన్నికలు ముగిశాయి కాబట్టే.. నిర్మాత బండ్ల గణేష్ ఇప్పుడు నోరు విప్పుతున్నాడట. పవన్ కళ్యాణ్ పై ప్రకాష్ రాజ్ చేసిన కామెంట్స్ పై ఇప్పుడు తీరిగ్గా మాట్లాడుతున్నాడు బండ్ల బాబు. ఎన్నికల టైంలో స్పందిస్తే రాజకీయం అనుకుంటారని సైలెంట్ గా ఉన్నాడట, లేకపోతే మాములుగా ఉండదు అని తన శైలిలో చెప్పుకొస్తూ.. ఎప్పటిలాగే ట్వీట్ చేశాడు. “నేను ఈ రోజు అనుభవిస్తున్న ఈ స్థాయి నాకు పవన్ కళ్యాణ్ పెట్టిన భిక్ష. నాకు కృతజ్ఞత అనేది నా రక్తంలో ఉంది,” అని బండ్ల గణేష్ ఎమోషనల్ గా ట్వీట్ చేశాడు. కాకపోతే అది మరీ కామెడీగా ఉందనుకోండి. అయినా అంత కృతజ్ఞత ఉన్నప్పుడు గత ఎన్నికల సమయంలో తన దైవం పెట్టిన పార్టీలో చేరకుండా, బండ్ల కాంగ్రెస్ లో ఎందుకు చేరాడో.. ఇంతవరకు దీనికి బండ్ల సమాధానం చెప్పలేదు అనుకోండి.

    Also Read: షకీలా జీవిత చరిత్రకి గ్రీన్ సిగ్నల్ !

    అన్నట్లు బండ్ల బాబు మరో ట్వీట్ లో “ఈ రోజు తెలుగు ఇండస్ట్రీలో ఎంతోమంది దర్శకులు, ఎంతో మంది సాంకేతిక నిపుణులు ఎంతోమంది నిర్మాతల్ని పరిచయం చేసిన ఘనత మా దైవం పవన్ కళ్యాణ్ ది. పవన్ కళ్యాణ్ మహోన్నతమైన వ్యక్తి. రాజకీయాలు ఎవరైనా చేసుకోవచ్చు, రాజకీయాలు ఎవరైనా మాట్లాడుకోవచ్చు, కాని వ్యక్తిత్వం గురించి పవన్ కళ్యాణ్ గురించి ఎవరు మాట్లాడినా నేను సహించను, పవన్ కళ్యాణ్ నా దృష్టిలో నాకు ఎప్పటికీ దైవంతో సమానం,” అంటూ సుదీర్ఘ ట్వీట్లు పెట్టాడు బండ్ల బాబు. మరి గత ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ను పావలా కళ్యాణ్ అంటూ చిన్నాచితకా రాజకీయ నాయకులు కూడా నానామాటలు అన్నపుడు ఈ బండ్ల బాబు ఏమైపోయాడు?

    Also Read: లీడింగ్ పార్టీలోకి ఒకప్పటి స్టార్ హీరోయిన్ !

    అంటే ప్రస్తుతం పవన్ కళ్యాణ్, బండ్ల బాబుకు మరో సినిమా ఇచ్చే అవకాశం ఉంది కాబట్టి.. పైగా కథను కూడా రెడీ చేసుకోమని చెప్పాడు కాబట్టి.. ఇప్పుడు బండ్ల గణేష్ ఇలా ట్వీట్స్ చేసుకుంటూ ముందుకు వచ్చాడు అనుకోవాలేమో. పవన్ కళ్యాణ్ తో “గబ్బర్ సింగ్” సినిమాను నిర్మించి నిర్మాతగా తనకంటూ ఓ రెండు మూడు హిట్లును అందుకున్న క్రెడిట్ బండ్లకు దక్కింది. మళ్ళీ, ఇప్పుడు మరో సినిమా నిర్మించాలని ప్రయత్నిస్తున్నాడు. అది కూడా హిట్ అయితే.. నిర్మాతగా బండ్లకు మరో పదేళ్లు లైఫ్ ఉంటుంది. దాని కోసమే ఈ బాధ ఏమో.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్