Amaran movie collection : ఈ ఏడాది తమిళనాడు లో ఒక కొత్త సూపర్ స్టార్ తయారయ్యాడు. అతనే శివ కార్తికేయన్. సూపర్ స్టార్ రజినీకాంత్ కి 70 ఏళ్ళు వచ్చేసాయి, ఆయన మార్కెట్ బాగా తగ్గిపోతుంది. ఇళయ తలపతి విజయ్ సినిమాలను పూర్తిగా వదిలేసి రాజకీయాల్లోకి వెళ్తున్నాడు. మరో స్టార్ హీరో అజిత్ నేటి తరం ఆడియన్స్ కి తగ్గట్టు సినిమా చెయ్యట్లేదు. ఇక సూర్య సంగతి సరేసరి. పదేళ్ల నుండి ఫామ్ లో లేదు, భవిష్యత్తులో ఫామ్ లోకి వస్తాడు అనే ఆశ కూడా తమిళ ఆడియన్స్ కి లేదు. సరిగ్గా ఇలాంటి సమయంలోనే శివ కార్తికేయన్ రీసెంట్ గా విడుదలైన ‘అమరన్’ చిత్రం తో భారీ బ్లాక్ బస్టర్ హిట్ ని అందుకొని స్టార్ లీగ్ లోకి అడుగుపెట్టాడు. మేజర్ ముకుంద్ వరదరాజన్ జీవిత చరిత్ర ని ఆధారంగా తీసుకొని తెరకెక్కించిన ఈ చిత్రం దీపావళి కానుకగా విడుదలై సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ గా నిల్చింది.
మూడు వారాల్లో ఎన్నో మైల్ స్టోన్స్ ని దాటుతూ ముందుకు వెళ్లిన ఈ చిత్రం, 21 రోజులకు గాను ప్రపంచవ్యాప్తంగా ప్రాంతాలవారీగా ఎంత వసూళ్లను రాబట్టిందో ఒకసారి వివరంగా చూద్దాము. తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రానికి మూడు వారాలకు 41 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు, 23 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లు వచ్చాయి. ఇది సాధారణమైన వసూళ్లు కాదు. 21వ రోజున కూడా ఈ చిత్రానికి 28 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చిందంటే, ఏ స్థాయి బ్లాక్ బస్టర్ హిట్ అనేది అర్థం చేసుకోవచ్చు. అదే విధంగా తమిళనాడు లో కూడా ఈ చిత్రానికి డ్రీం లాంగ్ రన్ వస్తుంది. మూడు వారాలకు ఈ సినిమాకి అక్కడ 146 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చిందట. ఇప్పటి వరకు కేవలం రజినీకాంత్, కమల్ హాసన్, విజయ్ వంటి హీరోలకు మాత్రమే ఈ రేంజ్ వసూళ్లు వచ్చాయి. వాళ్ళ తర్వాత ఆ రేంజ్ వసూళ్లు శివ కార్తికేయన్ కి మాత్రమే వచ్చింది.
ఇక మిగిలిన ప్రాంతాల విషయానికి వస్తే కర్ణాటకలో 21 కోట్ల 60 లక్షల గ్రాస్ వసూళ్లను రాబట్టిన ఈ సినిమాకి, కేరళలో 12 కోట్ల రూపాయిలు, రెస్ట్ ఆఫ్ ఇండియా లో 4 కోట్ల 30 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చింది. ఇక ఓవర్సీస్ లో అయితే ఈ వీకెండ్ తో ఈ చిత్రం ప్రభాస్ సలార్ ఫుల్ రన్ గ్రాస్ వసూళ్లను దాటేయబోతుంది. సలార్ చిత్రానికి ఓవర్సీస్ లో 80 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు రాగా, అమరన్ కి ఇప్పటి వరకు 77 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చింది. ఓవరాల్ గా ఈ చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా 302 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు, 148 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. ఈ ఏడాది భారీ అంచనాల నడుమ విడుదలైన దేవర చిత్రానికి 200 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చింది. మరి అమరన్ చిత్రం ఆ రేంజ్ వసూళ్లను ఫుల్ రన్ రాబడుతుందా లేదా అనేది చూడాలి.