https://oktelugu.com/

Amaran Movie Collection :  ‘దేవర’ క్లోజింగ్ కలెక్షన్స్ ని దాటేయనున్న ‘అమరన్’..13 రోజుల్లో ఇంత కలెక్షన్స్ ఎలా సాధ్యం?

'దేవర' చిత్రానికి అన్ని ప్రాంతీయ భాషలకు కలిపి 390 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. అమరన్ ఈ వీకెండ్ తో 300 కోట్ల రూపాయిల గ్రాస్ మార్కుని అందుకుంటుంది. మొత్తం మీద ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాకి తెలుగు, తమిళ భాషలకు కలిపి ప్రాంతాల వారీగా 13 రోజులకు ఎంత వసూళ్లను రాబట్టిందో ఒకసారి చూద్దాము.

Written By:
  • Vicky
  • , Updated On : November 13, 2024 / 05:23 PM IST

    Amaran Movie Collection

    Follow us on

    Amaran Movie Collection :  ఈ ఏడాది మీడియం రేంజ్ హీరోల సినిమాలు పెద్ద హీరోల సినిమాలను డామినేట్ చేయడం చాలా సాధారణం అయిపోయింది. ఏడాది ప్రారంభంలో సంక్రాంతి కానుకగా విడుదలైన మహేష్ బాబు ‘గుంటూరు కారం’ చిత్రాన్ని, తేజ సజ్జ లాంటి చిన్న హీరో ‘హనుమాన్’ తో వసూళ్ల పరంగా డామినేట్ చేయడం అందరినీ ఆశ్చర్యపోయేలా చేసింది. ఇప్పుడు రీసెంట్ గా తమిళనాడు లో బాక్స్ ఆఫీస్ వద్ద ప్రకంపనలు పుట్టిస్తున్న శివ కార్తికేయన్ ‘అమరన్’ చిత్రం అక్కడి స్టార్ హీరోలైన రజినీకాంత్, విజయ్ క్లోజింగ్ కలెక్షన్స్ ని అధిగమించే దిశగా అడుగులు వేస్తుంది. సినిమాకి వస్తున్నా డైలీ గ్రాస్ వసూళ్ల ట్రెండ్ ని చూస్తుంటే ఈ సినిమా రీసెంట్ గా విడుదలైన ఎన్టీఆర్ ‘దేవర’ మూవీ ఫుల్ రన్ కలెక్షన్స్ ని కూడా దాటేస్తుందని అంటున్నారు.

    ‘దేవర’ చిత్రానికి అన్ని ప్రాంతీయ భాషలకు కలిపి 390 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. అమరన్ ఈ వీకెండ్ తో 300 కోట్ల రూపాయిల గ్రాస్ మార్కుని అందుకుంటుంది. మొత్తం మీద ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాకి తెలుగు, తమిళ భాషలకు కలిపి ప్రాంతాల వారీగా 13 రోజులకు ఎంత వసూళ్లను రాబట్టిందో ఒకసారి చూద్దాము. ముందుగా తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే ఈ సినిమాని కేవలం 5 కోట్ల 50 లక్షల రూపాయలకు కొనుగోలు చేసారు. 13 రోజులకు కలిపి 31 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్, 18 కోట్ల 32 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. అంటే దాదాపుగా 13 కోట్ల రూపాయిల లాభం వచ్చింది అన్నమాట. ఫుల్ రన్ లో మరో 20 కోట్ల రూపాయిల గ్రాస్ ని రాబట్టే అవకాశం ఉందని అంటున్నారు ట్రేడ్ పండితులు.

    మిగిలిన ప్రాంతాల్లో వచ్చిన వసూళ్లను చూస్తే, తమిళనాడు లో 123 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టిన ఈ సినిమా, కర్ణాటక ప్రాంతంలో 18 కోట్ల రూపాయిలు, కేరళ లో 9 కోట్ల రూపాయిలు, రెస్ట్ ఆఫ్ ఇండియా లో రెండు కోట్ల 40 లక్షల రూపాయిలు, ఓవర్సీస్ లో 75 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను సాధించింది. ఓవరాల్ గా 13 రోజులకు ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా 258 కోట్ల రూపాయిల గ్రాస్, 127 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. ఇప్పటికే తమిళనాడులో రజినీకాంత్ ‘వెట్టియాన్’ క్లోజింగ్ వసూళ్లను దాటేసింది. త్వరలోనే ఎన్టీఆర్ ‘దేవర’ ని కూడా దాటేస్తుందని అంచనా వేస్తున్నారు మేకర్స్. హిందీ వెర్షన్ వసూళ్ల సహాయం లేకుండా కేవలం తెలుగు, తమిళ బాషల నుండి ఇంత వసూళ్లు రావడం అనేది సాధారణమైన విషయం కాదు. ఒకవేళ హిందీ వెర్షన్ కూడా విడుదల అయ్యుంటే ఇక ఏ రేంజ్ వసూళ్లు ఉండేవో అని ట్రేడ్ పండితులు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తూ పోస్టులు వేస్తున్నారు.